Tuesday, September 30, 2025

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
నేటి...

           *ఆచార్య సద్బోధన*
               ➖➖➖✍️

```
*దేవుని పాదాలపై పూలు పెట్టేందుకు గుడికి వెళ్ళకు!

*ముందుగా నీ  ఇంటిని, మనసుని  దయ, ప్రేమ, వాత్సల్యాల పరిమళాలతో నింపు..!!

*దేవుని ముందుదీపాలు వెలిగించేందుకు గుడికి వెళ్ళకు!
*ముందుగా పాపం, గర్వం, అహంభావాల చీకటిని  నీ హృదయం నుండి తొలగించుకో..!!

*తల వంచి ప్రార్థించేందుకు గుడికి వెళ్ళకు!
*ముందుగా నీ తోటి వారి ముందు వినయంగా ఉండడం నేర్చుకో..!!

*మోకాళ్ళ మీద కూర్చుని ప్రార్థించేందుకు గుడికి వెళ్ళకు,..!
*నువ్వు అన్యాయము చేసిన వారికి క్షమాపణ చెప్పుకో..!!

*నీవు చేసిన పాపాలకు క్షమించమని అడిగేందుకు గుడికి వెళ్ళకు!
*ముందుగా నిన్ను గాయపరిచిన వారిని హృదయ పూర్వకంగా క్షమించడము నేర్చుకో..!!

అప్పుడు...
మన హృదయమే దేవాలయము అవుతుంది. ఆ దేవుడు నీలోనే కొలువై  నీకు ఏమి, ఎప్పుడు ఇవ్వాలో ఆయన చూసుకుంటాడు.✍️```

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment