*యావత్తు సృష్టిని.. ఒక్క గంటలో తయారు చేయగల్గిన దేవుడు.. స్త్రీ మూర్తిని తయారు చేయడానికి మాత్రం వారం రోజులు కష్ట పడ్డాడంట. ఎందుకో తెలుసుకోవాలంటే.. మనసు పెట్టి చదవాలి.*👇
*మగాడితో సహా సర్వ జీవులను పుట్టించేసిన దేవుడు చివరగా ఒక స్త్రీని సృష్టించడం మొదలుపెట్టాడు.*
*ఒక రోజూ రెండు రోజులూ కాదు.*
*ఏకంగా వారంరోజులు* *తీసుకున్నాడు..స్త్రీ సృష్టికోసం.*
*మిగిలిన పనులన్నీ *మానుకుని..తన నాథుడు స్త్రీ సృష్టికోసం ఇంతగా* *తలమునకలైపోవడం చూసిన దేవత అడిగింది...*
*"స్త్రీని సృష్టించడానికి ఎందుకింత సమయం తీసుకున్నారని?".*
*అప్పుడు దేవుడు.. "ఏం చెయ్యను మరి...*
*ఈ స్త్రీ హృదయంలో ఎన్ని విషయాలు పొదగాల్సి వచ్చిందో తెలుసా...*
*ఇష్టాయీష్టాలకతీతంగా ఉండాలీ..*
*సృష్టి. వివక్ష తగదు.*
*మొండికేసే పిల్లాడిని క్షణాల్లో దారికి తెచ్చుకోవాలి.*
*చిన్న చిన్న గాయాలు మొదలుకుని ముక్కలయ్యే మనసులవరకూ ఎన్నెన్ని సంఘటనలను ఈ జీవి ఎదుర్కోవాలో తెలుసా...*
*ఆమె ఎంతమందికి ఓ ఔషధంగా పని చేయాలో తెలుసా...*
*ఆమెకు ఆరోగ్యం బాగులేకున్నా సరే తనకు తానే సర్దుకుపోవాలి.*
*అడిగేవారు ఉండరూ ఉండకపోవచ్చు...*
*రోజుకు పద్దెనిమిది గంటలు పని చేయాలి.*
*ఇన్ని రకాల పనులు చెయ్యాల్సి వచ్చినా ఆమెకు ఉన్నవి రెండు చేతులే...." అన్నాడు.*
*"ఏంటీ? ఇన్ని పనులు చేయడానికి ఆమెకు రెండు చేతులేనా?" అని ఆశ్చర్యపోతూ దేవత ఆమెను మెల్లగా తాకింది.*
*"ఇదేంటీ ఇంత మృదువుగా ఉందే ఈమె దేహం" అని ప్రశ్నించింది.*
*ఆప్పుడు దేవుడు.."ఆమె శారీరకంగా మృదువుగా మెత్తగా నాజూకుగా ఉండొచ్చు.*
*కానీ మానసికంగా ఆమె ఎంతో బలవంతురాలు.*
*అందుకే ఆమె ఎన్నో సమస్యలను ఎదుర్కోగలదు. అంతేకాదు,*
*ఆమె అన్ని భారాలనూ తట్టుకోగలదు.*
*ఇష్టం, కష్టం, ప్రేమ, కోపం, తాపం, అంటూ అన్ని భావోద్వేగాలనూ ఆమె చవిచూడాలి.*
*అవసరమైతే దిగమింగాలి.*
*కోపమొస్తే నవ్వుతూ వెల్లడించే శక్తి ఆమెకుండాలి.*
తనకు న్యాయం *అనిపించినప్పుడు అందుకోసం పట్టుపట్టడమూ తెలుసు.*
*ఇతరుల దగ్గర ఆశించేది ప్రేమానురాగాలను...." అన్నాడు.*
*"ఓహో. ఈమె ఆలోచించగలదా" అని దేవత అడిగింది.*
*అప్పుడు దేవుడు..* *"ఎందుకాలోచించదు?*
*అన్ని విషయాలూ ఆలోచించడమే కాకుండా సమస్యలు ఎదురైతే పరిష్కారాలు చెప్పగలదు..." అన్నాడు.*
*దేవత ఆమె చెక్కిళ్ళను తాకి "ఈ చెక్కిళ్ళు తడిగా ఉన్నాయేంటీ? కన్నీరు కారుస్తోందిగా....ఏంటిది? " అని అడిగింది.*
*అప్పుడు దేవుడు..* *"అదా...కన్నీరది.*
*ఆ కన్నీటిలో ఆనందమూ ఆవేదనా దుఃఖమూ దిగులూ ఆశ్చర్యమూ భయమూ అంటూ అన్ని రకాల ఉద్వేగానుభూతులూ ఉంటాయి.*
*ఆ కన్నీటికున్న శక్తి అనంతం....*
*పైగా మరో జీవీకి ప్రాణంపోసి పది నెలలూ పొట్టలో మోసే నేర్పు ఆమెకు ఉంది" చెప్పాడు.*
*దేవత ఆశ్చర్యపోతూ "మీ సృష్టిలో విశిష్టమైనది ఇదే. .." అని చెప్పింది.*
*అయితే దేవుడు.. "అంతా బాగానే ఉన్నా ఆమెకు తన విలువా శక్తీ తెలిసినా..వాటిని అవసరమైతే తప్ప ప్రయోగించదు.*
*అప్పటివరకూ తెలియనట్టే ఉంటుంది..."*
*అవసరమైనప్పుడు..ఆ శక్తి ముందూ.. ఎవరూ నిలబడలేరు..*
*అని చెప్పి భూమ్మీదకు పంపాడు స్త్రీని...!!*
*ఇదంతా చదువుతుంటే.. మన జీవితంలో జరిగిన ఎన్నో ఘటనలు జ్ఞప్తికి వస్తున్నాయి కదా..*
*అందుకనే ఏమో స్త్రీని పుడమి తల్లి తో పోల్చారు...*
No comments:
Post a Comment