. *37వ సర్గ 2 వ భాగం*
*꧁❀❀━❀🏕️🌏🏕️❀━❀❀꧂*
*సీత సదాచారవంతురాలు. ఆమెకు అడవులకు వెళ్ళాల్సిన పనిలేదు. ఆమె రాముడి అర్జాంగి. ఇక్కడ ఉంటూనే సింహాసనంపై కూర్చుని రాజ్యాన్ని పాలించగలదు. సీత అంటే రామునికి ఆత్మవంటిది. ఒకవేళ సీతకూడా అడవులకు వెళితే, మేమంతా కూడా ఆమెతోపాటే అడవులకు పోతాం. నేనే కాదు ఈ అయోధ్యవాసులంతా కూడా వాళ్ల వెనకే ఉంటారు. ఈ దేశప్రజలంతా కూడా రాముడి వెనకే ఉంటారు. భరత శత్రుఘ్నులు కూడా నారబట్టలు ధరించి రాముడి వెనకనే నడుస్తారు. అడవుల్లో రాముడితోనే ఉంటారు. చివరగా ఇక్కడ మిగిలేదల్లా క్రూరాత్మురాలవైన నువ్వు ఒక్కదానివే! ఓ కైకా! నీకు దుర్చుద్ది పుట్టింది, సదాచారాలన్నీ వదలివేశావు. ప్రజలందరికీ కీడు తలపెట్టావు. ప్రజలంతా రాముడితోపోతే, నువ్వు పాలించేదల్లా పాడుపడిన ఇళ్ళను, ఎండిపోతున్న వృక్షాలను మాత్రమే. రాముడు లేనిది రాజ్యం కాదు. రాముడు ఉండే అడవే రాజ్యం అవుతుంది.*
*కైకా! భరతుడికి తండ్రివంశంలో పుట్టినవాళ్ళ పూర్వీకుల చరిత్రలన్నీ తెలుసు. ఆరు నూరైనా అతడీరాజ్యాన్ని పాలించడు, నీ మాట వినడు. నిన్ను తల్లిగా కూడా గౌరవించడు. నువ్వు పుత్రప్రేమ అనే మైకంలోపడి అపకారమే చేస్తున్నావు. లోకంలో రాముణ్ణి అనుసరించి పోనివాళ్ళెవరూ ఉండరు -ఒక్క నువ్వు తప్ప. కైకా! చివరకు పశుపక్ష్యాదులు కూడా రాముడితోనే పోతాయి. కదలలేని వృక్షాలు కూడా దీనంగా రాముడికేసే ముఖంపెట్టి చూస్తున్నాయి.*
*అందుచేత ఓ కైకా! సీతకు నారచీరలు ఇవ్వకు. ఉత్తమమైన ఆభరణాలనివ్వు. ఆమె నారబట్టలు ధరించాలనే నిబంధన ఎక్కడాలేదు. రాముడికొక్కడికే మహారాజు వనవాసం విధించారు, కాబట్టి సీత చక్కగా అలంకరించుకొని, రామునితో అడవుల్లో నివసించవచ్చు. సీతాదేవికోసం అవసరమైన పరిచారికలు, వాహనాలు, వస్తాలు తీసుకొని వెళ్లనివ్వు. నువ్వు వరాలు కోరినప్పుడు ఈ నిబంధనలేవీ లేవు. రాజగురువు, బ్రాహ్మణగ్రేష్టుడు, గొప్పతపశ్శాలి అయిన వసిష్టుడు ఈ విధంగా వారించినా కూడా, సీతాదేవి తనకు అత్యంత ప్రీతిపాత్రుడూ, దైవసమానుడూ అయిన రాముని వెంట అడవులకు వెళ్ళటానికే సిద్ధపడింది.*
*┈┉┅━❀꧁హరే రామ్꧂❀━┅┉┈*
*SPIRITUAL SEEKERS*
🍁🚩🍁 🙏🕉️🙏 🍁🚩🍁
No comments:
Post a Comment