i.Xiia-5.2108b-5.300624-5.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*ధర్మం దానంతట అదే గెలవదు!*
➖➖➖✍️
*అందరూ అంటుంటారు ధర్మమే గెలుస్తుంది అని...*
*అది తప్పు...! ధర్మం దానంతట అదే గెలవదు..!*
*నువ్వు గెలిపించాలి, మనం కలిసి గెలిపించాలి..!*
*అర్థం కాలేదా...?*
*ఒక్కసారి నెత్తుటితో తడిసిన చరిత్ర పుస్తకాలలోకి తొంగి చూడు..!*
**కృత యుగం లో…*
*తన భక్తుడైన ప్రహ్లాదున్ని కాపాడడానికి ధర్మ సంస్థాపనకు భక్తుడి కోసం భగవంతుడు ఉన్నాడు. అని చెప్పడం కోసం, సత్యాన్ని స్థాపించడం కోసం, అణువు అణువు లో భగవంతుడు నృసింహ రూపంలో వ్యాపించి అహోబిల క్షేత్రంలో ఒక స్తంభం నుండీ వచ్చాడు. హిరణ్య కశ్యపుడిని సంహరించాడు.*
*ధర్మాన్ని, సత్యాన్ని స్థాపించడం కోసం భగవంతుడు ఎన్నో రూపాలు ధరించి, కష్టాలు పడుతూ ఉంటాడు.*
**త్రేతాయుగంలో…*
*రాముడి భార్యను రావణాసురుడు ఎత్తుకెళ్ళాడు,*
*సరేలే ధర్మమే గెలుస్తుంది కదా, తన సీత తిరిగి వస్తుంది అని… రాముడు చేతులు కట్టుకొని గుమ్మం వైపు చూస్తూ కూర్చోలేదు.*
*రావణాసురుడి మీద ధర్మయుద్ధం ప్రకటించాడు.*
*ఆ రాముడికి అఖండ వానరసైన్యం తోడై ధర్మం వైపుకు అడుగులు వేశారు.*
*ఆ యుద్ధంలో రాముడికి సైతం గాయాలు అయ్యాయి. తన భుజాలను, తొడ భాగాల చర్మాన్ని బాణాలు చీల్చుకొని వెళ్ళాయి.*
*నరాలు తెగి రక్తం చిందుతున్నాసరే తట్టుకొని నిలబడ్డాడు, పోరాడాడు. యుద్ధంలో గెలిచాడు... ధర్మం గెలిచింది..!*
**ద్వాపరయగంలో…*
*కురుక్షేత్రం యుద్ధంలో కృష్ణుడు తను దేవుడు కదా అని ఒక ప్రేక్షకుడిలా యుద్దాన్ని చూడలేదు..*
*ధర్మం చూసుకున్నాడు, పాండవుల పక్షాన నిలుచున్నాడు, అర్జునుడికి రధ సారధిగా మారాడు, గుర్రానికి గుగ్గిళ్లు పెట్టాడు, అబద్ధం ఆడాడు, చివరకు మోసం కూడా చేసాడు...!*
*అవన్నీధర్మం కోసమే చేసాడు, ధర్మాన్ని గెలిపించడం కోసమే చేసాడు. అలా కురుక్షేత్ర యద్ధం ముగిసింది, ధర్మం గెలిచింది...!*
**కలియుగం…*
*ఇప్పుడు కూడా మనం ప్రతిరోజూ సమస్యలతో పోరాడుతునే వున్నాం..*
*ప్రతి ఒక్కరి మదిలో మంచికి-చెడుకి యుద్ధం జరుగుతునే వుంది..!*
*నువ్వు నమ్మితే అది నిజం మాత్రమే అవుతుంది..!*
*అదే నువ్వు నా, నీ, తన, మన భేదాలను పక్కన పెట్టి న్యాయం గురించి ఆలోచిస్తేనే ధర్మం అర్థం అవుతుంది.*
*అలా అలోచించి పోరాడిన రోజే ధర్మం గెలుస్తుంది!*
*తెగించి అలా ధర్మం వైపుకు నిలబడిన రోజు…*
*నీ వెనకాలా ప్రపంచమే నడుస్తుంది..!*
*ధర్మో రక్షతి రక్షితః*✍️
హిందూ బందువులారా మేలుకోనండి తెలుసుకొండి.ధర్మం పాటించడమే కాదు యుద్ధం కూడా చెయ్యాల్సిందే
ముందుగా హిందువుల్లో ఐకమత్యం దెబ్బతింది (లోపించడం వల్ల కలిగే కష్టాలు. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు ఎవరికీ అర్థం కావడం లేదు
భావి భారత హిందూ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదు.పిల్లలకు ఆస్తులు అంతస్తులు కోసం ఆలోచిస్తున్నారు కానీ మీరు ఇచ్చిన ఆస్తులు వాళ్ళకి ఇచ్చినట్టు (సంపాదించి నట్లు) అవుతుంది
మీరు ఇప్పుడు కళ్ళు మూసుకుని కూర్చుంటే ఇది నిజం
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷🙏
No comments:
Post a Comment