Monday, July 22, 2024

రామాయణం!! ఆ పేరు చెవిన పడగానే అంతులేని శక్తి ఎక్కడినుండో వస్తుంది...... ..

 రామాయణం .1.. 
       (ప్రారంభం)

రామాయణం!! 
ఆ పేరు చెవిన పడగానే అంతులేని శక్తి ఎక్కడినుండో వస్తుంది...... ..
.
మహర్షి వాల్మీకి వ్రాసిన ఒక ఉత్తమోత్తమ మానవుడిజీవనయానం ,..
.ఒక ఉదాత్తమయినచరిత్ర.... 
.
పితృవాక్యపాలనం... ,సోదరప్రేమ... ,ఏకపత్నీవ్రతం... ,ప్రజారంజక పరిపాలన... ,స్నేహధర్మం....,సేవానిరతి....,రాజనీతి...,
 ఇలా ఒక్కొక్క విషయము గూర్చి వింటుంటే అవి మన గుండె లోతుల్లో ఎక్కడో తడుతూ ఉంటాయి ....... 
.
 రామాయణం హృదయ సంబంధి...అంటే రామాయణం చదువుతున్నప్పుడు మన హృదయంలో ఎదో ఒక మూల తెలియని కదలికలు వస్తుంటాయి.
.
అదే మహా భారతం చదివినట్లయితే మన మేదోవికాసానికి కావలసిన సామాగ్రి అంతా దొరుకుతుంది

 ...yes ! RAAMAAYAN TOUCHES OUR SOUL ,
MAHABHAARATHA TOUCHES OUR MIND!!
.
ప్రతినాయకుడి పక్షంనుండి నాయకుడి ప్రశంస ఏ వాజ్మయంలో ఉంది ?.......

రామో విగ్రహవాన్ ధర్మః  ......
.
అంటే  ధర్మాన్ని కనుక కరగించి మూస పోస్తే అది తాల్చే ఆకారం “శ్రీ రాముడు “
.
ఈ మాటలు మారీచుడు రావణాసురుడితో అంటాడు !
.
శ్రీ రాముడి గుణగణాలగురించి మనకు అయోధ్యాకాండలో కనపడుతుంది ......
.
బుద్ధిమాన్ ,మధురాభాషీ,పూర్వభాషీ ,ప్రియంవదః
వీర్యవాన్ న చ వీర్యేణ మహాతాస్వేన విస్మితః
.
ప్రశస్తమైన బుద్ది గలవాడు ,మధురముగా అంటే తియ్యగా మాట్లాడేవాడు , 
చక్రవర్తి తనయుడు, మహాధానుష్కుడు, సంపద లోను 
శౌర్యం లోను తనతో తులతూగ గలిగే వాడు లేడు... 
అయినా  కించిత్ గర్వం లేకుండా తానే అందరినీముందుగాపలుకరిస్తాడు ,
శత్రువుల విషయంలో గూడా ప్రియవచనాలేపలుకుతాడు .....
.
రాముని గుణాలు ఇవి అని ఏమి చెప్పగలం? సకల సుగుణాభిరాముడు! సర్వలోక మనోహరుడు, 
 లోకంలోని సద్గుణాలన్నీ ఒక చోట చేరి రూపం దాలిస్తే ఆ రూపమే శ్రీ రాముడు .
.
 ఏ విధమైన ఆలోచన లేకుండా మనం నిత్యం ఎన్నో తప్పులు చేస్తుంటాం ,ఒక జీవనకాలంలో లెక్క వేస్తే వాటి సంఖ్య వేలల్లో ఉంటుంది .  
.
అదే మన పిల్లలకు రామాయణ పారాయణం అలవాటు చేసి రామకధచెప్పవలసినవిధంగాచెపితే .....
.
రామకధాసుధారససారం రంగరించి వారి ఉగ్గుపాలలో పోసి పెంచితే!
.
జీవన గమనంలో వచ్చే ఆటు పోట్లు ఎదుర్కొనే శక్తీ లభించడమే గాకుండా, జీవితంలో తప్పులు, పొరపాట్లు    దొర్లినప్పుడు దిద్దుకునే ధీశక్తి లభిస్తుంది. ......
.
Sir William Jones  అనే ఒక బ్రిటిష్ విద్యావేత్త 18వ శతాబ్దంలోనే  ఈవిధంగా అంటాడు.
.
” భారత దేశం నుండి ఆంగ్లేయులు తెచ్చుకోవలసిన నిజమైన సంపద రామాయణమే ! 
ఎందుకంటే మనిషి మనిషి గా జీవించే సరళమైన హృద్యమైన విధానం నేర్పుతుంది గనుక! “
.
 వందే వాల్మీకి కొకిలం !!!!
.

.
జానకిరామారావు వూటుకూరు గారి 
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

No comments:

Post a Comment