శ్రీమద్రామాయణము.
(228 వ ఎపిసోడ్),
"" మానవునిలో గల బుద్ధి,జ్ఞాన,ఇంగితాల వల్ల నిర్భయం కలుగుతుంది""
కిష్కిందకు సమీపమున ఋష్యమూక పర్వతమున్నది.దుందుభియను రాక్షసుని వాలి సంహరించి ఆ పార్థివశరీరాన్ని ఈ ఋష్యమూకపర్వతముపైకి విసిరివేసెను. ఆ సమయములో అ దుందుభి రక్తము అక్కడ తపమాచరించుచున్న మతంగమహర్హిపై పడుతుంది.ఆ మహర్హి దానికి కోపించి ఈ దుష్కార్యము చేసిన వాలి ఈ పర్వతముపైకి వచ్చిన మృతుడవుతాడని శపిస్తాడు.కనుక వాలి తాను రాలేక మాయా రూపములో రామలక్షణులను జటావల్కలధారులుగ పంపెనని భయపడుతున్న సుగ్రీవుని ఆ సమయములో హనుమ ధైర్యము చెపుతాడు.
రామలక్ష్మణులు పంపాసరోవర పరిసరములలో తిరుగాడుతున్నప్పుడు,ఋశ్యమూక పర్వతముపై నివసిస్తున్న సుగ్రీవుడు వారిని చూచి వ్యాకులపడి భయగ్రస్తుడవుతాడు.కారణము రామలక్ష్మణులు వాలి తరఫున వచ్చిన గూఢచారులని భ్రమపడతాడు.అలా భయపడిన సుగ్రీవునికి హనుమంతులవారు ధైర్యము చెపుతూ బుధ్ది జ్ఞానమరియు ఇంగితాల ప్రాధాన్యతని వివరించి నిర్భయముగ ఉండమని సూచనలు చేస్తాడు.
ఈవిషయము మనము రామాయణము కిష్కిందాకాండములో 2వసర్గ 18వశ్లోకములో గమనించవచ్చు.
"" బుద్ధివిజ్ఞానసంపన్న ఇంగితైః సర్వమాచర,
న హ్యబుద్ధిం గతో రాజా సర్వభూతాని శాస్తి హి.""
ఓ ప్రభూ సుగ్రీవా ! బుద్ధి,జ్ఞాన,ఇంగితాల వల్ల ఇతరుల వ్యవహార స్వభావాలను గుర్తించి యుక్తియుక్తంగ ఆచరణలో విజయము సాధించవచ్చని సూచనలు చేసి సుగ్రీవునిలో నిర్భయత్వము కలిగిస్తాడు.కనుక మనము కూడ అనవసర విషయాలకి భయగ్రస్తులము కాకుండగ యోచనచేస్తు బుద్ధి,జ్ఞాన,ఇంగితాలని ఉపయోగించుకొని నిర్భయముగ వ్యవహరించాలని రామాయణము ఉద్భోదిస్తున్నదని
గమనించుకోవాలి.అది సర్వదా శుభప్రదము.
జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.
No comments:
Post a Comment