*‘ఆత్మజ్ఞానం’*
మనం గ్రహించాల్సిన ముఖ్యాంశాలు! జాగ్రత్తగా ఈ క్రింది విషయాలను అర్ధంచేసుకోగలరు!
1. ప్రతి జీవి కర్మ చేయాల్సిందే. ఏ కర్మ చేయకుండా మనుజులు ఒక్క క్షణం వుండలేరు.
2. చేసే ప్రతి కర్మ నిష్కామంతో (ప్రతిఫలం ఆశించకుండా) చేయాలి. దాన్నే కర్మయోగము అంటారు.
3. ఆత్మజ్ఞానము పొందాలంటే కర్మలన్నీ నిష్కామంతోనే చెయ్యాలి.
4. కర్మయోగికైనా, జ్ఞానయోగికైనా ఈ నిష్కామకర్మాచరణ తప్పదు.
5. కర్మలో అకర్మని, అకర్మలో కర్మని చూడాలి.
6. కర్మయోగంతో చిత్తశుద్ధికలిగి జ్ఞానము ఉదయిస్తుంది.
7. జ్ఞానము కలిగిన తరువాత వైరాగ్యముతో కూడిన అభ్యాసము చేయాలి.
8. అన్ని జీవులయందు సమదృష్టి కలిగియుండాలి.
9. ధ్యానంతో ప్రాపంచిక విషయాలనుండి దృష్టి మరల్చాలి.
10. తనలో నిగూఢంగా వున్న ఆత్మను దర్శించాలి.
11. ఆత్మ విచారణతో పరమాత్మను అర్ధము చేసుకోవాలి.
12. పరమాత్మను తెలుసుకుంటే ఇక తెలుసుకోవలసింది ఏమీలేదు.
13. దీనితో మానవుడు అన్ని బంధాలనుండి విడిపడి జీవన్ముక్తుడవుతాడు.
14. జీవాత్మ పరమాత్మలో విలీనము అవుతుంది.
15. అంతటితో ఈ జననమరణ చట్రము నుండి బయటపడి, అవసరాన్ని బట్టి, ఆత్మ తన ఇచ్చానుసారం లోకంలో అవతరించుట, లోకము వీడివెళ్ళుట జరుగుతుంది. వారే సత్పురుషులు లేదా సద్గురువులు.
No comments:
Post a Comment