Saturday, June 13, 2026

సమాధి స్థితి సమగ్ర వివరం – మరణమా? ముక్తియా? | The Ultimate State Yogis Attain

సమాధి స్థితి సమగ్ర వివరం – మరణమా? ముక్తియా? | The Ultimate State Yogis Attain

Author Name:సింహీ అపరాజితా మహా మంత్రాలయం

Youtube Channel Url:https://www.youtube.com/@%E0%B0%95%E0%B0%AE%E0%B0%B2%E0%B0%BE%E0%B0%A8%E0%B0%82%E0%B0%A6%E0%B0%A8%E0%B0%BE%E0%B0%A5

Youtube Video URL:https://www.youtube.com/watch?v=LkWHcPBBTv0



Transcript:
(00:15) [సంగీతం] [సంగీతం] శ్రీ గురుభ్యో నమః సింహి అపరాజతా మహా మంత్రాలయా నికి స్వాగతం నేను కమలానందనాథ మంత్రశాస్త్రంలో సాధనావస్థలో ఒక సాధకుడు తీవ్రంగా లోతుగా వెళ్ళిపోయిన తర్వాత ఒక స్థాయికి చేరుకుంటాడు. నేను గతంలో చెప్పినటువంటి వీడియోలో నిద్రావస్థ దాకా చెప్పాడు అది చాలా తీవ్రంగా దీర్ఘకాలికంగా కొనసాగిస్తే సమాధి స్థితిలోకి ప్రవేశిస్తాడు.
(00:58) ఋషులు మునులు చిరంజీవులుగా చెప్పబడేటువంటి వారు వీరందరూ కూడా ఆ సమాధి స్థితిలో ఉన్నవారే శరీరాన్ని పూర్తిగా అంటే లౌకికంగా శరీరాన్ని ప్రదర్శిస్తున్న ప్రదర్శించకపోయినా వాళ్ళలో ఉండేటువంటి చైతన్యం సాధారణంగా ఒక వ్యక్తి ఏమి చేయగలడో అవన్నీ కూడా చేయగలుగుతుంది. దానికి తార్కానం అనేక క్షేత్రాలు ఉన్నాయి దత్త క్షేత్రాల ఒక వ్యక్తి తన శరీరాన్ని తన ఆధీనంలో పూర్తిగా ఉంచుకొని సాధన మార్గంలో తనని తను పూర్తిగా నియంత్రించుకుంటూ ఆత్మజ్ఞానం తెలుసుకుని సాధన కొనసాగించి గతంలో చెప్పినటువంటి అవస్థలన్నీ కూడా దాటుకుని నిద్రావస్థను కూడా దాటి జీవితాన్ని తరింప
(01:44) చేసుకున్నటువంటి వాడు మాత్రమే సమాధి స్థితిలోకి ప్రవేశిస్తాడు. స్తాడు అంటే ఆ వ్యక్తికి ఇంకా శరీరంతో సంబంధం ఉండదు చాలామంది అడుగుతూ ఉంటారు ఈ ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తిలోకి ప్రాణాన్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చా దాంట్లోకి వెళ్లొచ్చా దీనికి గతంలో చాలామంది చాలా ఉదాహరణలు ఇచ్చారు పరకాయ ప్రవేశం గురించి ఒక శరీరంలోకి ఒక జీవం కలిగినటువంటి శరీరం ఇందులో ఉన్నటువంటి జీవాన్ని అందులోకి ప్రవేశపెట్టడం పరకాయ ప్రవేశం ఇది దేని వల్ల సాధ్యం అవుతుందో తెలుసునా ఒక వ్యక్తి తన జీవితంలో కేవలం ఆత్మజ్ఞానం కొరకు మాత్రమే జీవితంలో ఉన్నటువంటి రోజులు ఏవైతే
(02:26) ఉన్నాయో దాంట్లో ముఖ్యమైనటువంటి రోజులు అంటే ప్రధానమైనటువంటి రోజులు మనిషి తనని తను అనుభవించడానికి ఆస్వాదించడానికి ప్రపంచం గురించి తెలుసుకోవడానికి కొన్ని రోజులు ఉంటాయి బాల్యవస్థ నుంచి యవ్వనంలోకి ప్రవేశించిన తర్వాత ఈ రోజులను కూడా ఖర్చు పెట్టేసి తత్వాన్వేషణలో ఆత్మజ్ఞానం కొరకు ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి సమాధి స్థితిలోకి వెళ్తాడు.
(02:52) అటువంటి వ్యక్తి మాత్రమే తన శరీరంలోనుంచి బయటకి ఆత్మగా వచ్చిన తర్వాత కూడా ఆ శరీరం ఉన్నప్పుడు ఎలాగైతే ప్రవర్తించేవాడో ఆ ఆత్మలో కూడా అలాగే ప్రవర్తించగలుగుతాడు శరీరం లేకపోయినా సరే కొంతమందికి దర్శనం ఇవ్వగలుగుతాడు. ఇవన్నీ కూడా సాధకుడు యొక్క సాధన మీద ఆధారపడి ఉంటాయి. లౌకికమైనటువంటి జీవన విధానంలో గృహస్థాశ్రమ ధర్మంలో ఉండి ఇతరమైన బయట విషయాలన్నీ కూడా నిర్వర్తించుకుంటూ ఇంతటి జ్ఞానాన్ని సముపార్జన చేసి ముందుకు వెళ్ళడం అనేది సాధ్యపడే అంశం కాదు ఆత్మజ్ఞానం గురించి ఒక్క మాట చెప్పనా అది ఏ పుస్తకంలోన దొరకదు ఎవరు చెప్పినా అర్థం అవ్వదు దాన్ని అన్వేషించాలి దాని కొరకు సాధకుడే ప్రయత్నం
(03:36) చేయాలి ప్రయత్నం చేస్తూ చేస్తూ చేస్తూ ఉంటే వాడి కర్మ వాడికి సహకరిస్తే గనుక తన యొక్క ఆత్మజ్ఞానాన్ని తాను తెలుసుకోగలుగుతాడు ఆత్మజ్ఞానం అంటే వ్యక్తిగత శోధన అన్నమాట అందులో తరించినవాడు మాత్రమే సమాధి స్థితికి చేరుకున్న తర్వాత కూడా బాహ్యంగా తన శక్తిని ప్రదర్శించగలుగుతాడు. సాధనా మార్గంలో అంత లోతుకు వెళ్ళిన తర్వాత మాత్రమే సమాధి స్థితి అనేది కలుగుతుంది.
(04:04) యోగులు ఋషులు అవధూతలు ఇటువంటి మార్గాన్ని పాటించిన వారు ప్రస్తుతం యుగధర్మం ప్రకారం మానవ మాత్రులు ఇవి చేయలేరు దానికి చాలా యోగం కావాలి. అలాంటి యోగం కలిగినటువంటి వారు మాత్రమే సమాధి స్థితికి చేరగలుగుతారు దైవ చైతన్యం కూడా దీనినే పోలి ఉంటుంది. కాకపోతే దీనికన్నా చాలా తీవ్రమైంది దైవ చైతన్యం నేను గతంలో కూడా చెప్పాను పరమాత్మ అనే పదానికి అర్థం ఒక వ్యక్తికి ఉండేటువంటి ఆత్మకు ఉండే కెపాసిటీ ఏదైతే ఉంటుందో దానికి కొన్ని వేల కోట్ల రెట్లు అధికంగా ఉంటుంది దైవ చైతన్యం తద్వారా మాత్రమే ఆ చైతన్యం అనేకమందిని ఏకకాలంలో ఉద్ధరించగలుగుతోంది.
(04:45) సమాధి స్థితికి చేరుకున్నటువంటి వ్యక్తి తను లౌకికంగా బ్రతికి లేకపోయినా కూడా అంటే శరీరం లేకపోయినా కూడా తన ఆత్మతోటి శారీరకంగా ఏవైతే చేయగలడో అవన్నీ కూడా చేయగలుగుతాడు చాలామందికి దర్శనం ఇవ్వగలుగుతాడు. అవధూత దత్తాత్రేయుడి యొక్క పరంపరలో ఉన్నటువంటి వారు కూడా ఇదే మార్గానికి చెంది ఇదే మార్గాన్ని ప్రబోధించినటువంటి వారు సాధన మార్గంలో ప్రతి ఒక్కరూ కూడా ఎంతో లోతుగా వెళితే తప్ప ఈ స్థిత ప్రజ్ఞత సమాధి స్థితి కలగవు ఇక ఈ వివరానికి సంబంధించిన దత్తాత్రేయుడి యొక్క అవతారం మహాస్వామి వారి యొక్క అవతారం గురించి మరొక
(05:31) కార్యక్రమంలో సమగ్రంగా ఆ అవతార ఆంతర్యం ఆ చైతన్యం ఏం చేయగలుగుతుంది దుష్ట శక్తులని ఎలా పారద్రోల గలుగుతోంది క్షేత్రాశ్రితం అయిన వెంటనే ఇంత ఎంత నెగిటివ్ కలిగిన వాళ్ళు కూడా ఎలా స్వేచ్ఛగా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు ఎలా ఆ రుజనాన్ని అక్కడ విడిచిపెట్టి రాగలుగుతున్నారు ఈ వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను.
(05:57) సరైన మంత్రశాస్త్ర జ్ఞానాన్ని తెలుసుకోవడానికి అభ్యసించడానికి సింహీ అపరాజితను అనుసరించండి సర్వేజనా సుఖినో భవంతు అహం కమలానందనాథ

No comments:

Post a Comment