Tuesday, April 12, 2022

ఏమ్చెప్పమంటావు ఆంజనేయ!? రామ రాజ్యం అని పేరేగాని అడుగడుగున రావణాసురులే!!

ఏమ్చెప్పమంటావు
ఆంజనేయ!?

రామ రాజ్యం అని పేరేగాని
అడుగడుగున రావణాసురులే!!

ధర్మ పాలన అని చెప్పడమే గాని
అంతటా అక్రమ,అధర్మ దందాలే!!

రాముడు ఆదర్శమని..
చెప్పడమే గాని

రావణాసురునిలా
పరస్త్రీ వ్యామోహులే!!

సీతలా ఓర్పుగా ఉన్నామని
అనడమే గాని..

సూర్పణకలా మనసున
రాక్షస భావాలే!!

సుగ్రీవునిలా మైత్రిబంధంతో
ఉంటామనడమే గాని

వాలిలా బుద్ధి హీనత ,
మోసపూరిత లక్షణాలే!!

రామలక్ష్మణుల్లా మెలుగుతామనడమే కాని

వాలి,సుగ్రీవునిలా
కొట్టుకొనే మనస్తత్వాలే!!

కౌశల్యలా
ప్రేమ పంచుతానని చెప్పడమే గాని

మందరలా బంధాలను
ఎడం చేసే మనుషులే!!

సౌమిత్రిలా మంచి జరగాలని
కోరుకుంటారు గాని

కైకేయిలా మనసున
అసూయ కలిగిన బంధాలే!!

ఆదర్శమైన
రామాయణ గ్రంధంలా నడుచుకుంటామంటారు గాని

అణువణువున అరిషడ్వర్గాలు నింపుకొని ఉంటారు...!!

సేకరణ

No comments:

Post a Comment