*_మనిషికి అసూయ ఎక్కువైతే ఆనందం దూరమవుతుంది... అహంకారం ఎక్కువైతే అయినవారు దూరమవుతారు..._*
*_అందుకే మనిషి ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి అంటారు పెద్దలు... అలాగే మంచి సమయం చెప్పి రాదు. చెడ్డ సమయం చెప్పి పోదు. ఉన్న సమయం అలాగే ఉండి పోదు. దేని గురించీ అతిగా ఆలోచించకుండా కాలం తోపాటు మనము ముందుకు సాగిపోవడమే... అదే జీవితమంటే.._*
*_ఎందుకంటే ఇక్కడ ఎవ్వడూ శాశ్వతంగా ఉండిపోవడానికి రాలె. ఉన్నన్ని రోజులు అందరు బాగుండాలని నువ్వు చేసే మంచే నీ కుటుంబాన్ని నిన్ను అన్నివేళలా కాపాడేది..._*
*_కాబట్టి ఎప్పుడూ నలుగురిని సంతోషపరిచే పనులే చేయి... ఆ నలుగురి గుండెల్లో చిరస్థాయిలో ఉండిపోతావ్._*
*_యుద్ధం ఎప్పుడూ బయటవాళ్ళతో జరగదు... మనతో... మనలోనే జరుగుతుంది... ఈ అంతర్గత యుద్ధంలో గెలిచినప్పుడే, మనం నిజమైన బలాన్ని పొందుతాం. అది భవిష్యత్తులో వచ్చే ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కొనే శక్తిని,_* *_ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని గుర్తుంచుకోండి..._*
*_చీకటి ఎంత దట్టంగా ఉన్నా, సూర్యోదయం తప్పక వస్తుంది. ఆ సూర్యోదయం కోసం వేచి ఉండటానికి, ఆ చీకటిని అధిగమించడానికి కావలసిన శక్తి మన లోపలే ఉంటుందని గుర్తించి పోరాడితే విజయం మనదే.☝️_*
*_-సదా మీ శ్రేయోభిలాషి...✍️_*
🌸🙏🌸 ♻️🙇♂️♻️ 🌸🙏🌸
నలుగురిని సంతోషపరిచే పనులు,
*మనసుకు ఆనందం,*
*స్నేహానికి పునాది.*
సంతోషంగా ఉండాలంటే, మనం మనలోని అసూయను తగ్గించుకోవాలి,
ఇతరుల విజయాలను ఆనందంగా స్వీకరించాలి.
అహంకారాన్ని వదిలి, humilityతో జీవించాలి...!
*చీకటి కమ్ముకున్న క్షణాల్లో...*
సూర్యోదయం ఆశలు పంచుతుంది.
ప్రతి కష్టానికి ఒక ముగింపు,
*ప్రతి నిద్రకు ఒక కొత్త ఉదయం...* ఉంటుంది
*చాలా చక్కని పోస్ట్ ధన్యవాదాలు*💐🙏
No comments:
Post a Comment