*_ఎలా బ్రతకాలోనని దిగులు చెందకు..._*
*_గూటిలోని పక్షికి గింజలు ఎక్కడ దొరుకుతుందో తెలియదు అయినా అది హాయిగా ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్లి గింజలను కష్టపడి సంపాదించి తన పిల్లల ఆకలి తీరుస్తుంది. అదేవిధంగా మన జీవితం కూడా అంతే! ప్రయత్నం చేస్తే సాధించలేనిది ఈ సృష్టిలో ఏదీ లేదు._*
*_ఏది సులభంగా లభించదు... ప్రయత్నిస్తే అంత కష్టం కూడా కాదు... మనిషి గొప్పతనం నమ్మడంలోనూ నమ్మించడంలోనూ ఉండదు. నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఉంటుంది._*
*_ఎవరైనా చెడు స్వభావం కలవారు అని తెలిస్తే సొంత వారైనను సరే దూరం పెట్టండి. ఎందుకంటే మన తోటలో పండిన మిరపకాయ కదా... అని కళ్ళలో పెట్టుకుంటే అది మంటను పుట్టిస్తుంది కానీ, చల్లదనాన్ని ఇవ్వదు కదా!_*
*_ఎంత కష్టం వచ్చినా నీలో నీవే ఓదార్చుకోవడం నేర్చుకో... ఎందుకంటే నీ కష్టాలను చూసి నవ్వుతారే తప్ప నా అనుకొని నీకు చేయినందించి సహాయాన్ని చేసేవారు ఉండరు గుర్తెరుగు.☝️_*
*_-సదా మీ.శ్రేయోభిలాషి._*
*మీ ఆనంద్ అర్వపెల్లి.*
🪷 🌷🙇♂️🕉️🌷 🪷
No comments:
Post a Comment