Monday, July 15, 2024

 *ఈ ప్రవచన చక్రవర్తికి వందనం...*

ప్రవచనాలకు ప్రథమ పౌరుడు
మంచి చెప్పే మొదటి మనుజుడు
వాగ్దాటి నదిని పొంగించే విజ్ఞానుడు
అంతర్ముఖ దారిని చూపే తాత్వికుడు
ఈ చాగంటి కోటేశ్వరుడు...

 మనోలయ మమకారపు గురువు
ఏది ఆశించని పూలపరిమళ తెరువు
త్యాగఫల సుగుణ భూషణ మేరువు
ప్రవచన చక్రవర్తిగా తెలుగునేలన కొలువు
ఈ చాగంటి కోటేశ్వరుడు...

వేదాలను నుండి
పురాణాలను పిండి
జీవన బండిని నడిపే విధానం 
ధర్మబద్ధంగా చెప్పే దయాస్వరూపుడు
ఈ చాగంటి కోటేశ్వరుడు...

సమాజాన్ని సఖ్యత పరిచే సైనికుడు
సంస్కారం విశిష్టత తెలిపే తాత్వికుడు
సంస్కృతి పరిమళం నింపే ప్రవచనకారుడు
సంతృప్తిని మాటతో ప్రసాదించే సరస్వతి తనయుడు
ఈ చాగంటి కోటేశ్వరుడు...

సున్నితత్వ సూర్యుడు
ధర్మనిష్ట రాముడు
తత్వజ్ఞాన కృష్ణుడు
ఫలాపేక్షరహిత నిరాడంబర శివుడు 
ఈ చాగంటి కోటేశ్వరుడు...

*అభిరామ్ 9704153642*

No comments:

Post a Comment