Thursday, July 11, 2024

ఇవే అలవాట్లు కోరికలు నమ్మకాలు......... నిజాలు........

 బ్రతకటానికి రోజు అనేకసార్లు ఆహారం ఎలా తీసుకుంటున్నామో -- ఆ ఆహారం కొరకు ధన సంపాదన అనే కృషి ఎలా చేస్తున్నామో - అలాగే బ్రతుకులో ఇతర అవసరాల కొరకు అనేక ప్రయత్నాలు, పనులు ఎలా చేస్తున్నామో.....,..........

అదేవిధముగా మన స్వీయ స్వరూప ఆత్మశక్తి ఎరుక కొరకు నిత్యము తెలుసుకుంటూ - అర్ధం చేసుకుంటూ - ఆ భావనను మనలో నిలుపుకునేలా సాధన చేసుకుంటూ ఉండాలి.........

మనం రోజు గ్రహించి ఆచరించేవాటిని మన శరీరం సత్యాలుగా నమ్ముతుంది. వాటినే ఆచరించి - తిరిగి చేయటానికి ఇష్టపడుతుంది. ఇవే అలవాట్లు కోరికలు నమ్మకాలు......... నిజాలు........

No comments:

Post a Comment