Friday, July 26, 2024

****మానసిక ప్రశాంతతను, బుద్ధిని, ఆరోగ్యాన్ని నిర్వీర్యం చేసే దేన్నయినా సరే మనిషి విడిచిపెట్టాలి అన్నారు స్వామి వివేకానంద.

 🕉️ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏼
🚩నమః శుభోదయం 🚩🚩
విమలానంద బొడ్ల మల్లికార్జున్ 

ఋగ్వేదంలో ఎన్నో సూక్తాలు ఉన్నాయి.
వాటిలో అక్షసూక్తం అని ఒకటుంది. దాంట్లో జూదగాణ్ని ఉద్దేశించి వేదం...
'ఓ జూదరీ, నీకు విలువ ఉండదు... నీ జూదం కారణంగా నీ సంతానానికి గౌరవం ఉండదు. నీకు బంగారం కూడా ఇనుప వస్తువులా కనిపిస్తుంది. జూదం కారణంగా మొత్తం కుటుం బాన్ని నాశనం చేసుకున్న నిన్ను బంధువులు, స్నేహితులు... అందరూ సంతలో అమ్మకానికి పెట్టిన బక్కచిక్కిన ముసలి గుర్రంలాగా చూస్తూ నవ్వు కుంటారు తప్ప- ఒక్కరూ సహాయం చేయడానికి ముందుకు రారు. మానుకో ఆ వ్యసనాన్ని, కాపాడుకో కుటుంబాన్ని' అంది. ఎంత మంచిమాట అది!

మద్యపాన సేవనం ప్రమాదం, అనారోగ్య హేతువే కాదు సంఘంలో పరువు ప్రతిష్ఠలను సైతం అది దిగజారుస్తుంది. అందుకే చెడు వ్యసనాలను, దురాచారాలను ఏ సందర్భంలోనూ ఎవరూ ప్రోత్సహించకూడదు.

జూదం, వేట, స్త్రీ, మద్యపానం, దేశదిమ్మరితనం, నిద్ర... ఈ వ్యసనాలు కలిగిన ప్రభువులు శీఘ్రంగా వినాశనం చెందుతారని చాణక్యుడి సూక్తి. నిజానికి ఏ వ్యసనమైనా మనిషికి మేలు చేయదు. మనిషిలోని చెడుగుణాలు ఎప్పుడూ అతడి పతనానికే దారితీస్తాయి. 'మనసు స్వభావం చంచలత్వం. కేవలం అభ్యాసం ద్వారానే దాన్ని నియంత్రించగలం'' అని గీతలో శ్రీకృష్ణుడు ఉపదేశించాడు. నిత్యం బాహ్యవిషయాల వైపు పరుగులిడుతూ చెడు అలవాట్లకు బానిసైన మనసును సన్మార్గంలో పయనించేలా అభ్యాసం చేయాలి. మానసిక ప్రశాంతతను, బుద్ధిని, ఆరోగ్యాన్ని నిర్వీర్యం చేసే దేన్నయినా సరే మనిషి విడిచిపెట్టాలి అన్నారు స్వామి వివేకానంద.

జై గురుదేవ్ 👏👏

No comments:

Post a Comment