. *రాముడి కోసం నగరవాసులు*
*వ్యాకులత చెందటం*
*꧁❀❀━❀🌟🌏🌟❀━❀❀꧂*
*రాముడు రథమెక్కి ముందుకు సాగిపోయాడు. అంతఃపుర స్త్రీలంతా బావురుమని ఏడ్చారు. దిక్కులేని వాళ్ళందరికీ కొండంత అండగా ఉండే రాముడు ఇప్పుడు నగరం విడిచిపోయాడు. ఎవరి మనస్సూ నొప్పించేవాడు కాడు. ఒకవేళ తనను ఎవరైనా నొప్పించినా కోపగించుకొనే వాడు కాదు. కోపం వచ్చినా వాళ్ళనుకూడా చక్కగా సమాధానపరచి శాంతపరచేవాడు. రాముడు ఇతరుల సుఖమే తన సుఖమనుకొంటాడు. ఇతరులకొచ్చే దుఃఖం తన దుఃఖమని బాధపడేవాడు. కన్నతల్లి అనీ, సవతి తల్లి అనీ తేడాలు లేకుండా అందరినీ సమానంగా పూజించేవాడు. దశరథ మహారాజు కైకేయి పోరుపడలేక అడవులకు పంపాడేగాని, రాముడు లేకుండా జీవించగలడా?*
*ప్రాణికోటి నంతటినీ సంతోషపెట్టేవాడు, ధర్మం తప్పనివాడు అయిన రాముడు మహారాజు ఎంత బ్రతిమాలినా తండ్రి అసత్యవాది కాకూడదన్నాడు. తండ్రి మాట నిలబెట్టేందుకే అడవులకు* *వెళ్ళాడు. అటువంటి రాముడు ఎక్కడకుపోతున్నాడో? ఈ రకంగా అంతఃపురస్త్రీలంతా దూడల నుండి బలవంతంగా లాగివేసిన ఆవులమల్లే బిగ్గరగా ఏడ్చారు. అసలే పుత్రవియోగంతో బాధపడుతున్న దశరథునికి, అంతఃపురస్త్రీల ఆక్రందనలతో దుఃఖం రెట్టింపయింది.*
*బ్రాహ్మణుల ఇళ్ళలో అగ్నిహోత్రాలు చెయ్యలేదు. గృహస్థులు వంటలు చేసుకోలేదు. ప్రజలు తమ వృత్తుల్లోకి పోలేదు. సూర్యుడే ముఖం చాటేస్తే ఇక వీరందరిమాటా విడిగా చెప్పాలా? ఏనుగులు నోట్లో ఉన్న ఆహారాన్ని బైటకు తోసేశాయి. ఆవులు తమ దూడలకు పాలివ్వలేదు. తొలికాన్సే అయినా బాలింతలు తమ బిడ్డలను చూసుకొని మురిసిపోలేదు. త్రిశంకువు, కుజుడు, గురుడు, బుధుడు గ్రహాలు తేజస్సును కోల్పోయాయి. దేవేంద్రుడు త్రిలోకాధిపత్యాన్ని కోల్పోతే మండలాలన్నీ గజగజలాడినట్లుగా, రాముడి వనవాసాన్ని తలచుకోగానే, ఏనుగులన్నీ ఘీంకారాలు చేశాయి. ఆ ఘీంకారానికి పర్వతాలన్నీ కదలిపోయాయి. ఒకటేమిటి, అన్నీ ప్రకృతికి విపరీతంగానే నడిచాయి.*
*┈┉┅━❀꧁హరే రామ꧂❀━┅┉┈*
*SPIRITUAL SEEKERS*
🍁🏹🍁 🙏🕉️🙏 🍁🏹🍁
No comments:
Post a Comment