Monday, July 8, 2024

 🌍🌄🌝🌳⛈️🇮🇳 
 *నే టి   మా ట*
   07-07-2024

ఎవరి అభిప్రాయం వారిది. ఆ అభిప్రాయాన్ని బహిరంగంగా వెల్లడించే వాక్స్వాతంత్రం అందరికీ సమానంగా ఉంటుంది. సంతోషం. 

ఐతే, దేశ ఐక్యతకు, సమగ్రతకు భంగం కలిగించే మాటలు, బహిరంగ సభలలో మాట్లాడటం, సమంజసమా అని ప్రతి వ్యక్తి ఆలోచించాలి. 

విడిపోతామన్న ప్రాంతాల ప్రజలకు స్వేచ్చ నిస్తే, ఏ దేశం లో నైనా అనేక ప్రాంతాలు విడిపోవడానికే మొగ్గు చూపుతాయి. 

అది కుదరని వ్యవహారం. జమ్మూ కాశ్మీర్ కూడా అంతే. 

జమ్మూ కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమనీ, దానిని వేరు చెయ్యాలను కోవడం మూర్ఘత్వం అనీ, అది అసాధ్యం అనీ, భారత ప్రభుత్వ సైన్య భలం ముందు వేర్పాటువాదుల కుప్పిగంతులు కుదరవనీ, గ్రహించి,  మిగిలిన రాష్ట్రాల ప్రజల లాగానే, జీవనం సాగించడం, కాశ్మీరీలు నేర్చుకోవాలి. వేరే ప్రత్యామ్నాయం లేదు. 

అరుంధతి రాయ్ గారు అపర మేధావి. అనుమానం లేదు. 
కానీ, సామాన్యుడి లాగా ఆలోచించడం, మరింత మంచి విషయం. 

ఏటికి ఎదురీదడా నికి ప్రయత్నించడం గొప్ప విషయం. కానీ, వరదనీటి లో కొట్టుకుపోవడం అత్యంత సహజంగా జరిగే విషయం. 

మేధావుల మనుకునే వాళ్ళు కాస్త భూమి మీద నడవడం నేర్చుకోవాలి.

ఆహారం, ఆరోగ్యం, విద్య, వైద్యం, వసతి, ఉద్యోగం, రక్షణ,  నేటి అవసరాలు. 
వాటిని అభివృద్ధి చేయడం కోసం, అవి అందరికీ సమానంగా అందించడం కోసం కృషి చేద్దాం. 

మతం కారణంగానో,
భాష కారణం గానో,
చారిత్రక నేపథ్యం కారణం గానో,
విడిపోవడం కుదరదు. 
ఇది భారత్ తో సహా, అన్ని దేశాలలో వర్తమాన రాజకీయ పరిస్థితి. 

వొక దేశం లో వుండటం ఇష్టం లేకపోతే, ఇంకొక దేశానికి వెళ్ళి పోవచ్చు. అది కుదురుతుంది. ప్రతి ఏటా కొన్ని లక్షల మంది భారత్ వదిలేసి, వేరే వేరే దేశాలలో స్టిరపడుతున్నారు కదా. 

ఆలోచించండి.
ప్రశాంత మైన, సౌకర్యవంతమైన, జీవనం కావాలా, వద్దా. 

-- *ధర్మ విహారి గాంధీ*

No comments:

Post a Comment