Thursday, July 4, 2024

 శ్రీమద్రామాయణము.


(217-వ ఎపిసోడ్).,

""తాతస్య కూపో~యమితి  బ్రువాణాః  క్షారం జలం కా పురుషాః"",

సామాన్యముగ జనులలో తాతతండ్రులు చేసిన మంచి పనులను గుర్తు చేసుకుంటు మననము చేసుకోవడము సహజమైన విషయము,అవసరము కూడ. కానీ మూర్ఖులైన వారు ఇది మా తాతగారు 'త్రవ్వించిన నూతి' యని అందుగలనీరు ఉప్పునీరైననూ ఆ నీరే త్రాగెదరు. మంచివారైనను అప్పుడప్పుడు చేయు చెడు మరియు అతి నీఛమైన పనులు కూడ అయ్యవి మంచివని భావించి పొగిడి అనుసరించెదరు.

రామాయణము యుధ్దకాండములో శ్రీరాముని జయించు మార్గములను సచివులతో మంత్రాలోచన చేయు సందర్భములో మంత్రులందరు తమ ప్రభువు రావణుడు చేసిన సీతాపహరణము నీఛమైన కార్యమని తెలిసికూడ రావణుని పొగుడుతు రామునితో పోరు సరియైనదని ప్రోత్సహిస్తారు.

" మయేన దానవేంద్రేణ త్వద్భయాత్ సఖ్యమిచ్ఛతా|,
దుహితా తవ భార్యార్ధే దత్తా రాక్షసపుంగవ""|,

దానవేంద్రో మధుర్నాను వీర్యోత్సిక్తో దురాసదః|,
విగృహ్య వశమసనీతః కుంభీనస్యాః సుఖావహః|,,(7వసర్గ-7-8శ్లో),

ప్రభూ నీ పరాక్రమమునకు భయపడి మయుడంతటివాడు తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసాడు.మధువు యను రాక్షసుడు అత్యంత పరాక్రమవంతుడు,ఎవరికిని జయింపశక్యము కానివాడు.ఆ మహావీరుడు నీ చెల్లెలు కుంభీనసకి భర్త.ఇటువంటి మహావీరులు నీకు తోడు యుండగ నీకేమి భయము లేదని యుధ్దమునకే ప్రోత్సహిస్తారు.ఒక్కడు కూడ ఇది నీవు చేసినది తప్పని చెప్పలేకపోగ
చెడు పనులు సహితము మంచివని రెచ్చగొట్టడము వంటివి తప్పని రామాయణము మనలని హెచ్చరిస్తున్నది.

No comments:

Post a Comment