Tuesday, April 12, 2022

అహంభావం కాలిపోతుంది..

అహంభావం కాలిపోతుంది..
అసూయ బూడిదైపోతుంది..
అందం మన్నుపాలవుతుంది..
ఆయువు పంచభూతాల్లో కలిసిపోతుంది..
ఆవేశం మండిపోతుంది..
బంధనాలు తెగిపోతున్నాయి..
సర్వస్వం బుగ్గి పాలవుతుంది..

ఈ క్షణం కోసమేనా మనిషి నిరంతరం
నేను,నాది అని విర్రవీగేది..
ఈ గడియ కోసమేనా మోసాలు,హత్యలు,
నమ్మకద్రోహాలు చేసేది..
ఈ రోజు కోసమేనా ఆస్తులు,అంతస్తులు
అంటూ పంతాలకు పోయేది..
ఈ సమయం కోసమేనా కనిపెంచిన తల్లిదండ్రులను
వృద్ధాశ్రమాల్లో వదిలేసేది..
ఈ కాలం కోసమేనా బంధాలను,బంధుత్వాలను
నిర్లక్ష్యం చేసేది..
ఈ దినం కోసమేనా జీవితమంతా నటిస్తూ
బ్రతికేది..
ఈ నిజం కోసమేనా మానవత్వాన్ని మరిచి
మృగంలా మారేది..
ఈ సత్యం కోసమేనా నీ అంతరాత్మను మోసం
చేసుకుంటూ జీవించేది.
ఈరోజు కోసమేనా!?

అదిగో ఆరోజు రానే వచ్చింది.
ఏమొచ్చింది నీకు కూడా!?
పట్టు పరుపులు రాలేదు
ఒంటిపై తుండు గుడ్డ రాలేదు
వీసమెత్తు బంగారం రాలేదు
కాలిన బూడిద కూడా రాలేదు
ఏదీ నీవెంట రాదు..

మరి ఎమ్ మిగిలింది నీకు..
నీవు చేసిన మంచితనం
నీవు పంచిన జ్ఞాపకాలు
అవి మాత్రమే నీవు మరణించినా
నిను ప్రేమించిన వారి హృదయాల్లో
నిను చిరంజీవిని చేసాయి.

సేకరణ

No comments:

Post a Comment