Monday, July 22, 2024

****దక్షిణామూర్తి.. గురువే లేకుండా నిర్వికల్ప స్థితిని సాధించిన ఒకే ఒక్కరు!*

 [7/21, 17:11] +91 73963 92086: *దక్షిణామూర్తి.. గురువే లేకుండా నిర్వికల్ప స్థితిని సాధించిన ఒకే ఒక్కరు!*
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩

గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధాన కర్తగా భావిస్తారు. వేదవ్యాసుని మానవజాతి కంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్లారు కాబట్టి ఆయనను మానవాళికంతటికీ గురువుగా భావిస్తుంటారు.


వేదాలను నాలుగు భాగాలుగా విభజించినవాడు వ్యాసుడు.

బ్రహ్మ సూత్రాలను రాసిన బాదరాయణుడు వ్యాసమహర్షే.

గురువే లేకుండానే నిర్వికల్ప స్థితిని సాధించిన ఏకైక వ్యక్తి శివుడు.


పరాశర మహర్షి, మత్స్య కన్య సత్యవతిల కుమారుడు వ్యాసుడు. అలా వ్యాసుని జననం కులరహితంగా ఏర్పడింది. వాస్తవానికి వ్యాసుడి అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. నలుపు రంగులో ఉన్నవాడు కాబట్టి కృష్ణ అనీ, ద్వీపంలో జన్మించినవాడు కాబట్టి ద్వైపాయనుడు అనీ ఆయనకు ఆ పేరు స్థిరపడింది.


 అప్పటివరకూ ఉన్న వేద సాహిత్యాన్ని క్రోడీకరించి, నాలుగు భాగాలుగా విభజించాడు 
కాబట్టి ఈ కృష్ణద్వైపాయనుడు ‘వేద వ్యాసుడు’గా మారాడు. వ్యాసుడు కేవలం భారతాన్నే కాదు, భాగవతం సహా అష్టాదశ పురాణాలు, యోగసూత్రాలకు భాష్యాన్ని అందించాడు. ఇక బ్రహ్మ సూత్రాలను రాసిన బాదరాయణుడు మరెవ్వరో కాదు, వ్యాసుడే అన్నవారు లేకపోలేదు.


ఇక, గురువు ద్వారా జ్ఞానాన్ని ఆర్జించి, దానిని ఆచరణలో పెట్టినవాడే యోగిగా మారుతాడు. 
కానీ గురువే లేకుండానే నిర్వికల్ప స్థితిని సాధించింది ఆ పరమేశ్వరుడు
ఒక్కడే. 


అందుకనే ఆయన ఆదియోగిగా పూజలందుకుంటున్నారు. అలాంటి ఆదియోగి నుంచి జ్ఞానాన్ని పొందాలని ఎందరో ప్రయత్నించి విఫలమయ్యారు. కానీ ఏడుగురు మాత్రం పట్టు వదలకుండా ఆయన చెంతనే ఉండిపోయారు. పరమేశ్వరుడు తమతో ఒక్క మాటాడకున్నా ఏళ్ల తరబడి ఆయన కరుణ కోసం చూస్తూ తపించిపోయారు.


వారి పట్టుదల ఏ పాటిదో తెలుసుకోడానికి శివుడు దశాబ్దాల తరబడి ఎటువంటి జ్ఞానాబోధ చేయలేదు. అయినా వారి మాత్రం పట్టు వీడలేదు. పరమేశ్వరుడి దివ్య సముఖంలో తపస్సు చేస్తూ ఉండిపోయారు. చివరికి ఒక రోజున జ్ఞానాన్ని స్వీకరించేంతటి తేజస్సు వారిలో ప్రకాశించడాన్ని శివుడు గమనించాడు. 


అటుపై దక్షిణదిక్కుగా కూర్చుని వారికి ఉపదేశం చేశాడు. అలా శివుడు దక్షిణామూర్తిగా, జ్ఞానానికి అధిపతి అయితే, ఆయన నుంచి యోగాన్ని అభ్యసించిన ఆ ఏడుగురూ సప్తర్షులు అయ్యారు. శివుడు దక్షిణ దిక్కుగా ఎందుకు కూర్చున్నాడు అనడానికి ఒక హేతువు కనిపిస్తుంది. దక్షిణ దిక్కు యమస్థానం! అంటే మృత్యువుకి సంకేతం. ఆ మృత్యువుకి అతీతమైన జ్ఞానాన్ని, సంసార బంధనాలను ఛేదించే యోగాన్ని అందజేయడానికి పరమేశ్వరుడు దక్షిణామూర్తిగా మారాడు.

🕉🌞🌎🌙🌟🚩

*వేదం-గురుశిష్య సంబంధం*
🕉🌞🌎🌙🌟🚩

విద్య నేర్చినవారి సంఖ్య పెరగాలి. ఇందుకు సహకరించేవాళ్లే గురువులు. శిష్యునికి అవసరమైన విద్యాబుద్ధులను నేర్పడం గురువు వంతైతే, గురువు నేర్పిన దాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుని ఆచరణలో పెట్టడం శిష్యుల బాధ్యత. కొద్దిరోజుల్లో పాఠశాలలు, కళాశాలలో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంగా గురుశిష్యుల సంబంధం గురించి మన వేదాలు ఏం చెబుతున్నాయో ఒకసారి పరికిద్దాం.

చదివేవాడు శిష్యుడు. చదివించేవాడు గురువు. గురుశిష్యులిద్దరూ విద్యారంభంలో పరమేశ్వరుణ్ణి ప్రార్థించడం వైదిక సంప్రదాయం. విద్యకు పూర్వరూపం గురువైతే ఉత్తర రూపం శిష్యుడు. విద్యా వ్యవస్థలో గురుశిష్యుల సంబంధానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. చదువు చెప్పడం వల్ల గురువు, నేర్చుకోవడం వల్ల శిష్యుడు తృప్తిపడాలి. విద్య ప్రభావం వల్ల ఇద్దరూ రక్షింపబడాలి. ఇద్దరూ నిగ్రహశక్తిని కలిగినవారు కావాలి. ఇద్దరికీ బ్రహ్మతేజస్సు కలగాలి. ముఖ్యంగా వారిద్దరి మనస్సులు ప్రశాంతతకు ఆలవాలం కావాలి. ఎవరు ఎవరినీ ద్వేషించుకోరాదు. పరస్పరం స్నేహపూర్వకంగా అధ్యయన, అధ్యాపనాలు కొనసాగాలని వేదం ఉపదేశిస్తుంది. ఉపదేశం చేయడం వల్ల గురువు, వినడం వల్ల శిష్యుడు కీర్తిమంతులు కావాలన్నది వేదోక్తి.

ఓంకారంతో ప్రారంభం

ప్రాచీన కాలంలో ఏ కార్యక్రమాన్ని ఆరంభించినా అది ఓంకారంతోనే జరిగేది. విద్యాభ్యాసం కూడా ఓంకారోచ్ఛారణతోనే మొదలుకావడం వైదిక పద్ధతి. అధ్యయనం రెండు విధాలు. ఒకటి గురువులు శిష్యులకు కర్తవ్యాకర్తవ్యాలను గూర్చి శిక్షణ ఇవ్వడం. రెండు శిష్యులు గురువులు చెప్పినదాన్ని బాగా విని ఆచరణలో పెట్టడం. ఆచరణ రహితమైన అధ్యయనం ఇష్టసిద్ధిని కూర్చదని వేదవాక్కు తెలియజేస్తుంది. గురుశిష్యులిద్దరూ యమనియమ నిష్ఠాగరిష్ఠులైనప్పుడే లోకం బాగుపడుతుందని వేదం ప్రబోధిస్తుంది. ప్రాణవాయువు వలె ఇద్దరూ యోగ క్రియలలో పాల్గొనాలని, శమాది గుణాలను అలవర్చుకోవాలని తమ తమ ఆత్మలను ప్రకాశింపజేసుకోవాలని వేదం ఉపదేశిస్తుంది. ఏ యోగ శక్తి చేత సమాజం శక్తివంతం అవుతుందో, అట్టి యోగశక్తిని అలవర్చుకోవడానికే గురువు తగిన విధంగా శిష్యుణ్ణి తయారుచేయాలని వేదం చెప్తుంది. పంచప్రాణాలలో ప్రాణానికి, ఉదానానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. గురువు ప్రాణంతో సమానమైతే శిష్యుడు ఉదానంతో సమానం. ఇద్దరూ యోగవిద్యాకుశలురై తాము ఉద్ధరింపబడడమే గాక లోకోపకారకంగా వ్యవహరించాల
[7/21, 17:11] +91 73963 92086: ని వేదం తెలుపుతుంది. మంచి చెడులను విడదీయగలిగిన గురువులు శిష్యులను మంచి ప్రవర్తన కలిగినవారిగా తయారుచేసి సంతోషాన్ని పొందాలని, గురుశిష్యులు చక్కని జ్ఞానం ఇచ్చే వాక్కును ధరించాలని వేదం ఉద్బోధిస్తుంది.

యోగం వైపు పయనం..

గురుశిష్యులు సూర్యచంద్రుల వలె ప్రకాశించాలని, ప్రభాతకాలంలోని ఉషస్సులాంటి వాక్కుతో దైనందిన కార్యక్రమాలను తేజోవంతం చేయాలని, గృహం లాగా సుఖాన్ని కలిగించే యోగరూప యజ్ఞాన్ని సాధించాలని, శిష్యులు ఎల్లవేళల శ్రేష్ఠమైన యోగరీతులను అనుష్ఠించే గురువులకు సమీపంలో ఉండాలని వేదం ఆజ్ఞాపిస్తుంది. యోగకుశలురైన గురువులు మధురంగా భాషిస్తూ, శిష్యులను యోగం వైపు మళ్లించాలని, తమ సర్వస్వాన్ని యోగంగా భావించాలని వేదం సందేశమిస్తుంది. విద్యతో పాటు యోగమే గురుశిష్యులను కలుపుతుంది. అవిద్య నుండి వైదొలగి విద్యారూప ప్రకాశాన్ని పొందినప్పుడే గురుశిష్యుల అనుబంధం దృఢమవుతుందని, అది ప్రాచీన మహర్షుల విషయంలోను, ఆధునిక యోగుల విషయంలోను నిరూపితమైందని వేదం తెలియజేస్తుంది. గురుశిష్యులు యోగవిద్యచే ప్రకాశితులై, జీవితంలో ఉన్నతిని సాధించి, తద్వారా లోకానికి మేలు చేయాలని వేదం ప్రతిపాదిస్తుంది. యోగబలం కలిగినవారు ఉత్తమ వీరులతో సమానులు. వారు యోగవిద్యా ప్రచారం ద్వారా శిష్యుల ఆత్మబలాన్ని పెంచుతూ ఆదిత్యుల వలె ప్రకాశిస్తారని వేదం ప్రశంసిస్తుంది.

గురువే మిత్రుడు

గురువు శిష్యులకు ఎల్లవేళల మిత్రునిగానే ఉండాలని, విద్యల ద్వారా ప్రత్యేకించి యోగవిద్య ద్వారా శిష్యులకు నైతిక శిక్షణను ఇస్తూ సమాజానికి మేలు చేయాలని వేదం వివరిస్తుంది. వేదం దృష్టిలో స్త్రీ, పురుషులు సమానులే. అబ్బాయిలతో పాటు అమ్మాయిలు అన్ని విద్యలు నేర్చుకోవాలని, చివరికి దేశ రక్షణకు ఉపకరించే యుద్ధవిద్యలను కూడా అలవర్చుకోవాలని, గృహకార్యములందే గా, యజ్ఞయాగాదులందు విదుషీమణులుగా రాణించాలని వేదం ఉపదేశిస్తుంది. అధ్యయనం, అధ్యాపనం రెండూ యజ్ఞకర్మలుగానే చెప్పబడినవి. విద్యాభివృద్ధి కొరకు యజ్ఞరూప పఠన పాఠనాలు నిరంతరం సాగాలి. గురువు శిష్యునికి హృదయంలోని ప్రాణవాయువు వలె జీవితాన్ని ప్రసాదించాలి. శరీరమంతటా ఉండే వ్యానం వలె అన్నసమృద్ధికి అవసరమైన జ్ఞానాన్ని ఇవ్వాలి. కంఠబిలంలో గల ఉదానం వలె ఉన్నతిని సాధించడానికి అవసరమైన జ్ఞానాన్ని ఉపదేశించాలి. ఇట్లే పరాక్రమాన్ని సాధించడానికి, సత్య సంభాషణ సాగించడానికి, విజ్ఞాన రంగంలో ప్రవేశించడానికి, ఆత్మబలాన్ని సంపాదించడానికి, శబ్దార్థజ్ఞానాన్ని పొందడానికి గురువే శిష్యునికి తగిన విద్యాబోధన చేయాలని వేదం ప్రబోధిస్తుంది.

తల్లిదండ్రులే మొదటి గురువులు

మానవాళికి పుష్టిని, తుష్టిని కలిగించడానికి, ఉత్తమ గుణాల ద్వారా వారిని రక్షించడానికే విద్వాంసులు సృష్టింపబడినారు. కనుక వారు విద్యార్థులను జ్ఞానవంతులుగాను, ఐశ్వర్యవంతులుగాను, బలవంతులుగాను తయారుచేయవలసి ఉంది. విద్య ద్వారా, క్రమశిక్షణ ద్వారా గురువులు శిష్యులకు ఆదర్శంగా ఉంటారు. విద్వాంసులు, విదుషీమణులైన స్త్రీలు బాలబాలికలను చేరదీసి విద్యాదానం చేయాలి. అలాంటివారికి పాలకులు, ధనవంతులు విరివిగా ధనసాయం చేయాలి. బాలబాలికలకు బ్రహ్మచర్య ప్రాశస్త్యం తెలియజేయాల్సిన బాధ్యత గురువులదే. గురుదక్షిణగా శిష్యులు యథోచిత సత్కారాలు చేయవచ్చు. యజమానులు తమ పిల్లలను విద్వాంసుల ఆశ్రమాలకు పంపాలి. ఐతే ఎనిమిది సంవత్సరాల వరకు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించవలసినవారు వారి తల్లిదండ్రులే. ఆ తర్వాత మరో ఎనిమిదేళ్లదాకా పిల్లలకు తమ అధీనంలో ఉంచుకొని ఉత్తమ పౌరులను చేసే బాధ్యత గురువులదే.

🕉🌞🌎🌙🌟🚩

*గురువు అంటే ఎవరు..? ఆవశ్యకత ఏమిటి..?*

ప్రతి ఒక్కరికి తల్లి తొలి గురువు. ఓనమాలు దిద్దించే సమయంలో తండ్రి గురువు, ఆ తరువాత జ్ఞానాన్ని భోదించే ఉపాధ్యాయుడు గురువు. అందుకే అమ్మ నాన్నాల తరువాత అంతటి ప్రాదాన్యం గురువులకి ఇచ్చాం. శిష్యులు లేని గురువులు ఉండవచ్చు కాని గురువు లేని శిష్యులుండరు…


జీవితంలో అంద‌రూ అన్నీ తెలుసుకోలేరు. అనుభ‌వంతోనూ, ఆలోచ‌న‌తోనూ, అభ్యాసంతోనూ కొంద‌రు మ‌న‌కంటే జ్ఞాన‌వంతులై ఉంటారు. అలాంటి జ్ఞాన‌సంప‌న్నులే గురువులు. “అంతా నీలోనే ఉంది. నువ్వ‌వ‌రో ముందు తెలుసుకో! ” అని చెప్ప‌డానికి కూడా ఒక గురువు కావాలి క‌దా! బ్ర‌తుక‌నే ప్ర‌యాణంలో 


ప్ర‌తి మ‌జిలీ గురించీ క్షుణ్నంగా తెలిసిన‌వాడే గురువు. అసలు గురువు అంటే ఏంటి?? “గు” అంటే అజ్ఞనాంధకారం అని అర్ధం.. “రు” అంటే అజ్ఞానాన్ని నిరోధించేది అని అర్ధం.. గురువు అంటే అజ్ఞానాంధకారాన్ని నిరోధించేవాడని అర్ధం.
జీవితానికి మార్గ నిర్దేశనం చేసే వారు, ముక్తి మార్గం వైపు నడిపించే వారు, తత్వ జ్ఞానాన్ని ప్రసాదించేవారు, అజ్ఞానమనే అంధకారాన్ని పోగొట్టి జ్ఞానం అనే వెలుతురూ చూపించే వారు, సన్మార్గం వైపు నడిపించే వారు వీరందరూ గురువులే.. మనం భగవంతుని చేరాలంటే ముందుగా ఆ జ్ఞానాన్ని పొందాల్సింది గురువు దగ్గరే.. గురువే మనకి అనుసందాన కర్త.
అందుకే అన్నీ తెలిసిన దేవ‌త‌లైనా, అజ్ఞానానికి మారుపేరైన అసురులైనా గురువుని ఆశ్ర‌యించ‌క త‌ప్ప‌లేదు. 


ప్ర‌తి గురుశిష్య బంధ‌మూ లోకానికి ఓ కొత్త ఒర‌వ‌డిని ఇస్త
 ుంది. శ్రీ రాముని తీర్చిదిద్దిన వ‌శిష్ఠుల మహర్షి నుంచి గురువు విశిష్టతను తెలియజేయడానికి శ్రీ కృష్ణ పరమాత్ముడు సందీప మహర్షి వద్ద శిష్యరికం చేసి విద్యను అభ్యసించాడు. వివేకానందుని కార్యోన్ముఖుడిని చేసిన రామ‌కృష్ణులు ఇలా ప్ర‌తి గురువూ పూజ‌నీయులే!

🕉🌞🌎🌙🌟🚩

No comments:

Post a Comment