*పచ్చి మిర్చి(మిరప) బజ్జీ*...
ఏంటమ్మా నీ వయ్యారం, ఎంతమ్మ నీ యవ్వారం.
చూస్తే చాలు మనస్సు పీకేస్తుంది,తనువు లాగేస్తుంది,నాలుక నాట్య మాడు తుంది.
ఏముందమ్మ నీలో అంత సిగ,సొగసు వలపు,వయస్సు,ఆకర్షణ.
పసిపాపడి దగ్గరనుండి పండు ముదుసలి వరకు నీ ఫ్యాన్స్.నీ ఇమేజ్ నీకు తెలియదు, అందరి కళ్లు నీవైపే,అందరి కాళ్ళు నీ దగ్గరికే
వేడి,వేడి నిన్ను నోట్లో పెట్టుకుని, కొరక గానే,కస్సుమంటూ,కయ్యిమంటూ అమృతం రుచి చూపిస్తావు.
బాండి లో వేడి వేడి నూనెలో నువ్వు వేగుతూ అటు,ఇటు నడ్డి తిప్పుతూ వుంటే,రంభ,ఊర్వశి నాట్యం చూసినట్లుంటుంది.
నీ చుట్టూ చేరిన శనగపిండి,నీ పొట్ట లో దాగిన వాము నీకు మరించ రుచి,వన్నె నిచ్చాయి.
నిన్ను మీ అక్క ఉల్లిగడ్డ ముక్కలతో,మీ చెల్లెలు నిమ్మపండు రసం తో కలిపి కొడితే అహా.. అహా...ఆహా...ఆహా....ఇలలో స్వర్గం కదా
No comments:
Post a Comment