కర్ణుడు గొప్ప యోధుడు అర్జునుడి కన్నా గొప్ప వీరుడు అని అంటున్నారు అది ఎంత మాత్రము నిజం కాదు అసలు మహాభారతం లో ఎక్కువ సార్లు ఓడిపోయిన వీరుడు కర్ణుడొక్కడే
అతను ఓడిపోయిన యుద్ధలలో కొన్నిటిని చెప్తాను
ద్రౌపది స్వయంవరంలో అర్జునుడితో ఓడిపోతాడు
దీనికి రిఫరెన్స్ 👇
అది పర్వం 189వ అధ్యాయం 10 నుండి 22 వ శ్లోకాలు
ధర్మరాజు చేసిన దిగ్విజయ యాత్రలో భీముడితో ఓడిపోతాడు
రిఫరెన్స్ 👇
సభాపర్వం 30వ అధ్యాయం 18 నుండి 21 శ్లోకాలు
అరణ్యపర్వంలో గంధర్వులతో ఓడిపోతాడు
రిఫరెన్స్ 👇
241 వ అధ్యాయం 15 నుండి 32 శ్లోకాలు
విరాట పర్వం
అర్జునుడితో 3సార్లు ఓడిపోతాడు
రిఫరెన్స్ 👇
54 వ పర్వం 1 నుండి 36 శ్లోకాలు
60 వ అధ్యాయం 1 నుండి 27 శ్లోకాలు
ద్రోణ పర్వంలో అభిమన్యుడితో ఓడిపోతాడు
40వ అధ్యాయం పూర్తిగా
41 వ అధ్యాయం 1 నుండి 8 శ్లోకాలు
భీముడి చేతిలో ఓడిపోతాడు చాలా సార్లు
ద్రోణ పర్వం 14వ రోజు యుద్ధం 129 వ అధ్యాయం నుంచి చదివితే అనేక సార్లు ఓడిపోయి పారిపోయినట్టు ఉంటుంది
అదే రోజు అర్జునుడి చేతిలో కూడా ఓడిపోతాడు
తర్వాత 17వ రోజు యుద్ధం లో కూడా భీముడి చేతిలో ఓడిపోతాడు
ఇవి time సరిపోక చాల తక్కువ reference లు చెప్తున్నా కానీ ఇంకా అతను ఓడి పోయినా అనేక సందర్భాలు ఉన్నాయి
ఇవి తెలియక సినిమాలు చూసి సీరియల్స్ చూసి కర్ణుడు గొప్పా అనుకుంటే అది మీ కర్మ....
కర్ణుడు చరిత్రలో గొప్ప యోధుడు వీరుడు
కానీ అదే చరిత్రలో అతని కన్నా గొప్ప యోధులు వీరులు ఉన్నారు అందులో అర్జునుడు ఒకడు...
But ఒక్కటి చెప్పాలి అనుకుంటున్నా చరిత్రని వక్రీకరిస్తే ఆ చరిత్ర పాడవదు,దానికి ఏం కాదు,, కానీ పాడయ్యేది మన బుద్ధులు
మొన్నటి రాముడి కన్న రావణుడు గొప్ప అన్నారు ఇప్పుడు అర్జునుడి కన్నా కర్ణా గొప్ప అంటున్నారు అదే తేడా....
పూరాణాలు తెలుసుకోవాలి అంటే ప్రామణిక పుస్తకాలు చదవండి 😊
జై శ్రీ రామ 🙏🚩
No comments:
Post a Comment