Wednesday, July 3, 2024

శివ తత్వం గురించి

 ఓం నమశ్శివాయ🙏
ఫ్రెండ్స్ ఈ రోజు శివ తత్వం గురించి తెలుసుకుందాం 
 శివ తత్వం గురించి తెలుసుకుంటే దానిని అర్థం చేసుకుంటే జీవితంలో ఎన్ని ఉపద్రవాలు వచ్చిన ఆనందం గా స్వీకరిస్తారు దేనికి బాధ పడరు🙏  
 తండ్రి పరమేశ్వర
"ఆడవాళ్ళని,మగవాళ్ళని వేరు చేసి చూసే మాకు గంగని తలపై పెట్టుకొని,పార్వతికి శరీరంలో సగ భాగం ఇచ్చి..ఆడవాళ్లంటే,మగవాళ్ళకి వ్యతిరేకం కాధు..మగవారిలాగే,ఆడవాళ్లు కూడా ఈసృష్టిలో ఒక భాగం అనే విషయం చెప్పావు చూడు ఎవరు చెప్పగలరు నీవు తప్ప తండ్రి శంకర

"మేడలో పాముని వేసుకొని,అది తినే ఎలుకని కొడుక్కి వాహనంగా ఇచ్చి,పాముని తినే నెమలిని ఇంకో బిడ్డకి వాహనంగా చేర్చి,నువ్వెక్కి తిరిగే నందిని తినే సింహాన్ని పార్వతికి ఆసనంగా మార్చి,అవన్నీ ఒకే దెగ్గర ఉండేలా చేసి ..ఇవే జాతి వైరం లేకుండా పక్క, పక్కన బ్రతుకుతున్నాయి,మరి జ్ఞానమున్న మనుషులు మీ పరిస్థితేంటి అని చక్కటి సందేశాన్ని ఇచ్చావు ఎవరి ఇవ్వగలరు నీవు తప్ప తండ్రి మహా దేవా

"సాగర మధనంలో విషం వచ్చినప్పుడు అందరికంటే ముందుగా అక్కడికి చేరింది నువ్వే,అమృతం వచ్చినప్పుడు అక్కడికి రానిది కూడా నువ్వే...ఫలితం ఎవ్వరు సుఖంగా అనుభవించినా పర్లేదు,కానీ దాని తాలూకు కష్టం మొత్తం మనమే అనుభవించాలని చక్కని ఆలోచన ఇచ్చావు నీ బిడ్డలకు ఎవరు ఇవ్వగలరు నీవు తప్ప తండ్రి  పరమేశ్వర

"కోపం ప్రతి జీవి లక్షణం ,కానీ,అది అవలక్షణం అవ్వకూడదనే విషయాన్నీ మాకు తెలియడానికి 
నీ జీవితాన్నే చాలసార్లు 
ఉదాహరణగా చుపించావ్ కదా తండ్రి వీరభద్ర

" అర్హతలేని వాళ్లకి అవకాశమిస్తే ఏమవుతుందో "ఒక రాక్షసుడికి తల మీద చెయ్యి పెడితే భస్మమై పోవాలనే వరాన్ని ఇచ్చి,ఒక రాక్షసుడికి చావే లేకుండా వరాన్ని ఇచ్చి నువ్వు పడిన బాధనే నీ  బిడ్డలకు గుణపాఠంలా చెప్పావు ఎవరు చెప్పగలరు నీవు తప్ప తండ్రి శివయ్య 

"మనం చేసిన తప్పు ఎంత పెద్దదైనా సరిచేసుకొని అవకాశం ఉంటుందని,వస్తుందని "మాములు బాలుడి తల ఆవేశంతో నరికి, తర్వాత ఆలోచనతో ఏనుగు తల అతికించి... అందరూ ముందు పూజించాల్సినంత గొప్ప స్థాయికి ఆ బాలున్ని పంపి అందరికి నాయకుడిగా ఉండే వినాయకుణ్ణి చేసి చూయించావు చూడు ఎవరు చూపగలరు నీవు తప్ప తండ్రి మహాదేవ 

"కల్లు తాగినా ,గంజాయి పీల్చిన ఒక్కసారి కూడా 
తప్పుగా ప్రవర్తించిన సందర్భం లేకుండా,ఆ వెంటనే ధ్యానం చేసుకుంటూ.."మన జీవితపు శాశ్వత ఆనందాన్ని తాత్కాలికంగా మార్చేది వ్యసనం,తాత్కలిగంగా చేసిన శాశ్వతంగా ఆనందాన్ని ఇచ్చేది ధ్యానం" అని అలవాట్లు 
ఆ అనుభవించి చక్కటి సందేశాన్ని ఇచ్చావు 
ఎవరి ఇవ్వగలరు నీవు తప్ప తండ్రి మహేశ్వర

నీ గురించి ఎంత చెప్పిన తరిగేది కాదు...
ఎందుకంటే నీ గురించి చెప్పడం కూడా నీ ఛెర్యే కదా తండ్రి 

 నా తండ్రి శివయ్య అర్చర్యం కలిగించే శక్తులు ఉన్నవాడు కాదు,అర్ధం చేసుకుంటే అద్భుతం అనిపించే 
వ్యక్తిత్వం ఉన్నవాడు"...
"శివయ్య కుండాల్సింది భక్తుడిగా కాదు,విద్యార్థిగా"...

 నా తండ్రి పరమేశ్వరుడు పూజించాల్సిన దేవుడో లేక నమ్మాల్సిన దేవుడో కాదు..అర్ధం చేసుకోవాల్సిన దేవుడు🙏

No comments:

Post a Comment