🌸 *అమృతం గమయ* 🌸
*అమృత వాక్కు- నిత్య దీక్ష ప్రతి నిత్యము*
నీతో రాని సంపదని కూడబెట్టుకోవడం కాదు. ఆ సంపదని అనుభవించే లోపే, దాన్ని రక్షించుకునే క్రమంలో అనుక్షణం భయంతో రోగాలొచ్చి చస్తావు. మనసుని విశాలపరుచుకోవటం నేర్చుకో.
ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం కాదు. కొన్ని పద్దతుల్ని పాటించు. ఖర్చు పెట్టటంకాదు. పొదుపు చేయటం కూడా నేర్చుకో, దాన్ని సద్వినియోగం చేయి.
కనిపించిందల్లా పొందేసెయ్యాలనుకోకు , పొందిన దాన్ని చక్కగా ఉపయోగించడం నేర్చుకో.
ఎక్కడ ఎప్పుడు ఎందుకు ఎవరితో ఎంత వరకు ప్రవర్తించాలి అనే ఐదు విలువలను తెలుసుకుని నడచుకో. దానివల్ల నీ జీవితం శాంతి మయమవుతుంది.
విలువల్ని గురించి మాట్లాడటంకాదు. ఆచరించు.
-- సత్ చిత్
No comments:
Post a Comment