Monday, July 8, 2024

నన్ను నేను సంపూర్ణముగా తెలుసుకోవటమే ఆధ్యాత్మికము.

 🌹ఆధ్యాత్మికత అనేది మన జీవితానికి భిన్నమైన విషయము కాదు. ఒకవేళ ఆధ్యాత్మికతలో సాగుతుంటే అది మనము చేసే గొప్ప పని కాదు. భౌతికము అంటే మామూలుగా ధన సంపాదన చేసుకుంటూ, అవసరాలు తీర్చుకుంటూ జీవించటం ఎలాంటిదో - ఆధ్యాత్మికము అలాంటిదే. ఏ వ్యత్యాసము భావించుకున్నా, ఏ కొద్ది గొప్పతనము ఆపాదించుకున్నా అది మనకు అర్ధము కాదు. ఎందుకంటే ఆధ్యాత్మికము మనకు భిన్నమైనది కాదు. అది మనమే - మన అంతరంగము, లోపలి విషయాల జ్ఞానము. ఆధ్యాత్మికము - భౌతికము కలిస్తే పూర్ణ జీవితము. భౌతికము - శరీరముతో నిత్య అనుభవమే. కొంచెం లోపలకు వెళితే శరీరాన్ని నడిపే కనపడని మనసు మనకు అనుభవమే. ఈ మనసును, శరీరాన్ని నడిపే ప్రాణ శక్తి మనకు ఉంటుందని తెలుసు కానీ అనుభవం లేదు. ఆ అనుభవాన్ని పొందే వరకు జరిగే లోపలి ప్రయాణమే ఆధ్యాత్మికము. నన్ను నేను సంపూర్ణముగా తెలుసుకోవటమే ఆధ్యాత్మికము. 🌹god bless you 🌹

No comments:

Post a Comment