Tuesday, September 30, 2025

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
నేటి...

          *ఆచార్య సద్బోధన*
               ➖➖➖✍️

“నిరంతర సాధన కుదరటంలేదు, గుర్తుకొచ్చినప్పుడే వీలవుతుంది ఎలా !?”```

*బయటి వ్యవహారాలు తగ్గించుకుని, అంతర్గతంగా ధ్యాస నిలుపుకుంటే క్రమంగా కుదురుతుంది. 

*అడవులకు వెళ్ళి తపస్సు చేసుకునేవారు, రోజంతా ధ్యానంలో నిమగ్నమైవుండేవారు, నిరంతరం దైవనామస్మరణతో గడిపే మహాభక్తులు, ఇలా కఠోరసాధన చేసేవారు ఏకొద్దిమందో ఉంటారు. 

*మనంకూడా ధ్యానం, పూజ, తపస్సు, నామస్మరణ, భజనలు, కీర్తనలు ఇలా ఏదొకదాన్ని అనుసరిస్తూనే ఉంటాం. 

*అయితే అది నిరంతరం చేయటం మనకు సాధ్యంకావటంలేదు. కానీ దైవదర్శనానికి నిరంతర సాధన అవసరం. అలాంటి సౌలభ్యం ఒక్క ధర్మాచరణలో మాత్రమే ఉంది. 

*నిద్రనుండి మేల్కొన్నది మొదలు తిరిగి పడుకునే వరకు మనకు జీవన వ్యవహారాలు తప్పవు. ఆ జీవన వ్యవహారాల్లో మనం ఎలా ఉండాలో అలా ధర్మంగా ఉండటం అలవర్చుకుంటే అదే మనకు ‘నిత్యసాధన’ అవుతుంది !✍️```

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment