శ్రీమద్రామాయణము.
(227 వ ఎపిసోడ్),
"" నిగర్హితం చ నీచం చ కథమార్యో~భిధాస్యతి,
త్రాహీతి వచనం సీతే ! యస్త్రాయేత్ త్ర్రిదశానపి||,
తల్లీ సీతమ్మ వదినా! మన రామచంద్రమూర్తి ఉత్తమవంశసంజాతుడు.దేవదానవులను సహితము దునమాడగల సమర్థుడు.అలాగే దేవతలను రక్షించగల సమర్థుడు.అట్టి మహావీరుడు "" హా సీతా రక్షింపుమని" దైన్యముగ ఒక అల్పునివలె ఎట్లు పలుకును. ఓ దివ్యమంగళ స్వరూపురాలా ఎవడో నీచ రాక్షసుడు ఏదో ప్రయోజనమాసించి అన్న గారి కంఠమును అనుకరించియుండవచ్చును.ఆ సందర్భముగ ''త్రాహీ త్రాహీ'' యని పలికియుండునని సీతామాత కి ధైర్యవచనాలు చెపుతాడు.
"" బంగారులేడికై వెళ్లిన రాముని ఆర్తనాదానికి సీతామాత భయవిహల్వయై రామునికి సహాయముగ వెళ్లమని తోందరచేస్తున్న సందర్భములో లక్ష్మణుడు,
""నిస్వరం వ్యాహృతం వాక్యం లక్ష్మణ! త్రాహి మామితి,
న భవత్యా వ్యథా కార్యా కునారీజనసేవితా|,""
అలం వైక్లబ్యమాలంబ్య స్వస్థా భవ నిరుత్సకా|,
న సో~స్తి త్రిషు లోకేషు పుమాన్ వై రాఘవం రణే|,
జాతో నా జాయమానో నా సంయుగే యః పరాజయేత్|,
"" న జయ్యో రాఘవో యుద్దే దేవైః శక్ర పురోగమైః""(అరణ్యకాం.59-13,14,15),,
అమ్మా! "హా లక్ష్మణా !త్రాహిమామ్! " అని పలికిన స్వరము అన్నయ్యది కాదు.నీవు సామాన్య స్త్రీవలె ఇట్లు వ్యథ చెందుట తగదు..తల్లీ నీ మనసును కుదుటపర్చుకొనుము.నన్నీ విధముగ తొందరపెట్టవలదు. రణరంగములో రాముని జయింపగల ధీరుడు ఈ త్రిజగాలలో ఇంతవరకు పుట్టలేదు ఇక ముందు పుట్టబోడు.తల్లీ జానకీ మాతా యుద్దమున శ్రీరాముని ఇంద్రాది దేవతలు సహితము జయింపజాలరు."".
"" సీతామాత కి లక్ష్మణుడు ఎంత బామాలి చెప్పినను ఆమె అతని మాటలు లెక్కచేయక మీదుమిక్కిలి కఠినముగ తూలనాడి రామునికి సహాయముగ వెళ్లవలసినదే యని ఆజ్ఞాపించెను.
సీతాదేవి అదృశ్యానికి రాముడు కలవరపడి కోపముతో తడబడి లక్ష్మణునితో, ఓ లక్ష్మణా,
యథా జరా యథా మృత్యుః యథా కాలో యథావిధిః,
నిత్యం న ప్రతిహన్యంతే సర్వభూతేషు లక్ష్మణ!,
తథా~హం క్రోధసంయుక్తో న నివార్యో~స్మి సర్వధా||,(65-75),
ఓ సౌమిత్రీ విధినుండి కాలమునుండి ముసలితనమునుండి మృత్యువు నుండి ఎలా తప్పించుకొనలేరో సీతను నానుండి వేరు చేసినవారు ఈవేళ నా నుండి ఎవ్వరు తప్పించుకొనలేరు. నా సీతను నాకు అప్పగించనిచో సర్వలోకములను ఈ సర్వజగత్తును సర్వనాశనము చేయుదును.
ఇటువంటి ప్రళయకాల రుద్రునివలె ఉగ్రుడైన రాముని రూపాన్ని లక్ష్మణుడు మునుపెన్నడు చూసి ఎరుగడు.
రాముని శాంతపరుస్తు అన్నా,దుఃఖాలు రావటం సహజము.యయాతికి ఇంద్ర శాపం తగలలేదా,మనకులగురువు వశిష్టుని నూర్గురు కుమారులు చనిపోలేదా,కనుక నీవు దుఃఖింపక బుధ్దిపెట్టి యోచన చేయుము.తత్వం గ్రహించిన ప్రాజ్ఞులే శుభాశుభాలను గ్రహిస్తారని హితవు పలుకుతాడు.
రామాయణములో లక్ష్మణుని హితవులు రామునంతటి వానికి శిరోధార్యాలయ్యాయి.కనుక కష్ట సమయాలలో పిన్నల హితవులకి కూడ ప్రాధాన్యతనిచ్చి గౌరవించాలని రామాయణము మనకి హితవు పలుకుతుంది.
జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.
No comments:
Post a Comment