శంకరాచార్య ఆలయం (జ్యోతేశ్వర ఆలయం) శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్.....
(గురు పౌర్ణమి సందర్భంగా)
🔔🔔🔔🔔🔔🔔
శ్రీనగర్ పట్టణానికి ఆగ్నేయం వైపు గోపాద్రి కొండపైన సుందరమైన ప్రదేశంలో 1100 అడుగుల ఎత్తులో ఉన్న అందమైన శివాలయం.
దాదాపు 2200 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ ఆలయం పురాతన పేరు గోపాద్రి శివాలయం. డోగ్రా పాలకుడు మహారాజా గులాబ్ సింగ్ మెట్లు నిర్మించిన తరువాత ఈ ఆలయం మరింత అందుబాటులోకి వచ్చింది. పిర్ పంజాల్ పర్వత శ్రేణిలో శీతాకాలంలో మంచుతో కప్పబడిన శిఖరాల మధ్య కనువిందు చేస్తుంది ఈ శివాలయం.
8 వ శతాబ్దంలో భారత పర్యటనలో భాగంగా కాశ్మీర్ శ్రీనగర్‌కు విచ్చేసి ఈ ఆలయంలో తపస్సు చేసి సౌందర్య లహరి గ్రంథం రచించిన శ్రీ ఆది శంకరాచార్యుల జ్ఞాపకార్థం ఈ ఆలయం పేరు శంకరాచార్య ఆలయంగా మార్చారు కాశ్మీర్ మహారాజ లలితాదిత్య గారు.....
శంకరాచార్యుల ఆలయానికి చాలా చరిత్ర ఉంది .
శంకరాచార్య కొండకు ముస్లిం మతోన్మాద మొఘల్ పరిపాలనలో తఖ్త్-ఎ-సులేమాన్ అని పేరు పెట్టి ఈ ఆలయాన్ని మూసి వేశారు. తర్వాత సిక్కుల పరిపాలన కాలంలో హిందువులు ఆలయం తెరిచి ప్రార్థనలు పూజలు సేవలను ప్రారంభించారు. ఈ ఆలయంలో విద్యుత్ సౌకర్యం 1925 లో కాశ్మీర్ ప్రాంతానికి తీర్ధ యాత్రలకు విచ్చేసిన మైసూర్ మహారాజా చేత చేయబడ్డాయి.
ప్రస్తుత ఆది శంకరాచార్యుల విగ్రహాన్ని ఆలయంలో 1961 లో ప్రతిష్ఠ చేశారు మరియు 1974 లో భారత ప్రభుత్వం వారు కొండ పైకి రహదారిని నిర్మించారు .....
కేవలం ఆధ్యాత్మిక కేంద్రమే కాకుండా గొప్ప పురావస్తు విలువ కూడా కలిగి ఉంది.
🙏🏻హర హర శంకర ...జయ జయ శంకర🙏🏻
No comments:
Post a Comment