Friday, July 12, 2024

 Source from భారతీయ ప్రతిభా విశేషాలు 108 నిజాలు 
-----------------------------------------------------------------------
*ఆంగ్లేయులు నేర్చుకున్న మన బోధనా విధానం*
Replicating Indian Teaching Methods in England

🍁18-19 శతాబ్దంలో అమెరికా ,ఇంగ్లాండ్ దేశాలలో విద్యావ్యాప్తి అంతగా జరగలేదు. ఇంగ్లాండ్ లో 1845 లో 49 శాతం స్త్రీలు వారి పేర్లు కూడా వ్రాయలేని స్థితిలో ఉండేవారు. 12 శాతం మంది మాత్రమే విద్యాధికులు ఉండేవారు. పేద వారిలో విద్యావ్యాప్తి కోసం *ఆండ్రూ బెల్* అనే క్రైస్తవ మత ప్రచారకుడు Mutual Tution ని ప్రవేశపెట్టాడు. *Mutual Tution System* అంటే ఒక విద్యార్ధి ఇతర విద్యార్హులకి పాఠాలు చెప్పి, కంఠస్థం చేయించటం. ఈ పధ్ధతిని అతను *'Madras_System’* అని అన్నాడు. దీనిని Madras లోని వీధిబడులలో నుంచి గ్రహించాడు. భారతదేశంలో ఒక పిల్లవాడు ఇతర పిల్లవాళ్లకు నేర్పించే పధ్ధతి అనేక యుగాలుగా అమలవుతూ ఉంది. 

🍁నేటికి కూడా ‘వెస్ట్ మినిష్టర్ అబే’ లో ఆండ్రూ బెల్ గురించిన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి. 
*మద్రాసు విద్యావిధానం* అనే దాన్ని ప్రారంభించి, బ్రిటిష్ రాజ్యంలో పేద పిల్లల విద్యాబోధనా విధానంగా దానిని మార్చి, ఒక జాతీయ విద్యావిధానానికి రూపకర్త ఇతడు” అని ఉంటుంది. 
Source : Education in India under the rule of the East India Company- by Major B.O.Basu – 1934 II edition

మీ 

*ధర్మవీర్ ఆధ్యాత్మిక చైతన్య వేదిక*

No comments:

Post a Comment