🕉️ఓం శ్రీ గురుభ్యోనమః 👏
🚩🚩నమః శుభోదయం 🚩🚩
విమలానంద బొడ్ల మల్లికార్జున్
అన్ని జన్మలకన్నా మానవ జన్మ ఉత్కృష్టమైనదంటారు. మాట్లాడగలగడం వల్లనే అలా అని ఉంటారు. కానీ తరచి చూస్తే | పశుపక్ష్యాదుల్లోనూ ఎన్నో ప్రత్యేకతలున్నాయి. సాటి ప్రాణికి సాయపడటం, ఆపదలో ఆదుకోవడం, అండగా నిలబడటం, ఆసరా కావడం లాంటివి | పశుపక్ష్యాదుల్లో జన్మతః వచ్చే లక్షణాలు. ఒక కాకి మరణిస్తే ఎన్నో కాకులు చుట్టూ చేరతాయి. ఒక చీమ చనిపోతే మరో చీమ మోసుకుపోతుంది. ఒక పక్షి పెట్టిన గుడ్డును మరో పక్షి పొదిగి పిల్లల్ని చేస్తుంది. అలా చేసినందుకు అవి ఏ ప్రతిఫలాన్నీ ఆశించవు. కానీ బుద్ధిజీవి అనిపించుకున్న మానవుడు అలాంటి సేవలు చెయ్యాలంటే ప్రత్యేకంగా అలవాటు చేసుకోవాలి. లేదా ఇతరులెవరైనా ప్రేరణ కలిగించాలి. ఈ రెండూ కాకపోతే ఆ పని చెయ్యడం వల్ల కొంత ప్రతిఫలమైనా ఉండాలి. ఇది ఎంతవరకు సమంజసమో ఎవరికి వారే ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఉత్కృష్టమైంది అనిపించుకున్న మానవజన్మ కలిగినందుకు అందరికీ ఉపయుక్తమై పనులు చెయ్యడానికి శ్రద్ధ చూపాలి.దీన్ని బాధ్యతాయుత ఆధ్యాత్మికత అంటారు.
జై గురుదేవ్ 👏🌺
No comments:
Post a Comment