*వీరి గళానికి తెల్లదొరలే హడలెత్తిపోయారు.. అతనెవరో మీకు తెలుసా..*
స్వాతంత్ర్యోద్యమ కవుల్లో గరిమెళ్ళ సత్యనారాయణ (జూలై 14, 1893 - డిసెంబర్ 18, 1952) ది విశిష్టమైన స్థానం. గరిమెళ్ళ గేయాలు జాతీయ వీరరసంతో తొణికిసలాడుతూ పాఠక జనాన్ని ఉర్రూతలూగించాయి. అతను వ్రాసిన ' మా కొద్దీ తెల్ల దొరతనం .... " పాట సత్యాగ్రహులకు గొప్ప తెగువను, ఉత్తేజాన్ని కలిగించింది. అలాగే " దండాలు దండాలు భారత మాత ' అనే గీతం కూడా ప్రజలను ఎంతగానో జాగృతం చేసి స్వాతంత్ర్య ఉద్యమంలోకి ఉరికే తెగువను కలగజేసింది. దేశభక్తి కవితలు వ్రాసి జైలుశిక్ష అనుభవించిన వారిలో ప్రథముడు గరిమెళ్ళ. నిజాయితీకి, నిర్భీతికి గరిమెళ్ళ మారుపేరుగా నిలిచాడు. మాకొద్దీ తెల్ల దొరతనం పాట ఆనాడు ప్రతి తెలుగు వాడి నోటా మార్మోగేది.
1915వ సంవత్సరంలో స్వదేశానికి తిరిగి వచ్చిన తరువాత సబర్మతీ ఆశ్రమాన్ని స్థాపించి, గాంధీజీ ఒకసారి జాతీయ గీతాల కవుల సమావేశాన్ని నిర్వహించారు. ఆహ్వానితుల్లో గరిమెళ్ళ కూడా ఒకరు. వచ్చిన కవులు తమ గీతాల్ని వరుసగా వినిపించసాగారు. గరిమెళ్ళ తనవంతు వచ్చాక “మా కొద్దీ తెల్ల దొరతనం” అంటూ పై గీతాలన్నీ ఆలపించి, దానికి బహుమతి ఒక సంవత్సరం జైలు శిక్ష అని చెప్పారు. గాంధీజీ పాటను విని ఆశ్చర్యచకితులై అదే బాణీలో పాటలు వ్రాయమని మిగతా కవులకు సలహా ఇచ్చారట.
ఆయనంత ప్రసిద్ధినొందిన జాతీయకవి ఆ రోజుల్లో మరొకరులేరు. తెలుగునాట జాతీయ కవిత్వానికి ఒరవడి పెట్టిన కవి ప్రముఖుడు గరిమెళ్ళ.
No comments:
Post a Comment