Thursday, September 25, 2025

 🕉️🌻🕉️🌻🕉️🌻🕉️🌻🕉️

*దేవీ నవరాత్రులు - నవ దుర్గలు -*  
*(4)శ్రీపార్వతిదేవి (కాత్యాయనీ)*
*శ్రీ పార్వతిదేవి అష్టోత్తర శతనామావళిః*

🌻🌻🌻🌻🌻🌻🌻🌻

*శ్రీపార్వతి దేవి (కాత్యాయని)*

శ్రీపార్వతిదేవిహిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ, మాణిక్యాంబ వంటి ఎన్నో పేర్లతో కొలువ బడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పరమేశ్వరుల బిడ్డలు.
పురాణాలలో దక్షుని కుమార్తె అయిన 'సతీదేవి' (దాక్షాయణి) శివునికి ఇల్లాలు. కానిదక్షయజ్ఞంలో తనకు, శివునికి జరిగిన అవమానానికి క్షోభించి ఆమె అగ్నిలో ఆహుతి అయ్యింది. తరువాత ఆమె హిమవంతుడు, మేనకల కుమార్తెగా జన్మించింది. పర్వత రాజ తనయ గనుక 'పార్వతి' అని ఆమె పిలువబడింది. తీవ్రమైన తపసు ఆచరించి (ఉమ, అపర్ణ అనే పేర్లు ఈ తపసు కారణం వలన వచ్చాయి.)శివునివరించింది. శివుడు ఆమెను తన శరీరంలో సగంగా స్వీకరించాడు.
హిమవంతునికి మేరువుకూఁతురైన మనోరమయందు పుట్టిన రెండవ కొమార్తె. ఈమె యొక్క అక్క గంగాదేవి. తొలిజన్మమున ఈమె దక్షుని కూఁతురు అయిన ఉమాదేవి.అపుడు తన తండ్రి అయిన దక్షప్రజాపతి చేసిన యజ్ఞమునకు తన భర్త అగు రుద్రుని పిలువక అవమానించెను అని అలిగి మహాకాళి స్వరూపమును వహించి అత్యాగ్రహమున దేహత్యాగము చేసి ఆవల పార్వతిగ పుట్టి రుద్రునికి భార్య అయ్యెను. ఈమె ఒకకాలమున రుద్రునితో కూడి ఉండఁగా దేవతలు ఆకూటమికి విఘ్నముచేసిరి. అందువలన వారికి స్వభార్యల యందు పుత్రసంతానము లేకుండునటుల ఈమె శపియించెను.మఱియు ఆకాలము నందు రుద్రునికి రేతస్సుజాఱి భూమియందు పడెను. భూమి దానిని ధరింపను ఓపక దేవతలసహాయమున అగ్నిని వాయువును వహించునట్లు చేయఁగా వారు ఆరేతస్సును హిమవత్పర్వత సమీపమున గంగయందు చేర్చిరి. అది కారణముగా గంగ గర్భము తాల్చి ఆగర్భమును భరింపలేక శరవణమునందు విడిచిపుచ్చెను. అందు కుమారస్వామి పుట్టెను. 
అతనికి షట్కృత్తికలు పాలిచ్చిరి కనుక కార్తికేయుఁడు అను పేరును, ఆపాలు ఆఱుముఖములతో ఒక్కతేపనె అతఁడు పానము చేసెను కనుక షణ్ముఖుఁడు అను పేరును అతనికి కలిగెను. స్ఖలితము అయిన రేతస్సువలన పుట్టినందున స్కందుఁడు అనియు అంటారు. ఇది కాక పార్వతి తన దేహమున కూడవలసిన తన భర్తయొక్క రేతస్సును భూమి ధరించినందున భూమికి బహు భర్తలు కలుగునట్లు శాపము ఇచ్చెను. మఱియు గంగా నిర్గతమైన ఈసౌమ్యతేజము వలన సువర్ణము మొదలగు లోహములు కలిగినట్లును, ఆగంగానిక్షేపము వలన పొదలునట్టి సువర్ణ ప్రభల చేత తృణవృక్ష లతాగుల్మ ప్రభృతి ఉద్భిజ్జములు సువర్ణంబులు అయ్యెను అనియు పురాణములు చెప్పుచుఉన్నాయి. వినాయకుడు, కుమారస్వామి వారి పుత్రులు.

🙏 
*శ్రీ పార్వతీ దేవి(కాత్యాయనీ)*  
*అష్టోత్తర శతనామావళి*

ఓం పార్వత్యై నమః
ఓం మహా దేవ్యై నమః
ఓం జగన్మాత్రే నమః
ఓం సరస్వత్యై నమః
ఓం చండికాయై నమః
ఓం లోకజనన్యై నమః
ఓం సర్వదేవాదీ దేవతాయై నమః
ఓం గౌర్యై నమః
ఓం పరమాయై నమః
ఓం ఈశాయై నమః 10
ఓం నాగేంద్రతనయాయై నమః
ఓం సత్యై నమః
ఓం బ్రహ్మచారిణ్యై నమః
ఓం శర్వాణ్యై నమః
ఓం దేవమాత్రే నమః
ఓం త్రిలోచన్యై నమః
ఓం బ్రహ్మణ్యై నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం రౌద్ర్యై నమః
ఓం కాళరాత్ర్యై నమః 20
ఓం తపస్విన్యై నమః
ఓం శివదూత్యై నమః
ఓం విశాలాక్ష్యై నమః
ఓం చాముండాయై నమః
ఓం విష్ణుసోదరయ్యై నమః
ఓం చిత్కళాయై నమః
ఓం చిన్మయాకారాయై నమః
ఓం మహిషాసురమర్దిన్యై నమః
ఓం కాత్యాయిన్యై నమః
ఓం కాలరూపాయై నమః 30
ఓం గిరిజాయై నమః
ఓం మేనకాత్మజాయై నమః
ఓం భవాన్యై నమః
ఓం మాతృకాయై నమః
ఓం శ్రీమాత్రేనమః
ఓం మహాగౌర్యై నమః
ఓం రామాయై నమః
ఓం శుచిస్మితాయై నమః
ఓం బ్రహ్మస్వరూపిణ్యై నమః
ఓం రాజ్యలక్ష్మ్యై నమః 40
ఓం శివప్రియాయై నమః
ఓం నారాయణ్యై నమః
ఓం మాహాశక్త్యై నమః
ఓం నవోఢాయై నమః
ఓం భగ్యదాయిన్యై నమః
ఓం అన్నపూర్ణాయై నమః
ఓం సదానందాయై నమః
ఓం యౌవనాయై నమః
ఓం మోహిన్యై నమః
ఓం అజ్ఞానశుధ్యై నమః 50
ఓం జ్ఞానగమ్యాయై నమః
ఓం నిత్యాయై నమః
ఓం నిత్యస్వరూపిణ్యై నమః
ఓం పుష్పాకారాయై నమః
ఓం పురుషార్ధప్రదాయిన్యై నమః
ఓం మహారూపాయై నమః
ఓం మహారౌద్ర్యై నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం వామదేవ్యై నమః
ఓం వరదాయై నమః 60
ఓం భయనాశిన్యై నమః
ఓం వాగ్దేవ్యై నమః
ఓం వచన్యై నమః
ఓం వారాహ్యై నమః
ఓం విశ్వతోషిన్యై నమః
ఓం వర్ధనీయాయై నమః
ఓం విశాలాక్షాయై నమః
ఓం కులసంపత్ప్రదాయిన్యై నమః
ఓం ఆర్ధదుఃఖచ్చేద దక్షాయై నమః
ఓం అంబాయై నమః 70
ఓం నిఖిలయోగిన్యై నమః
ఓం కమలాయై నమః
ఓం కమలాకారయై నమః
ఓం రక్తవర్ణాయై నమః
ఓం కళానిధయై నమః
ఓం మధుప్రియాయై నమః
ఓం కళ్యాణ్యై నమః
ఓం కరుణాయై నమః
ఓం జనస్ధానాయై నమః
ఓం వీరపత్న్యై నమః 80
ఓం విరూపాక్ష్యై నమః
ఓం వీరాధితాయై నమః
ఓం హేమాభాసాయై నమః
ఓం సృష్టిరూపాయై నమః

ఓం సృష్టిసంహారకారిణ్యై నమః
ఓం రంజనాయై నమః
ఓం యౌవనాకారాయై నమః
ఓం పరమేశప్రియాయై నమః
ఓం పరాయై నమః
ఓం పుష్పిణ్యై నమః 90
ఓం సదాపురస్థాయిన్యై నమః
ఓం తరోర్మూలతలంగతాయై నమః
ఓం హరవాహసమాయుక్తయై నమః
ఓం మోక్షపరాయణాయై నమః
ఓం ధరాధరభవాయై నమః
ఓం ముక్తాయై నమః
ఓం వరమంత్రాయై నమః
ఓం కరప్రదాయై నమః
ఓం వాగ్భవ్యై నమః
ఓం దేవ్యై నమః 100
ఓం క్లీం కారిణ్యై నమః
ఓం సంవిదే నమః
ఓం ఈశ్వర్యై నమః
ఓం హ్రీంకారబీజాయై నమః
ఓం శాంభవ్యై నమః
ఓం ప్రణవాత్మికాయై నమః
ఓం శ్రీ మహాగౌర్యై నమః
ఓం శుభప్రదాయై నమః 108.

🕉️🌻🕉️🌻🕉️🌻🕉️🌻🕉️

No comments:

Post a Comment