Wednesday, September 24, 2025

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
నేటి...

            *ఆచార్య సద్బోధన*
               ➖➖➖✍️
```
“నడువు!  ముందుకు నడువు!!     నీ పక్క నేను ఉన్నాను.

నేనుండగా నీవు వెనుకకు తిరిగి చూడకు. ఇది నీవు చేయవలసిన పనికాదు.

సంసారపు చింతలు, వ్యాధులు, వ్యథలు ఇవన్ని ఏమి చేస్తాయో అని నీవు భయపడనవసరం లేదు. గందరగోళంనకు గురికావద్దు.

కొండ అంతటివాడిని నేను నీ పక్కనుండగా చిన్న చిన్న ఇసుక రేణువుల వంటి సమస్యలకు ఆందోళన చెందడం దేనికి? 

నీ జీవనోపాధి కొరకు, కుటుంబ పోషణకు అడ్డు దార్లు తొక్కవద్దు!      వాటి సంగతి నాకు వదిలెయ్యి. నాపై విశ్వాసముంచు. నేను చెప్పిన విధముగా నడచుకోవడానికి ప్రయత్నం చెయ్యి. నిన్ను పాప విముక్తుడిని చేసి, నీకు సంపూర్ణ మనశ్శాంతిని కలిగేలా చేసే బాధ్యత నాపై వేసుకుంటున్నాను!

నీవు చేయవలసినదల్లా నాపై విశ్వాసముంచి, నేను చూపిన మార్గంలో నడచుకోవడమే!”✍️```

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment