Tuesday, July 9, 2024

మన పిల్లలకి మన ధర్మాన్ని బోధించుదాం...

 *ఒకచోట ఓ పెద్ద సభ జరుగుతోంది. ఒక వక్త అదే పనిగా* *'అహింసో పరమో ధర్మః' అని ఊదర కొట్టేస్తున్నాడు.*

*వింటున్న నాలాంటోడికి  విసుగు పుట్టింది.*
*కూర్చున్న అతను పైకి లేచాడు.*

*పక్కనున్న వాళ్ళు 'సమావేశం అయ్యాక భోజనాలు ఉంటాయి... కూర్చోండి' అన్నారు.*

*"నేను వడ్డించడానికే వెళ్తున్నాను" అంటూ వేదిక మీదకు వెళ్ళాడు*

*వేదిక మీద ఉన్నవాళ్ళు 'ఏమిటి..?' అన్నట్లు చూసారు.*

*ఆ పెద్దమనిషి ఇందాకటినుండి 'అహింసో పరమో ధర్మః' అని బోధిస్తున్న వక్త దగ్గరకు వెళ్ళి... వాడి చెంప ఛెళ్ళు మనిపించాడు*.

*ఆ వక్త బిత్తరపోయాడు. వేదిక మీద ఉన్నవాళ్ళు ఉలిక్కిపడి ఆ పెద్దమనిషిని పట్టుకున్నారు.*

*అప్పుడు ఆ పెద్దమనిషి ఇలా అన్నాడు*
*"ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమని కదా..!ఇందాకటి నుండి మీరు చెబుతున్నదీ..? మరి మీరే రెండో చెంప చూపించరేమిటి..?" అని అడిగాడు.*

*బూరెలా వాచిపోయిన చెంపను తడుముకుంటున్న ఆ వక్త బిత్తరపోయి "ఉపన్యాసం ఇమ్మంటే వచ్చాను" అన్నాడు.*

*"మరి ఆ తరువాతి పాదం చెప్పరేమండీ?" అని అడిగాడు ఆ పెద్దమనిషి.*

*"అదీ... అదీ..."*

*"అది నేను చెప్పనా?" అని అడిగాడు ఆ పెద్ద మనిషి.*

*"ఒద్దొద్దు... నేనే చెబుతాను" అంటూ "ధర్మ_హింసా తదైవచ" అని చెప్పాడు, రెండో చెంపకు చెయ్యడ్డం పెట్టుకుంటూ.*

*"ఈ ముక్క నేను కొట్టకముందు చెప్పాలి" అంటూ అందరిని విదిలించుకుని వేదిక దిగాడు ఆ పెద్దమనిషి.*

*అంచేత  నే చెప్పొచ్చేదీ ఏమిటంటే చెప్పే మంచి ముక్కల్ని... ముక్కలు ముక్కలుగా కాకుండా సంపూర్ణంగా చెప్పాలన్నమాట.*

*'అహింస ఎంత ముఖ్యమో, అధర్మం జరుగుతున్నప్పుడు హింస కూడా అంతే ముఖ్యం' అన్నమాట.*

*జాతి నిర్వీర్యం అయ్యే కబుర్లు మాత్రమే చెప్పకండి. జాతిని మేల్కొలిపే ప్రసంగాలు ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేయండి...*

*మహాభారతంలోని ఈ శ్లోకాన్ని హిందువులకు సగం మాత్రమే అలవాటు చేశారు...*

*"అహింసా పరమో ధర్మః." పూర్తి శ్లోకం ఇలా వుంటుంది.*
   
*"అహింసా పరమో ధర్మః*
  *ధర్మ హింసా తదైవచ."*

*అర్థం::  అహింస మానవుని యొక్క పరమ ధర్మము... మరియు ధర్మ రక్షణ కోసం చేయు హింస అంతకంటే శ్రేష్ఠమైనది...*

*అర్థమయ్యిందా  ఓ హైందవుడా... ఇక కార్యోన్ముఖడవు అవ్వు... 🙏*

*"ఇన్నాళ్లూ... అన్నీ సగం సగం చెప్పి... హిందూ సమాజాన్ని సంక నాకిచ్చింది చాలు"*

*మన పిల్లలకి మన ధర్మాన్ని బోధించుదాం...*

*అలాగే షేర్ చేయండి*

No comments:

Post a Comment