Sunday, July 14, 2024

గురువు యొక్క కృప ఎలా ఉంటుందంటే....

 *శ్రీ గురుభ్యోనమః*

        గురువు  యొక్క  కృప  ఎలా  ఉంటుందంటే ..  ఏనుగు  నిద్రపోయినప్పుడు  కలలోకి  సింహం  వస్తే,  భయంతో  దానికి  వెంటనే  మెలకువ  వచ్చేస్తుంది.  అలాగే  అజ్ఞానం  అనే  నిద్రలో  ఉన్న  జీవకోటికి  ఆ గురువు  కృప  సింహంలా  ఎప్పుడయితే  వచ్చిందో,  వెంటనే  అజ్ఞానం  లోంచి  జ్ఞానంలోకి  వచ్చేస్తాం.  గురువు  యొక్క  శక్తి  అటువంటిది.  మనకయినా  కలలోకి  పెద్దపాము  వచ్చి  మీద  పడితే  భయంతో  మెలకువ  వచ్చేస్తుంది.  మనం  అజ్ఞానం  అనే  నిద్రలో  ఉన్నాం.  చచ్చిపోవటం,  పుట్టటం  ఇవన్నీ  నిజం  కాదు.  ఇవన్నీ  అజ్ఞానంలో  జరిగిపోతాయి.  

అనేక సంవత్సరాల సంభాషణవల్ల కూడా
తెలుసుకోలేని విషయాన్ని మౌనంలోగాని,
మౌనసన్నిధిలో గాని త్రుటికాలంలో తెలుసుకోవచ్చు.
దక్షిణామూర్తి అవతార నిరూపణం అదే.
మౌనం అత్యంత శక్తివంతమైన భాష!

*ప్రజ్ఞానం  బ్రహ్మ,  అయమాత్మా  బ్రహ్మ,  తత్వమసి ..  ఇవన్నీ  మహావాక్యాలు.*  దేనినయితే  నువ్వు  పొందుదామని  అనుకుంటున్నావో,  అదే  నీవయి  ఉన్నావు.  నీ హృదయంలో  ఉన్న  జీవుడు  దేవుడికి  పరాయివాడు  కాదు,  దేవుని  వాడే !  ఆ దేవుడిలో  ఐక్యమయ్యే  వరకు  వాడికి  శాంతి  లేదు.  *అయమాత్మా  బ్రహ్మ ..   వాడూ  వీడూ  ఒక్కటే !*
          
*శ్రీ నాన్నగారి  అనుగ్రహ  భాషణం -*



💐 ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ 💐

No comments:

Post a Comment