Wednesday, September 24, 2025

James Van Praagh Spirit Talk

James Van Praagh Spirit Talk

https://youtu.be/_9SKW7QL304?si=52Ks5Dn7g6HbMJHm


పరలోకవాసులు జ్యోతిష్య శాస్త్రం సైంటిఫిక్ అవునా కాదా విశ్వసించదగిందేనా అనే చర్చ సాగుతూనే ఉంది. ఇప్పుడు ఇక్కడ ప్రస్తావించదలుచుకున్న విషయం కూడా ఒక విధంగా వివాదాస్పదమైనదే అనవచ్చు. అయినప్పటికీ మన లోకానికి మరో లోకానికి మధ్య వారిదిగా వ్యవహరిస్తూ ఈ భూలోకం నుండి తరలి వెళ్ళిపోయిన సమీప సంబంధీకులు ఎలా ఉంటున్నారో ఏమనుకుంటున్నారో తెలియజేసే నేర్పు సామర్థ్యం ఉన్న వారిని గురించి చెప్పదలుచుకున్నాను. వీరిలోనే ఈ శక్తి వరప్రసాదం అనే అనవచ్చు అయితే ఈ రకమైన శక్తి క్షీణించకుండా నిలబెట్టుకోవడానికి వారు తమ జీవితాలను ప్రేమతో ఆదరంతో సకల జనుల క్షేమానుకూలంగా మలుచుకోవడం కర్తవ్యం అవుతుంది. ఈ గుణాలు లోపిస్తేనే వ్యాపార దృష్టి స్వార్థము ప్రబలితేను తాను పతనం అవ్వడమే కాక అసలై విద్యకే చెడ్డ పేరు తెస్తారు. ఈ ప్రక్రియ వల్ల వీరు సాధించేది ఏమంటే భూలోకం నుండి తర్లిపోయిన వారి యోగక్షేమాల గురించి ఇక్కడి సంబంధీకులు అధికంగా చింతిస్తూ ఉంటేను ఫలానా వారి ఇక్కడ బతికున్న రోజుల్లో వారి యెడల సరిగా ప్రవర్తించామో లేదో అనే అపరాధ భావంతో బాధపడుతూ ఉంటేను తాము అందించే సమాచారంతో ఆ నేరభావాన్ని వదిలించుకునే స్వేచ్ఛను కల్పిస్తారు. లేదా తమ ప్రవర్తనలో ఇతరులకు ఏదైనా కష్టం కలిగించే స్వభావం ఉంటే ఇప్పటికైనా మించిపోయింది లేదు కాబట్టి ఆ గుణాన్ని మార్చుకొని తోటి జీవులను బాధ పెట్టకుండా ప్రవర్తించడం నేర్చుకొని తాము వారు సుఖంగా ఉండటానికి అవకాశం కలిగిస్తారు. ఇలా ఇరు లోకాలకి మధ్య వంతనిగా వ్యవహరించే వారిని ఆంగ్లంలో మీడియంలు అంటారు. అలాంటి వారిలో ఒక ప్రముఖ వ్యక్తి అమెరికాలో నివసిస్తున్న జేమ్స్ వాన్ ఫ్రాగ్ ఇతడు రాసిన పుస్తకంలో స్వర్గంతో సంభాషణ నుండి ఈ వృత్తాంతం ఇక్కడ ఉదహరిస్తున్నాను. తమ కుమారుని కోల్పోయిన ఓ దంపతుల గాధ ఇది అతడి యవ్వన దశలోనే జరిగిన ఆహటాన్ మరణం వారిని హతాశులను చేసింది. అలాంటిది ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో తెలియక వారు అంతులేని క్షోభకు గురయ్యారు. ఆ సంఘటన గురించి సవివరంగా నా ద్వారా తన తల్లిదండ్రులకు సమాచారం అందించగలిగినందుకు మరణించిన ఆ యువకుని ఆత్మ నాకు తన కృతజ్ఞతను తెలియజేసింది. ఎలా అలా తెలియజేసిన వివరాల ధర్మమా అని అతడి జననీ జనకులకు మనశశాంతి కలగడమే కాక వారికి అలాంటి తృప్తి లభించిన కారణంగా ఆ యువకుడి ఆత్మ శాంతించిందని నాకు అర్థమయింది. ఎందరో కొందరు మిత్రులు నా సంగతి ఆ దంపతులకు చెప్పినందువల్ల భర్త ఏలన్ భార్య షాండ్ర నన్ను ఒక రోజున వచ్చి కలుసుకున్నారు. నేను ఇక్కడో సంగతి చెప్పుకోవాలి. ఈ స్పిరిచువలిజం అంటే పరలోకంలోని ప్రేతాత్మలతో సంభాషించే ప్రక్రియ అనే వింత వ్యవహారం మీద ఆ దంపతులకు అంత విశ్వాసం లేదనేది మొదటి సంగతి రెండవది ఎవరో ఏదో సిఫారసు చేయగానే తామ ఇట్లా పడి నా వద్దకు రావడం సబబేనా అన్నట్లు కనిపించారు ఇద్దరును ఈ మరణించిన వారి ఆత్మలతో ఎలా సంభాషిస్తుంటాను అనేది వారికి ముందర వివరించి ఇటువంటి సంభాషణ ద్వారా తమకు ఏమి లభించగలదు ఏమి లభించదు అనే విషయం తెలియజేశాను. అంటే ఆత్మలు చెప్పే విషయాలు సజీవులైన వారి బంధువులు మనసులకు కొంత ఊరట ధైర్యం కష్ట సహిష్ణుత మొదలైనవి ఇవ్వడానికి ఏ రంగంలో గాని ప్రమాదానికి లోను కాకుండా భూలోక యాత్ర సలపడానికి ఉపకరించేవే గానీ మనుషుల దురాశ వ్యామోహం ఆకాంక్షలు మొదలైన వాటికి దోహద పడే సమాచారం ఇవ్వజూడదు. అలాగే మన ప్రస్తుత మనస్తత్వం ద్వారా మనం ఈ భూమిపైన చేసే తప్పులని మనమే కనుగొని ఆ మనస్తత్వం నుండి విడిబడాల్సిందే మనం నేర్వదగిన గుణపాఠాలన్నీ మనమే స్వయంగా నేరవాలి దైవ విముఖత్వాన్ని విడనాడి దైవాన్ని స్వేచ్ఛగా వరించవలసింది మనమే ఈ నిర్ణయం మనంతట మనమే చేసుకోవాల్సిందే కానీ ఆ లోకంలోని వారు ఇలాంటి విషయాల్లో కలుగజేసుకోరు సామాన్యంగా మనం కష్టాలు అనుకునేవి మన జ్ఞానోదయం కొరకే కాబట్టి వాటన్నింటిని నివారించడానికి వారు పూనుకోరు సలహాలు ఇవ్వరు అందుచేత నేను అందించే సమాచారాన్ని మీద అనవసరమైన ఆశలేవి పెట్టుకోవద్దని సమాచారం అనుకూలంగా ఉన్నా అననుకూలంగా ఉన్నా అన్నింటికీ సిద్ధంగా ఉండమని ముందే హెచ్చరించాను దంపతులు ఇద్దరూ అర్థం చేసుకున్నట్లే కనిపించింది. వారి కుటుంబం నుండి నా మనోవిధిలో సంచరించిన మొదటి వ్యక్తి చాండ్ర యొక్క తల్లి ఆవిడ మాటలు నా మెదటలో ప్రతిధ్వనించసాగాయి. అప్పుడు ప్రకాశవంతంగా నేను అన్ని మాటలు విని చాండ్ర ఇప్పుడు మనతో నీ తల్లి మాట్లాడుతున్నది ఆమె మొదటి నుంచి నీకు చాలా ఆత్మీయంగా ఉండేది నీవు వంటగదిలో వాడే కిచెన్ కత్తితో జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తుంది. ఓ మై గాడ్ ఇవాళ పొద్దున్నే దాన్ని పదును పెట్టడానికి ప్రయత్నించాను. ఒక క్షణాన నా వేలు కోసుకునేదాన్నే అంటే ఆమె నన్ను గమనిస్తూ ఉండిందా మరి అంతే అయి ఉండాలి నీ వంటగదిలో నేను లేను కదా అన్నాను. షాండ్ర మొహం మీద చిరుదరహాసం షాండ్రా తల్లి నా మెదడులోనికి తన ఆలోచనను పంపిస్తూనే ఉన్నది. నువ్వు ఈ మధ్య మీ లోగిల్లో వేయడానికి కొన్న ఫర్నిచర్ మీ అమ్మక ఎంతో నచ్చిందని తెలియజేస్తుంది. నిజమే కొద్ది రోజుల క్రితమే మేము సియర్స్ కంపెనీ కుర్చీలు కొన్నాం. మాతో ఉండే రోజుల్లో ఆమె ఎక్కువసేపు గాలి వెలుతురు బాగా ఉండే ఆ లోగిల్లోనే కూర్చుండేది అన్నది షాండ్ర మీ అమ్మకు మంచి హాస్య ధోరణి ఉన్నట్లు ఉన్నది. మరణానికై ఎదురు చూస్తూ ఆ లోగిల్లో ఎక్కువసేపు గడిపేదాన్ని అంటున్నది. ఈలోగా మరేదో ఆత్మ రంగ ప్రవేశం చేసి తాను ప్రసంగించ నిశ్చయించినట్లుగా కనిపించింది. ఆ వింటున్నాను అని ఆత్మతో చెప్పాను చాండ్ర మీ అమ్మతో పాటు మరెవరో ఉన్నారు యవ్వన దశలో అకస్మాత్తుగా ఈ లోకానికి తరలు వెళ్ళిపోయిన వ్యక్తి అతన్న గురించి నువ్వు తలుచుకుంటున్నావని అతడు ఈ సమయంలో రావాలని నువ్వు బలంగా కోరుకుంటున్నావని మీ అమ్మ అంటున్నది. దంపతుల కళ్ళల్లో నీళ్లు నిండాయి. స్టీవెన్ అనే పేరు నేను ఉచ్చరిస్తే మీకు ఏదైనా స్పందన కలుగుతున్నదా అన్నాను. దంపతులు ఇద్దరు మొహాల మీద నెత్తురు చుక్క లేకుండా పోయింది. ఇద్దరు విలపించన ఆరంభించారు. వృద్ధ కంఠాలతో స్టీవెన్ తమ కొడుకని చెప్పుకున్నారు. అసలు నన్ను చూడటానికి వచ్చిన కారణమే అతడు ఆ లోకంలో ఎలా ఉన్నాడు అనేది తెలుసుకోవడానికే అన్నారు. నేను వారితో స్టీవెన్ చాలా ఆందోళనలో ఉన్నాడు. అతడికి ఏమాత్రం శాంతి లేదు. మీ ఇద్దరికీ తన సమాచారం ఏదో విధంగా అందజేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. అతడు అక్కడ ఉండడం మొదలై రెండేళ్ళ అయి ఉంటుందా లేదు 10 నెలలు అయి ఉండొచ్చు సుమారు ఒక సంవత్సరం కన్నా కాస్త తక్కువే అన్నారు వారు అతడు చెప్పడం తన మరణం మీకు పిడుగుపాటుగా పరిణమించిందని దాంతో మీ మనసులు పాడైపోయి పోయినాయి అంటున్నాడు. తన మరణం అలా సంభవించినందుకు చాలా విచారిస్తున్నాడు. జీవితం ఉన్న కాలంలో జరిగిన ఓ పొరపాటును తాను సరిదిద్దడానికి ప్రయత్నించాడట. అతడు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు మీకు ఏమైనా అర్థం అవుతున్నదా అని వారిని అడిగాను. తండ్రి ఏలన్ సమాధానం ఇస్తూ మాకు అర్థంవుతూనే ఉంది లేండి ఇంకా ఏమంటున్నాడు అబ్బా అతన్ని ఓర్చుకోవడం కష్టమైపోతుంది. అతన్ని చూస్తూ ఉన్న కొద్ది నా శరీరం దగ్దమ అవుతున్నట్లు ఉన్నది నా తలభాగం తునాతునకలైపోతున్నట్లు తోస్తున్నది. నేను ఇలా మాట్లాడుతున్నందుకు మీరేమ అనుకోవద్దు కానీ నేను ఏం చేయగలను అతడి ప్రభావం నా మీద అలా ఉన్నది మరి అతడి మరణం తుపాకీ తోట వల్ల సంభవించిందా అని అడిగాను. అలా అడిగినప్పుడు అవును అన్నాడు తండ్రి ఏలెన్ మీరు తనని బెడ్రూమ్లో పడి ఉండగా చూశారు అంటున్నాడు. నిజమే దంపతులుఇద్దరు కళ్ళనీళ్లు తుడుచుకోసాగారు. ఈ మాట అంటున్నందుకు మీరేమ అనుకోవద్దు కానీ మీ అబ్బాయి మాదక ద్రవ్యాలు సేవిస్తూ ఉండేవాడని తోస్తుంది. కనీసం వాటిని ప్రయోగాత్మకంగానైనా తనపై వాడుకున్నాడు అనిపిస్తుంది. అవును ఆ విషయం మేము కనుగొన్నాం అన్నది శాండ్ర నిజానికి మీ కుమారుడు బలమైనవాడు ఏదో అరుస్తున్నాడు రోని అనే కేక వినిపిస్తున్నది ఈ రోణ ఎవరై ఉంటాడు రోణ మా అబ్బాయి మిత్రుడు అటు పిమ్మట నాకు అంది నీ ప్రసారం చేసిన సమాచారం గదిలో కూర్చున్న మనుషుల భావన ప్రపంచాన్ని కుదిపేసింది. దాని ప్రభావం ఆ దంపతుల మీదే కాకుండా నా మీద కూడా ప్రస్పుటంగా కనిపించింది. స్టీవెన్ గడియారంట తన బంగారపు చేతి గడియారం గురించి మాట్లాడుతున్నాడు అన్నాను. ఏలన్ ప్రతిస్పందిస్తూ మా కుమారుడి మరణానంతరం మాకు ఆ గడియారం కనిపించలేదు అన్ని చోట్ల వెతికాను. మీ కుమారుడు దాన్ని రోీకి తాను చెల్లించాల్సిన డబ్బుకు బదులుగా ఇచ్చాడట. రోకి బాగా కోపం వచ్చింది. మీ కుమారుడు మరణించే ముందు అక్కడ ఏదైనా ఘర్షణ జరిగినట్లు మీకు తెలుసా? తెలీదు. నన్ను నీ చంపుకోలేదు అని పెద్దగా కేకలు పెడుతూ చెప్తున్నాడు స్టీవెన్ అది చేసింది రోని నన్ను నేను కాల్చి చంపుకోలేదు అని అరుస్తున్నాడు. మేము కూర్చున్న గదిలో దట్టమైన నిశశబ్దం నెలకొంది. ఆ సమయాన్న నాకు అందిన సమాచారం నే ప్రకటించిన విషయం మేము ఎవ్వరము నమ్మలేకపోయాం. ఒక ఆత్మ తనని హత్య చేసిన వాని పేరు ప్రకటించడం సాధారణంగా జరిగే విషయం కాదు కానీ ఈ సందర్భంలో స్టీవెన్ తనకు న్యాయం జరగాలనే తీవ్రమైన పట్టుదల ప్రదర్శిస్తున్నాడు. కుర్చిలో వెనక్కు వాలి కూర్చున్నాడు ఆ భావోద్వేగం అంతా కొద్దిగా సద్దుకున్న తర్వాత సమాచారాన్ని మళ్ళీ అందుకోవడం మొదలు పెట్టాను. స్టీవెన్ ఆత్మహత్యను గురించి ఏదో మాట్లాడుతున్నాడు. తాను ఆత్మహత్య చేసుకున్నాడని మీరు అనుకున్నారా అని అడిగాను. తాము అలాగే అనుకున్నామని వాళ్ళు అంగీకరించారు. తన మరణం ఆత్మహత్య కారణంగా జరగలేదని స్టీవెన్ మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాడు. తాను అలాంటి కృత్యానికి పూనుకునే మనిషిని కాదంటున్నాడు. అతడి మరణ విషయాన్ని పోనీషులు ధృవీకరించారా అని అడుగుతూ ఉన్నాడు. లేదు స్టీవెన్ మాదక ద్రవ్యాలు సేవిస్తుండడం మాకు తెలుసు కాబట్టి బహుశా ఆత్మహత్య చేసుకున్నాడేమో అని అనుకున్నాం. స్టీవెన్ మరణానంతరం హాస్పిటల్ అధికారులు అతడి శరీరంలో మాదక ద్రవ్య పదార్థాలు ఉన్నట్లు కనుగొన్నారు అన్నది శాండ్ర. మీ కుమారుడు అతడి మిత్రుడు రోణీ ఇద్దరు ఏదో ఘర్షణ పడ్డట్లు నాకు తెలియవస్తూ ఉంది. రోణీకి ఆ సమయాన కొంత డబ్బు మత్తు పదార్థాలు అవసరమయ్యాయి. అది అలా ఉంచి మీ వద్ద సొంత పిస్టల్ గాని ఒక చిన్న తుపాకీ లాంటిది గాని ఏదైనా ఉందా ఏలెన్ అని అడిగాను. ఉంది స్టీవెన్ వాడింది ఆపిస్టలే దాన్ని స్టీవెన్ ఒక డ్రెస్సర్ డ్రెస్సర్ డ్రాయర్ అట్టడుగు సొరుగు నుండి తీసుకున్నాను అంటున్నాడు రైటేనా జీసస్ ఈ విషయం కూడా మీకు ఎలా తెలిసిందండి మీరు అనే మాట రైటే ఈ రోని అనేవాడి పేరు అంతకు మునుపే పోలీసుల రికార్డుల్లో నమోదై ఉన్నదని మీకు ఎరుకేనా లేదు మాకు ఆ సంగతి తెలియదు అన్నది శాండ్ర డబ్బుకై వారిద్దరి మధ్య ఏదో పెనుగులాట సంభవించిన దృశ్యాన్ని మీ కుమారుడు నా కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నాడు స్టీవెన్ రోనీకి ఏదో బాకీ చెల్లించాల్సి ఉన్నదిట. ఈ రోనీకేమో మరీ గతి లేక ఈ బాకీ డబ్బు కోసం తిరుగుతున్నాడు. ఏదో మాదక ద్రవ్యం ఎక్కువగా సేవించి అధికమైన మత్తులో ఉన్నాడు. నేను మాట్లాడుతున్నది రోనీని గురించి ఇక ఇది వినండి మీ కుమారుడు నాకు ఎంతసేపు ఏదో వాహనాలు పెట్టుకునే గరాజ్ చూపిస్తుంటాడు. అది ఇటుకలతో కట్టినటువంటిది. తెల్లని తలుపు ఉన్నది దానికి మూడు చిన్న కిటికీలు ఉన్నాయి. ఆ తులపు తెరచి గరాజులో ఎడం వైపు గోడ వద్దకు వెళ్ళాడు అన్నాను మాకు గరాజు అంటూ ఏమి లేదు మరి దాని అర్థం ఏమై ఉంటుందో నాకు తెలియడం లేదు కానీ గుర్తుంచుకోండి మరిచిపోవద్దు మనం మరి కాస్త చూచి ఆలకించిన తర్వాత అదిఏమిటో మనకు అర్థంఅవ్వచ్చు ఇదంతా మీకు నేను వివరంగా చెప్తున్నానని మీ అబ్బాయి చాలా సంతోషిస్తున్నాడు. ఏదో ఒక రోజున మీకు ఇదంతా అర్థమై తీరుతుంది అంటున్నాడు. రోనీని పట్టండి అంటున్నాడు. ఈలోగా మీ అమ్మ రంగంలోకి అదాటును ప్రవేశించి మీరు స్టీవెన్ కు బాగా సహాయపడ్డారు అంటున్నది. స్టీవెన్ ఇప్పుడు హాయిగా ఉన్నాడని చెబుతున్నది. థాంక్యూ బంగాళ దంపలు చెక్కు తీసే దృశ్యం ఏదో చూపిస్తున్నది మీ అమ్మ. చాండ్ర జవాబుఇస్తూ నిన్న నేను బంగాళ దుంపల సూపు పెట్టాను మా అమ్మ తాను బతికున్నప్పుడు ఈ సూప్ తయారీకి ఒక పద్ధతిని అవలంబించేది. ఈ విధానాన్నే నేను అవలంబించాను. ఆ సమయాన ఆవిడ గుర్తుకు వచ్చింది. ఆ సూప్ బాగా రుచిగా తయారైిందని అంటున్నది ఆమె ఆ మాట విని దంపతులుఇద్దరు లోన నవ్వుకున్నారు. మా సమావేశం మరి కాసేపు కొనసాగింది. స్టీవెన్ తన కనం గురించి కాసేపు మాట్లాడాడు. శవన్ తలతట్టు నాటేరా ఈ విషయంలో తన తల్లి షాండ్ర అంత ఎక్కువ అవస్థపడి ఉండనక్కర్లేదు అన్నాడు. సమావేశానంతరం పరస్పరం సెలవు పుచ్చుకున్నాం. దంపతులకు తమ కుమారుని మానసికంగా స్పర్శించామనే నమ్మకం కుదిరింది మా సంభాషణ రికార్డు చేసిన టేపును మరోసారి విని నమ్మశక్యం కానీ ఈ ఆశ్చర్యకరమైన విషయాలను ఇందులో ఇప్పటికే అర్థం కాని వాటిని తర్వాత అర్థమవుతాయేమో చూస్తామని అవి తీసుకొని బయలుదేరి వెళ్ళారు. కొన్ని నెలలనంతరం షాండ్రా నుండి నాకు ఒక టెలిఫోన్ కాని వచ్చింది. నేను చేసిన సహాయానికి తామఎంతో కృతజ్ఞులమని తెలిపింది. ఈ మధ్యకాలంలో అనేక ఘటనల గురించి వివరించి చెప్పింది. దంపతులుఇద్దరూ పోలీసు వారిని కలిశారట. తమ కుమారుడి మరణం కేసును పరిశీలించిన పోలీస్ ఆఫీసర్ తో ప్రత్యేకంగా చర్చించారు. ఆ ఆఫీసర్ తమ కుమారుడి మిత్రుడైన రోణ విషయంఅంతా కనుక్కొని ఆరంభించాడు. ఆయన రోని ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఇటుకలతో కట్టిన వాహనాల గరాజ్ మూడు కిటికీలతో కనిపించింది. ఎడంవైపు గొడలో చూపరులకు కనిపించకుండా రహస్యంగా మర్చిన ఓ కంతలో కిలో హిరాయిన్ అనే మత్తుమందు తదితర మాదక ద్రవ్యాలు స్టీవెన్ బంగారు చేతి గడియారం కనిపించాయి. ఆ ఆఫీసర్ రోనీని అరెస్ట్ చేశాడు. పోలీసు వారు ప్రశ్నించినప్పుడు రోనీ చిట్టచివరకు జరిగిన విషయంంతా వారికి తెలియజేశాడు. మత్తు మందులు కొనే సందర్భంలో ఒకసారి స్టీవెన్ తనకు కొంత బాకీ ఉండేదని అది చెల్లించకుండా వాయిదా వేస్తూ ఉండేవాడని చెప్పాడు చివరకు డబ్బు ఇవ్వలేక అందుకు బదులుగా తన వద్దనున్న బంగారపు గడియారం తీసుకోమన్నాడట రోనీ దాన్ని తీసుకున్నప్పటికీ ఆ బాకీ మొత్తం చెల్లించాల్సిందేనని పట్టుపట్టాడట రోనీ ఆ డబ్బు వసూలు చేసుకోవడానికి వస్తానన్న రోజున స్టీవెన్ తన ఆత్మరక్షణకై తన తండ్రి డ్రాయర్ సొరుగులోని తుపాకి తీసి దగ్గర ఉంచుకున్నాడు. తిరిగి ఇవ్వడానికి తన వద్ద డబ్బు లేదని స్టీవెన్ రోనీకి చెప్పినప్పుడు రోణీ కోపంతో స్టీవెన్ చేతిలోని తుపాకి లాక్కొని స్టీవెన్ తలపై కాల్చాడు. తాను ఆ సమయంలోనే బాగా మత్తఎక్కిన మైకల్లో ఉన్నానని రోనిీ అంగీకరించాడు. రోణీకి కోర్టు వారు జీవితాంతం ఖైదు విధించారు. రోణీ ప్రస్తుతం జైల్లో ఉన్నాడని తెలిపింది సాండ్రా ఆత్మలతో సంభాషించి ఫ్రాగ్ మనకు అందించిన ఈ వృత్తాంతం నుండి మనం తెలుసుకోదగిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవి మన భౌతిక చక్షువులకు కనిపించవు కాబట్టి కాస్త విచిత్రంగా తోచవచ్చు. అంతమాత్రాన వాటిని వేగంగా కొట్టేయకుండా ఒకింత ఆలోచన సలిపితే బాగుంటుంది. ఆత్మ ఈ లోకం నుండి పరలోకంలోకి వెళ్తుంది అనే ప్రాథమిక అంశాన్ని గాని దాంతో సంభాషించగలిగే వారు ఉన్నారని పలు సందర్భాల్లో రుజువైన విషయాన్ని గాని నేను సాగదీయాలనుకోవడం లేదు. ఈ ప్రపంచంలో జరిగేవన్నీ ఆకాశ పంచాంగంలో నమోదై ఉంటాయని వాటిని చూడగల సామర్థ్యము తర్ఫీదు ఉన్న మనిషి మన దృష్టి సారించి తన దృష్టి సారించి అప్పటి ఆ ఘట్టాన్ని ఇప్పుడు దర్శించగలిగి ఉంటాడని లోప్సాంగ్ రాంప అనే ప్రసిద్ధ రచయిత ఆధ్యాత్మిక రచయిత తన పుస్తకాలన్నిటిలో మళ్ళీ మళ్ళీ ఉద్ఘాటించేవాడు. ఆస్పెన్స్కీ అనే గొప్ప రష్యన్ గణిత శాస్త్రజ్ఞుడు ఉత్తమ ఆధ్యాత్మిక సాధకుడు ఈ ప్రపంచ చరిత్రలోని ఏ ఘట్టము చెరిగిపోయేది కాదని చూడదలుచుకున్నవాడు ఆ శక్తిని సంపాదించి కాలగతిలో సంభవించిన అలనాటి ప్లాసీ యుద్ధాన్ని కానీ మరేదైనా ఘటనాన్ని గాని ఘట్టాన్ని గాని చూడగలడని వక్కాణిస్తుండేవాడు. చరిత్రలోని ఘట్టాలేవి మాసిపోయే ప్రసక్తి లేదంటుండేవాడు అలనాటి వాల్మీకి జరిగిపోయిన ఘట్టాలే కాక జరగబోయే ఘట్టాలను కూడా ఎలా దర్శించి ఆ రామాయణాన్ని పూర్తి చేశాడు అనేది మన మెదడుకు అందని విషయం కానీ ద్రష్ట అయిన వాల్మీకి భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కనిపిస్తూనే ఉండిండాలి. ఆ మాటే నిజం కాకపోతే జేమ్స్ వాన్ ఫ్రాగ్ అనే ఈ ఆధునిక అమెరికన్ మీడియం ఏమి చూడగలిగి చెప్పగలిగి ఉండేవాడు కాదు ఫ్రాగ్ ఈ సందర్భంలో చెప్పిన అధిక భాగం సరిపోగానే సరిపోయినట్లు కనిపిస్తుంది. స్టీవెన్ చనిపోయి సంవత్సరమే అయిందా లేదా రెండేళ్ళ అయిందా అనే విషయంలో ఒకింత హెచ్చు తగ్గులయింది. అమెరికన్ ఛానల్ సిఎన్ మీద ప్రత్యక్ష ప్రత్యక్ష ప్రచారం చూచేటప్పుడు ఫ్రాగ్ ను టెలిఫోన్ మీద ప్రేక్షకులు దూర దూరాల నుండి సంప్రదించేవారు. అవతలి మనిషి పేరు తెలుసుకొని మన కళ్ళ ముందే వారి సమీపస్తులు చెప్పే విషయాలను చెప్పసాగేవాడు అందిన సమాచారం చాలా వరకు సరిగానే సరిపోయేది. కొన్ని మాత్రం ఇప్పటికీ సరిగా కనిపించేవి కాదు కానీ మీకు తెలియకపోయినప్పటికీ మీ వద్ద నుంచండి తర్వాత దాని నిజానిజాలు వెలికి రావచ్చు అంటుండేవాడు ఫ్రాగ్ ఇదంతా నాటకం బూటకం అని కొట్టిపారేసే స్వేచ్ఛ హక్కు ఎవరికైనా ఉంది. ప్రతి విషయాన్ని వ్యాపారంగా మార్చుకుని నాలుగు డబ్బులు పోగేసుకునేవారు అన్ని వృత్తుల్లో ఉన్నట్లే ఇక్కడ కూడా ఉంటారు. దాని ఆధారంగా టెలిపీ టెలికైనసిస్ టెలిపోర్టేషన్ వంటి వాటిని గాని క్లయర్ వాయిన్స్ అంటే సుదూర ప్రాంతాల్లోని దృశ్యాలు చూడగలిగి ఉండడం క్లియర్ ఆడియన్స్ అంటే దూరంగా జరిగే సంభాషణలు వినిపించడం మొదలైనవన్నీ ఉన్నట్టుంటివని అనడం సాహసమే అవుతుంది. మిగతా అన్ని రంగాల్లో అధిక శాతం విజయం కొద్ది శాతం అపజయం ఉన్నట్లే ఆ రంగాల్లో కూడా జయాపజయాలు అదే పాళ్ళల్లో ఉంటాయి. ఇకపోతే ఫ్రాగ్ చెప్పే ముఖ్యమైన విషయాలతో పాటు అనేక అముఖ్యమైనవి కూడా తోడు వస్తుంటాయి. ఇందుకు కారణం అతడి మనోవీధిలో ప్రవేశించి అతడి మెదడును తమ ఆలోచనతో నింపేవారే కానీ ఫ్రాగ్ మాత్రం కాదు చాండ్రాను కిచెన్ నైఫ్ తో జాగ్రత్తగా ఉండమని ఆ తల్లి చెప్పడం కూతురు క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని చెప్పింది అనుకున్నప్పటికీ బంగాళా దుంపల పులుసు సంగతి ప్రస్తావించడం అముఖ్యమని తోచవచ్చు కానీ అందుకు ఫ్రాగ్ ఏమి చేయగలడు అక్కడి నుంచి అదే సమాచారం యదాతదంగా ఉన్నది ఉన్నట్లు పలకాల్సిందే గానీ ఆలోచించే వ్యవధి ఏది జల్లెడ పట్టేది వీలేది అక్కడి వారి ఒత్తిడి ఫ్రాగ్ మీద చాలా తీవ్రంగా ఉంటుంది. మీడియం గా వ్యవహరించినంతసేపు వాళ్ళ నొప్పి బాధ యావత్తు తాను అనుభవిస్తాడు. ఈ విధంగా ఈ ప్రక్రియ జరుగుతున్నంతసేపు అందులో తన ప్రమేయం ఏమి ఉండదు. దీన్ని బట్టి మనమందరం ఈ లోకంలో ఎంత అల్పమైన విషయాలపై దృష్టి నిండుకొని సంచరిస్తున్నామో తెలుస్తుంది. మరణానంతర స్థితిలోనైనా ఇవే గుణాలు కొనసాగుతాయి. అందువల్లనే మన అలవాట్లను ఆలోచనలను భావాలను ఇంతకన్నా ఉన్నతంగా మలుచుకోవాలి. అందుకు ఇప్పుడే ఇక్కడి జీవితం సమూలంగా మారాలి జీవితాన్ని తరచి అర్థం చేసుకొని ఇంతకన్నా ప్రాజ్ఞతతో మరణించగలిగి ఉండాలి లేకుంటే ఇక్కడి లాగానే అక్కడ కూడా జోకర్ ముక్కల్లాగా నల్లమందు బాయిల్లాగా వినోదమే ప్రధానంగా కాలం గడపడం సంభవిస్తుంది. మళ్ళీ పుట్టినప్పుడు ఆ సంస్కారాలన్నీ అలాగే ఉండిపోతాయి. ఫ్రాగ్ అనుభవాన్ని బట్టి మనవంటివారు భూలోకంలో ఉన్నా పరలోకానికి వెళ్ళినా మనలో ఎదుగుదల ఉండేటట్లు కనిపించదు. ఇదంతా తెలుసుకున్న తర్వాతనైనా మనం ఒకింత హెచ్చరికలోకి రాగలమా జీవిత పరమార్థం ఏమిటో గ్రహించడానికి ప్రయత్నించగలమా ఆ ప్రయత్నం ఇక్కడే ఈ క్షణాన్నే ప్రారంభం అవ్వాలి అప్పుడే నేర్చుకునే ఈ అనంత యాత్రలో విజయవంతంగా ముందుకు సాగగలుగుతాము

No comments:

Post a Comment