శ్రీమద్రామాయణము.
(236 వ ఎపిసోడ్),
""""దృష్టం కిమ లోకేస్మిన్ న నిర్ధోషం-న నిర్గుణమ్""""
దోషరహితమైనది,దోషభూయిష్టమైనది అనే విషయపదార్ధము ఏదియును లోకమున ఎంత వెదకినను కనపడదు.కనుక ఏ వ్యక్తి యందైనను గుణదోషములు రెండును యుండును.
రామాయణము యుధ్దకాండములో శ్రీరాముని వధ్దకు విభీషణుడు శరణాగతుడై వచ్చినప్పుడు రాముడు కపిశ్రేష్టుల అభిప్రాయములడుగుతాడు.
మైందుడు విభీషణునకు శరణాగతి ఇచ్చుటలో తొందరపడక అతనితో చర్చ(personnel counseling) చేసి గుణదోషాలు విచారించి తేల్చాలి అంటాడు
.వాలి పుత్రుడు యువరాజైన అంగదుడు "వ్యక్తి లోని గుణదోషాలను ఎంచి యోగ్యతను నిర్ణయించాలంటు,
'" యది దోషో మహాంస్తస్మిన్,
త్యజ్యతామ్ అవిశంకితమ్,
గుణాన్ వాపి బహున్ జ్ఞాత్వా,
సంగ్రహః క్రియతాం నృప.""(17-42),
విచారణలో అతనియందు దోషములు అధికముగ యున్నచో త్యజించాలి,ఉత్తమ లక్షణాలు అధికముగ యున్నచో శరణు ప్రసాదించుట యుక్తమని పలుకుతాడు.
ఆ సందర్భములో ఓ రామా! ఏవ్యక్తి దోషరహితుడై యుండుట అసాధ్యము.పూర్తి అవగుణాలు యున్నవారు లోకమున కనపడరు.కనుక అవగుణాలు ఎక్కువగ యుంటే దగ్గరకు తీయరాదు.ఉత్తమగుణాలు అధికముగ యున్నచో శరణాగతికి అర్హడేమో యని ఆలోచించాలని
వివరిస్తాడు అంగదుడు.
"" అప్పుడు సకలశాస్త్రపసరంగతుడైన హనుమంతులవారు "" ప్రభూ నీకు తెలియనిదేమున్నది.ఈ విభీషణుడు సద్భుధ్దిగలవాడు.ఇక్కడ మనవారు చేసిన సూచనలతో నేను ఏకీభవించుట లేదు.కారణము సత్పురుషుని శోధనలతో పలురకములుగ ప్రశ్నినంచిన అతని మనసు నొచ్చుకొనవచ్చును.దానివల్ల మనము మంచి మిత్రుని కోల్పోయే ప్రమాదమున్నదంటు,
"" పురుషాత్ పురుషం ప్రాప్య తథా దోషగుణానపి,
దౌరాత్మ్యం రావణే దృష్ట్వా విక్రమం చ తథా త్వయి,
యుక్తమ్ ఆగమనం తస్య సదృశం తస్య బుధ్దితః||,(17-57),
ఓ రామా! నీచుడైన రావణుని వీడి నీకడకు ఆశ్రయం కోసము వచ్చాడు.తన అన్నలోని దోషములను,నీలోని సద్గుణములు వివేకముతో గమనించి నీ కడకు రావటము అతని బుద్దికుశలతకు నిదర్శనము.పైగా
"" ఆకారశ్చాద్యమానో~పి న శక్యో వినిగూహితమ్,
బలాద్ది వివృణోత్యేవ భావమంతర్గతం నృణామ్""(17-63),
(Face is the index of the mind),
తండ్రీ! మనోభావాలను ఎవ్వరు తమ ముఖములనుండి దాచదలచినను దాగవు.మానవుల అంతర్గత భావములు వారి వారి ముఖమునందలి కవళికలో బయటపడి తీరును. కనుక ఈ విభీషణుని పరిశీలించిన సరళస్వభావునిగ కనపడుచున్నాడు.కనుక మనము ఈతనికి ఆశ్రయమివ్వవచ్చని నా అభిప్రాయము తదుపరి మీ అభీష్టమని పలుకుతాడు.
మనకందరికి ప్రపంచములో ఎవ్వరు అవగుణాలు లేనివారు అలాగని పూర్తి దోష చింతనతో యుండేవారుండరు.కనుక సద్విమర్శపూర్వక విచారణతో వర్తించాలని హనుమంతులవారి మాటలవల్ల తెలియవస్తున్నది.
కనుక మనము క్రొత్త వారితో స్నేహము చేసేటప్పుడు తెలుసుకొనవలసిన విషయాలు మిత్రత్వము చేస్తు అడిగి తెలుసుకొనవలయునే గానీ ఊహించరాదని మనందరికి రామాయణము ప్రభోదిస్తున్నది.
జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.
No comments:
Post a Comment