🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*శ్రీమాతరం భావయే*
➖➖➖✍️
*అమ్మ తొలి పేరే శ్రీమాతా.*
```
మాతా అంటే అమ్మ.
అమ్మకి ఎన్ని పేర్లున్నా ‘అమ్మ’ అనే పేరే అత్యంత దివ్యమైంది.
అమ్మ శ్రీమాత. శ్రీ అనేది అనేక అర్థాలతో కూడుకుంది.
శ్రేయం, పూజ్యం ఈ రెండు శ్రీ శబ్దానికి అర్ధాలు.
శ్రేష్ఠమైన మాత.
అత్యంత ఉత్కృష్టురాలైన తల్లి.
సమస్త జగత్తుచేత, దేవతల చేత, మునుల చేత కూడా పూజింపబడే తల్లి కనుక శ్రీమాత.
అమ్మ అనేది కారణాన్ని తెలియజేస్తుంది.
మాతా అంటే కారణము అని అర్ధం.
ఈ సమస్త జగత్తుకి జీవకోటికి కూడా కారణమైన పరాశక్తి శ్రీమాత.
కావ్యం శ్రీతో ప్రారంభించాలంటారు.
అలాగే లలితాసహస్రనామస్తోత్రం
అనే దివ్యశాస్త్రం శ్రీకారంతో ప్రారంభం అవుతోంది.
అమ్మ నిజమైన పేరు శ్రీ అని చెప్పబడుతోంది. ఇది మహాబీజాక్షరం.
వేదంలో శ్రీసూక్తం అని ప్రత్యేకించి చెప్పారు.
శ్రీ అనేది అమ్మవారి సహజసిద్ధమైన పేరు.
ఆ తల్లికి సంబంధించిన సూక్తం
శ్రీ సూక్తం.
అమ్మకి సంబంధించిన విద్య శ్రీవిద్య.
అమ్మ ఉన్న ఆసనం శ్రీ చక్రం.
ఇన్ని శ్రీలతో శోభిస్తున్న మాత కనుక శ్రీమాత.
త్రిగుణాత్మకమైన సత్వరజోస్తమోగుణాత్మకమైన ప్రకృతికి సంకేతం!
శ్రీ. శ్రీచక్రంలో త్రికోణాలు చెప్పబడ్డాయి. ఈ త్రికోణాలన్ని శక్తిస్వరూపాలు.
బిందువు అమ్మవారి శివశక్త్యాత్మకమైన పరబ్రహ్మస్వరూపం.
బిందువు వికసనమే త్రికోణం. మొదట బిందువు, తరువాత త్రికోణం ఏర్పడుతుంది. ఈ త్రికోణం సంకేతం శ్రీ.
శ్రీ అంటే త్రికోణాత్మకంగా వికసించిన బిందుస్వరూపం.
త్రికోణానికి కారణమైన బిందువు ఏదయితే ఉందో అది మాతా అని చెప్పబడుతోంది.
త్రికోణాత్మకంగా శ్రీచక్రంగా వికసించిన బిందుస్వరూపమే శ్రీమాత.
పైగా ఓంకారంలో ఉన్న తేజస్సు అంతా శ్రీకారంలో ప్రకాశిస్తూ ఉంది.
అమ్మా! అని పిలవడం కన్నా మరో గొప్ప మంత్రం లేదు.
తల్లిని తలంచుకొనడం జీవుడి ప్రతీ అవస్థలో కనపడుతుంది. పసితనంలో పలికే అమ్మా! అని పిలుపు విడిచిపెడితే పెద్దవాడు అయ్యాక కూడా వాడి కళ్ళకి అమ్మ కనపడకపోయినా ఏదైనా దెబ్బ తగిలితే అమ్మా! అనే అంటాడు.
ఎందువల్ల అనే దాన్ని పరిశీలిస్తే
ఈ జీవుడికి ఆ అమ్మతో ఉన్న సంబంధమది.✍️
--పూజ్యగురువులు
బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు.
జగజ్జనని ఆశీస్సులతో...
*సర్వే జనాః సుఖీనో భవంతు*
🙏 *శ్రీ మాత్రే నమః*
🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
No comments:
Post a Comment