అంతా మనమంచికే
➖➖➖
మన జీవితంలో ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. ఎన్నెన్నో అద్భుతాలు, సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కానీ వాటన్నింటిలోనూ మనం భగవంతుని ఉనికిని, ఆయన అదృశ్య అభయహస్తాన్ని గమనించడంలేదు. అంతా మనదే అని అహంకార పడుతున్నాం.
అన్నివేళలా అన్ని సందర్భాలలోనూ అందరిలోనూ భగవంతుని చూడగలగాలి.
అపుడు అంతా భగవంతుని దయ వలనే అని భావన కలుగుతుంది.
దీనికోసం మనసుపై అదుపు ఉండాలి. మనసుపై అదుపుకు ఏకైక మార్గం ఆలోచనలన్నింటినీ దైవముపై కేంద్రీకరించి ఉంచటమే.
కాబట్టి మనకు ఏది సానుకూలమైతే ఆ మార్గంలో భగవంతుని ధ్యానం చేస్తూ, సంకీర్తనం చేస్తూ జీవితం గడుపుదాం.
తద్వారా మనసును ప్రాపంచిక విషయాలనుండి మళ్ళించి ప్రశాంత స్థితిని పొందుదాం.
ఏ ఇతర విషయాల ప్రసక్తి లేకుండా పరమాత్ముని దయ, సాన్నిధ్యాలకోసం మనం తపన పడుతూ ఉంటే క్రమక్రమేణ కోరికలు లేని ఉత్తమస్థితిని అందుకోగలం.
ప్రశాంతమైన జీవితమును గడపగలుగుతాం.
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
No comments:
Post a Comment