🙏 *రమణోదయం* 🙏
*ప్రాణులకే ప్రాణమైన ఈశ్వరుడే సత్యమని బాగా తెలుసుకొన్న జ్ఞానులకు, ఇతరులు ఏవగించుకొనే చిన్న పురుగు కూడా భగవంతుని సన్నిధిగానే తోస్తుంది.*
*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.345)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷 🦚🦚 🪷🪷
*ఏక మక్షరం హృది నిరంతరం*
*భాసతే స్వయం లిఖ్యతే కథం?*
*"ఆంతరిక జీవితాని"కి పది సూత్రాలు*
*Ten Directives for "Inner Life"*
*ప్రశ్న:: _వాళ్ళు (నా అనుభవం గురించి) అడిగితే, చెప్పకుండా ఉండడం చేత కాకపోతే, అబద్ధమాడవచ్చా ??_*
*గురుదేవులు:: అబద్ధమాడక్కర్లేదు. నీవు చెప్పకుండగా ఉండడానికి అనేక మార్గాలు.*
"ఈ అనుభవము గురించి
నీకు అక్కర్లేదు బాబూ!"
*అని తెలియజేస్తే చాలు.*
*On this journey, man has to bid farewell to others and start it.*
*ఈ ప్రయాణం చేసేముందు, నీకు సంబంధించినటువంటి వారికందరికీ వీడ్కోలు చెప్పాలి. అంటే,*
"వ్యక్తుల"కు కాదు
ఇక్కడ (వీడ్కోలు)
చెప్పవలసినటువంటిది;
"వ్యక్తుల యొక్క
భౌతిక అనుభవాని"కి
వీడ్కోలు చెప్పాలి,
(ఎందుకంటే)
నీవు
ఆంతరికమైనటువంటి
అనుభవములో
ప్రవేశిస్తావు గనుక.
*ఇప్పుడు (ఉదా.,కు) సన్యసించేటప్పుడు చూడండి! భౌతిక మిత్రులందరూ కూడా వీడ్కోలు చెప్తారు. కానీ, ఇక్కడ*
వ్యక్తులకు కాదు
నీవు వీడ్కోలు
చెప్పవలసినటువంటిది.
ఆ వ్యక్తుల యొక్క
భౌతిక అనుభవానికీ,
"భౌతిక స్థితి"కీ
నీవు వీడ్కోలు చెప్పాలి.
*When starting that farewell is loving detachment. ఆ వీడ్కోలు అనేటువంటిది,*
ఎదుటి వ్యక్తికి
"కష్టం" కలిగించేదిగా
ఉండకూడదు.
*జాగ్రత్తగా, ప్రేమతో– ఆ తల్లిదండ్రుల యొక్క ఆ "భౌతిక అనుభవాన్నీ", (అలాగే) భౌతిక వ్యక్తుల యొక్క "భౌతిక అనుభవం" గలిగినటువంటి భౌతిక వ్యక్తుల నుండి ప్రేమయుతంగా, అంటే–*
"నా తండ్రి మన నుండి
వేరైపోతున్నాడు"
అనేటువంటి,
వారు ఒక విధమైన "బెంగ",
లేదా
ఒక విధమైన "జుగుప్స",
అదేమీ కలగకుండగా,
చాలా జాగ్రత్తగా,
ప్రేమతో వారి నుండి
Detach అవ్వగలగాలి.
సాధనా? దేనికి సాధన?
ఏమున్నది సాధన చేయడానికి
ఇట్లా కూర్చోటమే సాధన...ఎప్పుడూ ఇట్లాగే కూర్చుండేవాణ్ణి.
అప్పుడు కళ్ళు మూసుకునే వాణ్ణి..ఇప్పుడు తెరుస్తున్నాను.
ఇంతే భేదం...ఇప్పుడున్నదే అప్పుడూ ఉన్నది.
అప్పుడున్నదే ఇప్పుడున్నది.
" నేను " తప్ప వేరొకటి వుంటేగదా సాధన!
💐 ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ 💐
జీవితమంతా ఓ గొప్ప సుదీర్ఘ స్వప్నం.
దీనికెక్కడా వాస్తవికత లేదు.
*శ్రీ గురుభ్యోనమః*
*కర్మ, విధి, మానవసంకల్పము*
*ప్రశ్న : వర్తమానం పూర్వకర్మ ఫలమంటారు. ఆ పూర్వ కర్మని సంకల్పం వల్ల అధిగమించగలమా ?*
*జవాబు :* వర్తమానం ఏమిటో గమనించు. అది చేస్తే, భూతభవిష్యత్తుల వల్ల ప్రభావితమయ్యేది ఏదో .. ఏది నిత్యమో .. ఏది విముక్తమో .. దేనికి భూతభవిత్వాలుండవో .. దేనికి కర్మ అంటూ ఏమీ ఉండదో అర్థమవుతుంది.
*ప్రశ్న : సంకల్పమంటూ ఏమైనా ఉందా అసలు ?*
*జవాబు :* ఎవరి సంకల్పం ? కర్తృత్వభావమున్నంత కాలం అనుభవముంటుంది. వ్యక్తి సంకల్పమూ ఉంటుంది. ఆత్మ విచారం వల్ల ఆ భావం పోతే, దైవసంకల్పమే పనిచేసి అన్నిటినీ నడిపిస్తుంది. విధిని జ్ఞానం, ఆత్మజ్ఞానం అతిక్రమిస్తుంది. ఆత్మజ్ఞానం సంకల్పానికి, విధికి అతీతం.
*ప్రశ్న : మనిషి జీవితంలో కొన్ని ముఖ్యమైన అంశాలు ... అంటే అతని దేశం, జననం, వంశం, వృత్తి, వివాహం, చావు ... వంటివి అన్నీ కర్మవల్లే ముందే నిర్ణయింపబడ్డాయంటే అర్థం చేసుకోగలను. కాని ప్రతి చిన్న విషయమూ అంతేనా ? ఉదాహరణకి, నేనీ విసనకర్రని నేలమీద పెట్టానంటే .. నేను ఫలానా రోజున, ఫలానా ఘడియకి విసనకర్రని నేలమీద పెడతానని కూడా ముందే నిర్ణయింపబడిందా ?*
*జవాబు :* తప్పకుండాను. ఈ దేహం ఏమి చేయాలో, ఏమేమి అనుభవించాలో పుట్టినప్పుడే నిర్ణయమై పోయింది.
*"నీ సహజస్థితిలో ఉండు"*
*భగవాన్ శ్రీ రమణమహర్షి బోధనలు*
🙏🏻🪷🙏🏻🪷🙏🏻
No comments:
Post a Comment