Wednesday, March 5, 2025

 ఓ భారతీయుడు, ఓ పాకిస్తానీ , ఓ చైనా దేశీయుడు ముగ్గురూ ఓ నౌకలో ప్రయాణిస్తున్నారు.
సముద్రం మధ్యకి నౌక చేరగానే ఒక సముద్ర రాక్షసుడు వారి ముందు ప్రత్యక్ష మయ్యాడు.మిమల్ని తినేస్తా అని పెద్దగా కేకలు 
పెడుతున్నాడు.

ముగ్గురూ భయంతో వణికి పోతున్నారు.వారు భయపడటం చూసిన రాక్షసుడికి ఒక చిలిపి ఆలోచన వ వచ్చింది.వాళ్ళతో యిలా అన్నాడు,మీ ముగ్గురూ మీకు తోచింది సముద్రం లోకి విసిరి వేయండి.
 
నేను తెచ్చి యిస్తే గెలుపునాదే.వస్తువు తేలేకపోతే గెలుపు మీది వాళ్ళని వదిలేస్తాను.వాళ్లకు నేను జీవితాంతము బానిసగా వుంటాను అన్నాడు.సరే నని 
ముందు పాకిస్తానీ  తన చేతి వజ్రపు ఉంగరం విసిరేశాడు.సముద్రం లో మునిగి కాసేపటికి రాక్షసుడు 
ఆ ఉంగరాన్ని తెచ్చి ఆ వ్యక్తిని మింగేశాడు. చైనా దేశీముడు తన చేతికున్న ఖరీదైన వాచీ ని నీళ్ళలోకి విసిరేశాడు.

రాక్షసుడు సముద్రం లోకి దూకి దాన్నీ తెచ్చేసి అతన్ని మింగేశాడు.యింక భారతీయుడి వంతు వచ్చింది.
 
అతను కొంచెం యోచన చేసి తన దగ్గరవున్న నీళ్ళ సీసా మూత తీసి అందులోని నీళ్ళను సముద్రం లోకి ధారగా పోశాడు.నా మంచి నీళ్ళను నాకు తెచ్చి యివ్వు అన్నాడు.

ఆ దెబ్బకి రాక్షసుడికి దిమ్మ తిరిగి పోయింది.ఇది భారతీయుడి దెబ్బ  ఎలావుంది అన్నాడు రాక్షసుడి తో.రాక్షసుడు తన ఓటమి ఒప్పుకొని 
అతనికి బానిసగా ఉండటానికి ఒప్పుకున్నాడు. వాళ్ళిద్దర్ని బ్రతికించు అని ఆజ్ఞాపించాడు. రాక్షసుడు వాళ్ళని కక్కేశాడు.

మంచి పని చేశావు.యింక ఎవ్వరినీ యిలా బాధించకుండా వుంటానంటే నిన్ను బానిసత్వం నుంచి విముక్తుడిని చేస్తాను అన్నాడు.రాక్షసుడు అలా చెయ్యనని ప్రమాణం చేసి సముద్రం లోకి దూకి మాయమయ్యాడు.🙏ఎంతటి ఆపద వచ్చిన ఆలోచించే వాడు *భారతీయుడు* 🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment