Sunday, July 14, 2024

****ఒకడి ఇంగిలి మరొకడు తినాల్సిన అవసరం ఏమిటి?..

 ఒకడి ఇంగిలి మరొకడు తినాల్సిన అవసరం ఏమిటి?.. ఒకే పళ్లెంలో అందరూ చేతులు వేసి సామూహికంగా తినేంత కరువు ఏమి వచ్చి పడింది?. మనం మనుషులమా?.  జంతువులమా?..
కొన్నేళ్లుగా హైదరాబాద్ నగర ప్రజల ఆహారపు అలవాట్లు చాలా మారిపోయాయి.. మారిపోయాయి అనడం కన్నా మార్చబడ్డాయి అనడం ఉత్తమం..
సాంప్రదాయ ఆహారశాలలు మూతపడుతున్నాయి వాటి స్థానంలో కొత్త కొత్త రెస్టారెంట్ వస్తున్నాయి.. 
ఒకప్పుడు ఉడిపి హోటళ్లు.. అంటే ఇడ్లీ, వడ, దోశ, పూరీ తదితర శాకాహార హోటళ్లు, భోజన శాలలు చాలా ఉండేవి. ఆ తర్వాత స్థానాల్లో బిర్యానీతో పాటు ఇతర మాంసాహార హోటళ్లు ఉండేవి.. బన్ మస్క, చాయ్, బిస్కట్, బేకరీలు, ఇతర ఫాస్ట్ ఫుడ్ సరే సరి
ఇప్పడు ఇవన్నీ పోయి మండిలు వచ్చాయి. 
ఈ మండీల్లో యెమెన్-అరబ్ వంటకాలు ఉంటాయి. మటన్, చికెన్, బీఫ్ ఇతర మాంసాహారాలు ప్రత్యేక పద్ధతుల్లో వండి పెద్ద ప్లేట్లలో తెచ్చి పెడతారు. వాటి చుట్టూ కూర్చొని దెయ్యాల్లా పీక్కు తినాలి.. అందరూ ప్లేట్లో చేతులు పెట్టి ఒకడి ఎంగిలి మరొకడు అసహ్యంగా తింటుంటారు.. అంటే. ఒకడి రోగం మరొకడికి తేలికగా వ్యాపిస్తుంది..
ఈ ఆహారపు అలవాట్లు అనాగరిక దేశాలకు సంబంధించినవి. 
ఈ మండిలు ఒక్క హైదరాబాద్ కే పరిమితం కాదు ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపిస్తూ మన సాంప్రదాయ ఆహారపు అలవాట్లను మార్చేస్తున్నాయి.. 
ఈ చెత్త తిండి తిని ఎంతో మంది అస్వస్థతకు గురవుతున్నారు. ప్రాణాలు కూడా పోతున్నాయి.. ఒక్కసారి 'మండి ఫుడ్ అస్వస్థత' అని టైప్ చేసి చూడండి.. మీకే అర్థం అవుతుంది..

No comments:

Post a Comment