“ప్రసాదo” అనేది సంస్కృతంలోని ప్రసాద అనే పదం నుండి వచ్చింది, ఇది మొదట వేద సాహిత్యంలో ఆధ్యాత్మిక స్థితిగా వర్ణించబడింది. పదం యొక్క శబ్దవ్యుత్పత్తిని పరిశీలిస్తే, దాని నుండి ఉద్భవించిన రెండు సంస్కృత పదాలు ప్రసన్న మరియు ప్రసాద రెండు పదాలు సంతోషకరమైన అనుభూతిని కలిగిస్తాయి. ప్రసన్న అంటే స్పష్టమైన, ప్రకాశవంతమైన మరియు ప్రశాంతమైన అని అర్థం. అదేవిధంగా, ఎవరైనా ప్రసాదాన్ని అందజేస్తున్నప్పుడు, అది చాలా ఆనందం, ప్రకాశం మరియు అంతర్గత స్పష్టతతో ఉంటుంది.
ప్రారంభ వచనంలో, ఋగ్వేదం, ప్రసాదం అనేది దేవతలు లేదా ఋషులచే అనుభవించబడిన మానసిక స్థితిగా వర్ణించబడింది, దీనిలో వారు ఆకస్మిక దాతృత్వాన్ని అనుభవించారు, వాస్తవానికి చరిత్రలో చాలా కాలం తరువాత మాత్రమే ప్రసాదం వస్త్రాలు, పువ్వులు మరియు ఆహారం, ముఖ్యంగా స్వీట్లు వంటి భౌతిక వస్తువులను వర్ణించడానికి వచ్చింది.
ప్రసాదం అంటే "దయ" అని అర్ధం. ఈ పదాన్ని భగవంతునికి అందించిన స్వచ్ఛమైన శాఖాహార ఆహారాన్ని వర్ణించడానికి ఉపయోగిస్తారు. ఆలయంలో దేవతలకు సమర్పించే ఆహారాన్ని మహా ప్రసాదం అంటారు. చాలా ఆహారంలో మనల్ని జనన మరణ చక్రంతో బంధించే కర్మఅనుసంధానమై ఉంటుంది, ఎందుకంటే అది శాకాహారమే అయినప్పటికీ దానిని పొందే ప్రక్రియలో ఇతర జీవులకు హాని కలిగించవచ్చు: పంటల సాగు సమయంలో రైతు అనుకోకుండా కీటకాలను చంపవచ్చు లేదా మొక్కలు అనుభూతి చెందుతాయి. అవి వేరు చేయబడినప్పుడు కొంత నొప్పి, హింస, మరియు అనేకమైన ఇతర ప్రక్రియలకు గురిఅయ్యి కర్మకు కారనభూతులవుతాయి . అయితే, భగవంతుని ఆనందం కోసం ఆహారాన్ని సిద్ధం చేసినప్పుడు, అతను నైవేద్యంలో ఉన్న ప్రేమ మరియు భక్తిని అంగీకరిస్తాడు మరియు దాని నుండి అన్ని పాపాలను తొలగిస్తాడు. ఆహారంలో ఉన్న కర్మ కాబట్టి ఆధ్యాత్మిక శక్తిగా రూపాంతరం చెందుతుంది. ఈ పవిత్రమైన ప్రసాదాన్ని గౌరవించడం తినడం భక్తి-యోగానికి ఆధారం మరియు స్పష్టమైన ఆధ్యాత్మిక పురోగతికి సహాయపడుతుంది. ప్రసాదం పంచడం మరియు పంచడం కూడా చాలా ముఖ్యం!
మతం ఏదైనా సమర్పించే విధానం, ఆచరణ ప్రసాదానికి ఒకేలా ఉంటుంది.దీనిని మొదట దేవుళ్లకు, ఆరాధ్య స్వాములకు సమర్పించిన తర్వాత భక్తులకు పంచి పెడతారు. దేవుళ్లకు సమర్పించడానికి ముందు సాధారణ వంటకంగా… భగవాన్ కు సమర్పించిన తర్వాత పుణ్య పదార్థంగా… ప్రసాదంగా, నైవేద్యంగా పిలువబడుతుంది.అయితే చాలా మంది ముందు దేవుడికి సమర్పించిన తర్వాత వేరే వాళ్లకు పంచిపెడుతుంటారు. గుడుల్లో అయితే ప్రసాదం అమ్మకాలు కూడా చేపడుతుంటారు.అయితే ప్రసాదం అమ్మడం సరైన పద్దతేనా కాదా అనేది మనం నిర్ణయించలేము. వేలు, లక్షల సంఖ్యలో భక్తులు వచ్చినప్పుడు వారికి ప్రసాదం కావాలని అడగడంతో పాటు బంధుమిత్రులకు పంచడానికి ఎక్కువ పరిమాణంలో కావాలని కోరిన సందర్భాల్లో లక్షలు కోట్లు వెచ్చించి ప్రసాదాన్ని తయారు చేసి ఉచితంగా పంచడం సాధ్యమయ్యే పని కాదు.అలాంటి పరిస్థితుల్లో ప్రసాదాన్ని కొంత మొత్తం తీసుకుని విక్రయించడంలో ఎలాంటి ధర్మ నిబంధనల ఉల్లంఘనల జరగదనే భావించాల్సి ఉంటంది.
ప్రసాదం భౌతిక కోణంలో భక్తునికి, దేవునికి మధ్య ఇవ్వడం, స్వీకరించడం అనే ప్రక్రియ జరుగుతుంది.తద్వారా ప్రసాదం అనే పదం వచ్చింది. మొదట దేవునికి, ఆరాధ్య స్వాములకు, ఇష్ట గురువులకు సమర్పించిన తర్వాత భక్తులకు ఇచ్చేదే ప్రసాదం. సాధారణ పరిస్థితుల్లో ప్రసాద విక్రయాలు మంచివి కావని శాస్త్రాలు చెబుతాయి. ఎందుకంటే ప్రసాదం అంటేనే దేవునికి సమర్పించి ఆహారాన్ని భక్తులకు పంచడం.కానీ అసాధారణ పరిస్థితుల్లో ధర్మాధర్మాలు పలు మార్పులకు లోనుకాక తప్పని పరిస్థితి తలెత్తుంది.
ప్రసాదమంటే ప్రసన్నత, తేటదనము, నైర్మాల్యము, మనస్సు, విరాళము, గురువాదులచే భుక్తపరిష్ఠమైన అన్నము, కావ్యగుణములలో ఒక లక్షణముగా దేవ నైవేద్యమనే పరిపరి విధాల అర్థాలున్నాయని లాక్షిణికులు చెబుతారు. అటువంటి ప్రసాదం ప్రసన్నముగా చేస్తుందని, సంతోషపెడుతుందని, ఉపశమింప చేస్తుందని, దానిని ప్రసాదకముగా పిలుస్తారని విజ్ఞులంటారు. అనుగ్రహక పూర్వకముగా, ఉల్లాసము కలిగించేదిగా ప్రసాదము పంచి పెట్టడాన్నే ప్రసాదించుట అని చెప్పుకోవచ్చు.
ప్రసన్న వదనం ధ్యాయేత్ అంటూ ప్రసన్నమైన, నిర్మలమైన వదనం, రూపం 'ప్రసాదం' మొదటి లక్షణమని అనుకుంటే, అటువంటి చిదానందతత్వాన్ని కారుణ్యాన్ని చిరునవ్వు చిందిస్తుందని మందస్మిత సుందర వదనారవిందం స్మేరాననం భగవంతుని ప్రతిరూపాలని భగవత్ తత్వాన్ని విజ్ఞులు వివరిస్తారు. జగజ్జనని ప్రశాంతమైన తేజోవంతమైన చిరునవ్వును స్మితవదన ప్రస్తుతిలో 'కావ్యకంఠ వాసిష్ఠగణపతి' అభివర్ణిస్తాడు. చిరునవ్వుల కాంతుల ప్రవాహంలో తనపతిదేవుడైన ఈశ్వరుని మనస్సును మునకలు వేయించే తల్లిగా లలితా సహస్రనామ స్తోత్రంలో చెప్పబడుతుంది.
భగవంతుని గుణగణాలు, రూప స్వరూ పాల విశేషాలు మననం చేసుకోవటం ప్రసాదం. భగవంతుని ఊసులతో మనసు నింపు కోవటం ప్రసాదం. భగవంతుని లీలలు, మహమల ధ్యాసలో ఉండటం ప్రసాదం. ఉండగలగటమూ ప్రసాదమే. భగవత్ తత్వం అలకించడం, భగవత్ తత్వం గురిం చి ఆలోచన చేయడమూ, అనుభవానికి తెచ్చుకోవ డం ప్రసాదం ఆధ్యాత్మిక మార్గంలో నడవడం, నడ వాలనే ఆసక్తి కలగటం, నడవ గలగటం ప్రసాదమే. దైవ ప్రసాదమే. ఏది జరిగినా, ఏమి జరుగుతున్నా, ప్రతీదీ దైవ నిర్ణయం అని అనుకోవడం, అనుకోగల గటమూ ప్రసాదమే.
”కర్మణ్య వాధికారస్తే….” అని గీతాచార్యుడు గీతలో చెబుతాడు. ప్రయత్నం నువ్వు చెయ్యి. దాని నుంచి వచ్చే ఫలితాన్ని ఆశించకు. ఫలితం ఏమొచ్చి నా, అసలు రాకున్నా, అది భగవత్ నిర్ణయం అను కున్నప్పుడు, భగవత్ నిర్ణయాన్ని అనుభవించ గలిగినప్పుడు ప్రసాదమే. అలాంటి స్థితికి మనం ఎదిగినప్పడు ప్రతీదీ దైవ ప్రసాదమే అవుతుంది.
No comments:
Post a Comment