Thursday, April 24, 2025

 *ఔన్నత్యం* 

2

1953లో ఓ రోజు.

ఆ మధ్యాహ్నం నగర అధికారులు చికాగో రైల్వే స్టేషన్కి చేరుకున్నారు.

అక్కడ జరగబోయేది పత్రికల్లో రాయడానికి పత్రికా విలేఖరులు కూడా గుమిగూడి వున్నారు. వాళ్ళంతా ఎదురు చూస్తున్న రైలు కొద్ది నిముషాల్లో వచ్చి ఆగింది. అందులోంచి ఆరడుగుల నాలుగు అంగుళాల ఎత్తు, దళసరి మీసాలు గల ఒకతను కిందకి దిగాడు. కెమేరాలు క్లిక్ మన్నాయి. నగర అధికారులు ఆయన దగ్గరకి వెళ్ళి చేతులు చాపి స్వాగతం చెప్పారు.

"మీరు మా వూరు రావడం మా అదృష్టం." వాళ్ళు చెప్పేది పత్రికా విలేఖరులు రాసుకోసాగారు.

"ఏదైనా నాలుగు మంచి మాటలు చెప్పండి.” కోరారు కొందరు.

ఆ వ్యక్తి మాట్లాడుతున్నా ఆయన దృష్టి వాళ్ళ భుజాల మీదనించి దూరంగా

నిలబడ్డ ఓ ముసలావిడ మీద వుంది. ఆ నల్లజాతి ఆవిడ రెండు పెద్ద బరువైన సూట్కేసులని బయటకి తీసుకువెళ్ళడానికి ఇబ్బంది పడుతోంది.

అతను వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పి, తనని క్షమించమని వేడుకుని గబగబ ఆ ముసలావిడ దగ్గరకి నడిచి ఆవిడ సూట్కేసులని అందుకుని రైల్వే స్టేషన్ బయట వున్న సిటి బస్ దాకా నడిచాడు. ఆవిడని ఓ బస్ ఎక్కించి తిరిగి తనని రిసీవ్ చేసుకోడానికి వచ్చిన వాళ్ళ దగ్గరకి వచ్చి చెప్పాడు.

"సారి! మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు."

తన జీవితంలో అధిక భాగం ఆఫ్రికాలో గడిపి వచ్చిన అతని పేరు డాక్టర్ ఆల్బర్ట్ షెలైడ్జర్. అంతేకాదు. ఆ తర్వాతి సంవత్సరం (1952) నోబుల్ పీస్ ప్రయిజ్న పొందాడు కూడా.

No comments:

Post a Comment