*మమ్మల్ని వాడుకోరా నాయనా....*
చౌకగా వస్తుందని
చక్కగా ఉందని
చాలా సార్లు వాడొచ్చని
ఇంకెన్నాళ్ళు
సమాజాన్ని పాడు చేసే ప్లాస్టిక్‌ను చేతినేసుకుని తిరుగుతావు....
చాయ్ నీళ్ళు దాన్లోనే
చార్ చట్నీ దాన్లోనే
చేతి వస్తువులు దాన్లోనే
చమురు బిందువులు దాన్లోనే
చివరికి మట్టికడుపులో కెళ్ళే
నీ బ్రతుకు కూడా ఆ ప్లాస్టిక్ కవర్ల కౌగిలిలోనే...
అది...
నీ అవసరమై
నీ చెంతకు వచ్చి
నీ చుట్టూ తిరిగి
నిన్నే ఇప్పుడు తన చుట్టూ తిప్పుతూ
నీ ఆరోగ్యాన్నే చుట్టేస్తున్న ఆ ప్లాస్టిక్‌కు
ఇకనైనా పాడే కట్టవా మనిషి...
అది...
చెట్ల అంతు చూస్తున్నది
మూగజీవుల ప్రాణం తీస్తున్నది
చెరువులు సముద్రాలు గుణం మారుస్తున్నది
నీ మనుగడకే ఎసరు పెడుతూ
మరణం లేని చిరంజీవై
మహి మనుగడను కాలుష్యకోరాంగాలతో
మానభంగం చేస్తున్నది....
దాని దుంపతెంచ
*ఈ కాగితపు సంచులను వస్తువులను వాడి*
రేపటి తరాలకు ప్లాస్టిక్ రహిత భవితకు బాటలు వేయరా ఓ వెర్రి మనిషి...
*అభిరామ్ 9704153642*
No comments:
Post a Comment