Friday, July 5, 2024

జ్యోతిష్యం, శ్రీరమణాశ్రమ లేఖలు_* *_-శ్రీరమణ స్మృతులు_

 _*💫 జ్యోతిష్యం !? ⚜️*_
➖➖➖➖➖➖✍️
*_-శ్రీరమణాశ్రమ లేఖలు_*
*_-శ్రీరమణ స్మృతులు_* 
®®®®®®®®®®®®®®
*_⚡నాల్గయిదు రోజులక్రితం ఒక దైవజ్ఞుడు వచ్చాడిక్కడికి. వచ్చిన మరుదినం ఉదయం పది గంటలకు జ్యోతిషశాస్త్ర రీత్యా భగవాన్ శ్రీరమణులను చాలా అంశాలపై ప్రశ్నిస్తే భగవాన్ సయుక్తికంగా బదులిచ్చారు.._* 

*_సారాంశం ఏమంటే, "స్వామీ ! జ్యోతిషశాస్త్రరీత్యా అది అప్పుడు జరుగుతుంది, ఇది ఇప్పుడు జరుగుతుంది, అది ఆ గ్రహబలము, ఇది ఈ గ్రహబలము అని చెపుతారే, అది యథార్థమేనా ?” అన్నది వారి ప్రశ్న._*

*_'నేను అనే అహంత ఉన్నంతవరకూ అన్నీ నిజమే. ఆ అహంత నశించినప్పుడు ఏదీ నిజం కాదు' అని సెలవిచ్చారు భగవాన్._*

*_“అయితే అహం నశించినవారికి జ్యోతిషం యథార్థం కాదంటారా ?” అన్నారా పృచ్ఛకులు._* 

*_“కాదనేందుకేమున్నదండీ. చూచేవాడుంటేనే చూడటం ఉంటుంది. అహంత నశించినవారు చూచినా చూడనివారే. కిటికీ తెరిచే వుంటుంది._*
*_లోపల చూచేవాడుండి చూడాలి.. కాని కిటికీ చూస్తుందా ?” అన్నారు భగవాన్._* 

*_“తాను లేకుంటే శరీరయాత్ర ఏ విధంగా సాగుతుంది ?" అన్నారా పృచ్ఛకులు._* 

*_"అదే అదే. శరీరం మనకొక ఇల్లు. నీవుంటేనే ఈ ఇల్లు బాగుంటుందికాని లేకుంటే బాగుండదు. అందువల్ల, మనం ఉన్నంతవరకూ నివాసయోగ్యంగా చేసుకుంటున్నాము అన్న విషయం తెలుసుకొని, ఆ తెలివిని సదా విడువకుండా వుండాలి. విడిస్తే శరీరం నేననే భావన వచ్చి బాధిస్తుంది. అప్పుడన్నీ యథార్థమే. ఆ భావన నశించడమే అహం నాశనం. ఆ అహంత నశించినప్పుడు ఏదీ నిజం కాదు. జరిగేది జరుగుతుంది. జరగనిది జరగనే జరగదు” అని సెలవిచ్చారు భగవాన్._* 

*_"జరిగేది జరుగుతుంది. జరగనిది జరగనే జరగదని సెలవిస్తారే, ఇక మంచి చేయాలని అనడం ఎందుకు ?” అని మళ్ళీ ప్రశ్న._* 

*_“మంచి చేస్తే సుఖం కలుగుతుంది. అందువల్ల చేయాలన్నారు” అని సెలవిచ్చారు భగవాన్. “అవును దుఃఖం ఆగంతుకమనే కదా పెద్దల వాక్యం" అన్నారా భక్తులు._* 

*_"ఆహా ! దుఃఖం ఆగంతుకమే. సుఖమే యథార్థం. ప్రతి జీవీ సుఖం కావాలని అనడం అసలు తన సహజస్థితి సుఖరూపం కావడంవల్లనే. ఆగంతుకమైన దుఃఖాన్ని పోగొట్టడానికే అన్ని సాధనలున్నూ. తలనొప్పి మధ్యలో వచ్చింది కనుకనే మందు వేసి పోగొట్టాలి. పుట్టింది మొదలూ చచ్చేదాకా ఉండేదైతే పోగొట్టుకోవడం ఎందుకు ? వ్రణాలూ, వ్యాధులూ, డాక్టరు వైద్యంవల్ల తగ్గినట్లే, అనేక ప్రతిబంధకాలవల్ల కలిగే దుఃఖం ఆ ప్రతిబంధకాలను శాంతింపజేసే సాధనలవల్ల తొలగించ వచ్చును. ఇదొక వ్యాధి. దీనికి మూలం అజ్ఞానం. దానికి జ్ఞానమనే మందు పడితే అంతర్భూతమైవున్న అన్నిరకాల వ్యాధులూ ఒకేసారి పోతాయి" అనిచెప్పారు భగవాన్._*

*_“సాధనవల్ల సద్యః ఫలితాలు కలగడం కద్దా?” అన్నారా పృచ్ఛకులు._*

*_"కొన్ని సద్యః ఫలిస్తవి, కొన్ని ఫలించవు, ఎందువల్లనంటే తీవ్రతీవ్రతల ననుసరించి అది నడుస్తుంది. పుణ్యంకానీ పాపంకానీ తీవ్రంగా చేస్తే వెంటనే ఫలిస్తుంది. నిదానంగా చేస్తే నిదానమే. అయితే, దేనికది ఫలించక తప్పదు" అని సెలవిచ్చారు భగవాన్ !_*
               *_-(సూరి నాగమ్మ)._*

No comments:

Post a Comment