ఆచార్య సద్బోధన:
➖➖➖✍️
భగవంతుడు మనకు అది ఇవ్వలేదని, ఇది ఇవ్వలేదని తరచూ మనం నిందిస్తుంటాం.
ఇక్కడ మన దృష్టంతా తక్షణ భవిష్యత్తు లేదా వర్తమానానికి పరిమితం అయినందున అదే కావాలని పట్టుబడుతుంటాం.
మనం జరగబోయే, రాబోయే ప్రమాదాన్ని ఊహించలేకున్నాం.
కానీ భగవంతునికి అన్ని కాలాలు తెలుసు కనుక అయన రాబోయే ప్రమాదాన్ని ఆపడానికే కొన్ని ఇవ్వకపోవడం జరుగుతుంది.
అది మనం అర్థం చేసుకోవాలి. మనం అడిగే దానివలన ఏమి జరుగుతుందో అయనకు తెలుసు.
కానీ మనల్ని దుఖం నుండి కాపాడడం కోసం మనం నిందించినా అయన నింద పడుతున్నాడు.!
ఈ విషయము మనం చక్కగా గ్రహించి అయన ప్రేమను అర్థం చేసుకోవాలి.
అవసరము ఉన్నపుడు అడగండి. కానీ ఇవ్వమని బలవంతం పెట్టవద్దు. ఆయనను ఆశ్రయించండి! ఆలస్యమైనా సరే తప్పక మంచిదే, గొప్పదే ఇస్తాడు..✍️
. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
సేకరణ
No comments:
Post a Comment