Wednesday, May 3, 2023

 🕉️ *జై శ్రీమన్నారాయణ* 🕉️
  🌹🌹🌹🌹🌹🌹🌹🌹    
*_🌴" మీరు నా కోసం పూజలు,  ప్రార్థనలు చేస్తుంటారు. నిజానికి ఇవి ఎవరి ఉన్నతి కోసం వారు చేసుకుంటున్నారు తప్ప నా కోసం కాదు. నా కోసం మీరు ఏదైనా చేయాలనుకుంటే అది కేవలం సేవ మాత్రమే. దీనులను, అనాధులను ఆదుకున్నవారంటేనే నాకు అమితమైన ఇష్టం. గుడికి వచ్చి ప్రసాదాలు, కానుకలు, మొక్కులు ఇవ్వమని నేను చెప్పడం లేదు, గుడి బయట ఉన్న, మీ చుట్టూరా ఉన్న పేదలకు, రోగులకు, నిస్సహాయులకు కాసింత అన్నం పెట్టి ఆకలి తీర్చండి. మీకు పంచభక్ష్య పరమాన్నాలను నేనిస్తాను. అయితే ఎవరైతే తమ దగ్గర ఉండి కూడా దీనులకు,  పేదలకు, అనాధలకు పంచిపెట్టరో,  ఎవరైతే దేవుని వాక్యాలను దిక్కరిస్తారో,  ఎవరైతే ఆకలి అంటూ అన్నం నిమిత్తం తన దగ్గరకు వచ్చిన వారిని కసిరి కొట్టడం, దూషణ చేయడం చేస్తారో, ఎవరైతే తమ తల్లిదండ్రులను పోషింపక వీదులపాలు చేస్తారో,  ఎవరైతే దైవము పట్ల అశ్రద్ధతో  ఉంటారో వారికి వినాశనం తప్పదు! ఎవరూ చూడడం లేదని పాపాలు చేసేవారికి గట్టిగా హెచ్చరిస్తున్నాను! వినండి!! మీరు చేసే ఘనకార్యములన్నీ నేను ఎరుగుగును. నేను శూన్యంలో సహితం చూడగలను. నా నుండి ఏదీ దాచలేరని తెలుసుకొని మసలుకొండి. "🌴_*

పరమ శివుని శత నామాలు

 పరమ శివుని శత నామాలు 🙏
💐🌷🌹 నిత్యమూ స్మరించవలసినవి 🌹🌷💐
🌹🌹🌹🌹🌹🌹🌹🌹


1 స్థిరః = సర్వకాలములందు నిలకడగా నుండువాడు,
2 స్థాణుః = ప్రళయకాలమునందును ఉండువాడు,
3 ప్రభుః = సమస్తమునకు అధిపతి,
4 భీమః = ప్రళయకాల భయమును కలుగజేయువాడు,
5 ప్రవరః = సర్వశ్రేష్టుడు,
6 వరదః = వరములనిచ్చువాడు,
7 సర్వాత్మా = సమస్తమైన ఆత్మలుతానే అయినవాడు,
8 సర్వవిఖ్యాతః = సర్వత్రా ప్రసిద్ధుడైనవాడు,
9 సర్వః = సమస్తము తానేఅయినవాడు,
10 సర్వకరః = సమస్తజగత్తులను చేయువాడు,
11 భవః = శివుని రూపంలో పుట్టినవాడు,
12 జటీ = జడలు ధరించినవాడు,
13 చర్మీ = వ్యాఘ్ర చర్మనును ధరించినవాడు,
14 శిఖండీ = శిఖలు ధరించినవాడు, 
నెమలి పింఛములను ధరించినవాడు,
15 సర్వాంగః = సమస్తమైన 
అవయవములతో పూర్ణమైనవాడు,
16 సర్వభావనః = సమస్త భావనల 
రూపమును తానే అయినవాడు.
17 హరః = సమస్త పాపములను హరించువాడు,
18 హరిణాక్షః = లేడికన్నులు వంటి కన్నులు కలవాడు,
19 సర్వభూతహరః = సమస్తప్రాణికోటిని హరించువాడు,
20 ప్రభుః = అధిపతి,
21 ప్రవృత్తిః = జీవనవిధానము తానే అయినవాడు,
22 నివృత్తిః = జీవనవిధాన నివారణము 
తానే అయినవాడు,
23 నియతః = నియమము యొక్క రూపము 
తానే అయినవాడు,
24 శాశ్వతః = నిత్యమైనవాడు
25 ధ్రువః = నిశ్వయ రూపము తానే అయినవాడు.
26 శ్మశానవాసీ = శ్మశానమునందు నివసించువాడు,
27 భగవాన్ = షడ్గుణ ఐశ్వర్యములు కలవాడు,
28 ఖచరః = ఆకాశమునందు సంచరించువాడు,
29 అగోచరః = కంటికి కనిపించనివాడు,
30 అర్దనః = తనలోనికి తీసుకొనువాడు,
31 అభివాద్యః = నమస్కరింప తగినవాడు,
32 మహాకర్మా = గొప్పదైన కర్మానుభవం తానేఅయినవాడు,
33 తపస్వీ = తపస్సుచేయువాడు,
34 భూతభావనః = ప్రాణికోటి భావన 
తానే అయినవాడు.
35 ఉన్మత్తవేష ప్రచ్ఛన్నః= పిచ్చివాని వేషంలో దాగియున్నవాడు,
36 సర్వలోక ప్రజాపతిః= సమస్తలోకములందలి ప్రజలను పాలించువాడు,
37 మహారూపః = గొప్పదైన ఆకారము కలవాడు,
38 మహాకాయః = గొప్పదైన శరీరము కలవాడు,
39 వృష రూపః = పుణ్య స్వరూపుడు,
40 మహాయశాః = గొప్ప కీర్తి కలవాడు.
41 మహాత్మా = గొప్పదైన ఆత్మయే తానైయున్నవాడు,
42 సర్వభూతాత్మా = సమస్త ప్రాణికోటి యొక్క ఆత్మల రూపం ధరించినవాడు,
43 శ్వరూపః = సమస్త విశ్వము యొక్క రూపము తానే అయినవాడు,
44 మహాహనుః = గొప్ప దవడలు గలవాడు,
45 లోకపాలః = లోకములను పరిపాలించువాడు,
46 అంతర్హితాత్మా = అదృశ్యమైన ఆత్మలు తానే అయినవాడు,
47 ప్రసాదః = అనుగ్రహించువాడు,
48 నీల లోహితః = నీలమైన కంఠము, ఎరుపు వర్ణము జటలు కలవాడు.
49 పవిత్రం = పరిశుద్ధమైన,
50 మహాన్ = గొప్పవాడు,
51 నియమః = నియమం తన స్వరూపమైనవాడు,
52 నియమాశ్రితః = నియమములను ఆశ్రయించియుండువాడు,
53 సర్వకర్మా = సమస్తమైన కర్మములు తానే అయినవాడు,
54 స్వయం భూతః = తనంతట తానుగా పుట్టినవాడు,
55 ఆదిః = సృష్టికి అంతటికీ మొదటివాడు,
56 నిధిః = అన్నిటికి మూలస్థానమైనవాడు.
57 సహస్రాక్షః = అనేకమైన కన్నులు కలవాడు,
58 విశాలాక్షః = విశాలమైన కన్నులు కలవాడు,
59 సోమః = చంద్రుని వంటివాడు,
60 నక్షత్రసాధకః = నక్షత్రాలకు వెలుగును కలుగజేయువాడు,
61 చంద్రః = చంద్రుని వంటివాడు,
62 సూర్యః = సుర్యుని వంటివాడు,
63 శనిః = సూర్యుని కుమారుడైన శని వంటివాడు,
64 కేతుః = కేతుగ్రహరూపం తానేఅయినవాడు,
65 గ్రహపతిః = గ్రహములను పాలించువాడు,
66 వరః = శ్రేష్టుడు.
67 ఆది = మొదలు,
68 అంతః = చివర,
69 లయకర్తః = ప్రళయములను సృష్టించువాడు,
70 మృగబాణార్పణః = మృగమువంటి ఇంద్రియములపై బాణము ప్రయోగించినవాడు,
71 అనఘః = పాపరహితుడు,
72 మహాపాతః = గొప్ప తపస్సు చేసినవాడు,
73 ఘోరతపాః = భయంకరమైన తపస్సు చేసినవాడు,
74 అదీనః = ప్రాధేయపడు స్వభావము లేనివాడు,
75 దీన సాధకః = బాధలలో ఉన్నవారిని రక్షించువాడు.
76 సంవత్సర కరః = సంవత్సర కాలమును సృష్టించినవాడు,
77 మంత్రః = మంత్ర స్వరూపము తానే అయినవాడు,
78 ప్రమాణం = ప్రమాణ స్వరూపుడు,
79 పరమంతపః = మహా ఉత్కృష్టమైన తపస్సు తానే అయినవాడు,
80 యోగీ = యోగనిష్ఠ యందున్నవాడు,
81 యోజ్యః = సంయోజనము చేయుటకు తగినవాడు,
82 మహాబీజః = గొప్ప ఉత్పత్తి కారకమైనవాడు,
83 మహారేతః = గొప్ప వీర్యము కలవాడు,
84 మహాబలః = గొప్పశక్తి కలవాడు.
85 సువర్ణరేతాః = అగ్నిరూపమై యున్నవాడు,
86 సర్వజ్ఞః = సమస్తము తెలిసినవాడు,
87 సుబీజః = ఉత్తమమైన ఉత్పత్తి కారకుడు,
88 బీజవాహనః = సమస్త సృష్టి ఉత్పత్తి కారకములను తెచ్చి ఇచ్చువాడు,
89 దశబాహుః = పది భుజాలు కలవాడు,
90 అనిమిషః = రెప్పపాటు లేనివాడు,
91 నీలకంఠః = నల్లని కంఠము కలిగియున్నవాదు,
92 ఉమాపతిః = పార్వతి భర్త
93 విశ్వరూప = ప్రపంచ స్వరూపము తానే అయినవాడు
94 స్వయంశ్రేష్ఠః = తనంతట తానుగా ఉత్తముడైనవాడు
95 బలవీరః = బలము చేత పరాక్రమం కలవాడు
96 బలః = బలము కలవాడు
97 గణః = సమూహ స్వరూపమైనవాడు
98 గణకర్తా = ప్రమధాది గణములను సృష్టించువాడు
99 గణపతిః = ప్రమధాతి గణములకు అధిపతియైనవాడు
100 దిగ్వాసాః = దిక్కులు వస్త్రములుగా కలవాడు.
ఓం నమః శివాయ🙏🏻

నీళ్లు సరిగ్గా తాగకపోతే వచ్చే సమస్యలు ఏంటో తప్పని సరిగా తెలుసుకోండి :-

 నీళ్లు సరిగ్గా తాగకపోతే వచ్చే సమస్యలు ఏంటో తప్పని సరిగా తెలుసుకోండి :-

ప్రస్తుతం సమాజంలో రోజు ఒక్క బాటిల్ తాగేవారకన్న ...బాటిల్ మందు వేసేవారెక్కువగా తయారవుతున్నారు. మీరు మంచి నీళ్లు రోజుకు ఎన్ని సార్లు తాగుతారంటే...దాహం వేసినప్పుడు తాగుతా అంటారు. కాని నిజానికి రోజు ఏసీ గదుల్లో ఉంటూ ఎంత మంది నీళ్లు తాగుతున్నారు ? ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక లీటర్ కూడా నీళ్లు తాగి ఉండరు. ఇది ఏ ఒక్కరి సమస్య కాదు... నీళ్లు స తాగాలంటే బద్దకంగా ఫీలయ్యేవారందరి సమస్య. ఈ శరీరానికి నీళ్లు తాగడం చాలా అవసరం. ఎందుకంటే.. మనుషుల శరీరం మూడోవంతు నీటితోనే నిర్మాణమై ఉంటుంది. కాబట్టి నీళ్లు సరిగా అందకపోతే.. శరీరంలో అనేక సమస్యలు ఎదురవుతాయి. 

1.మీరు కుర్చుని లేవలేక పోతున్నారా... కీళ్లు, కండరాలు నొప్పులతో అవస్తపడుతున్నారా...అయితే మీరు తక్కువ నీళ్లు తాగుతున్నారన్నమాట. ఎందుకంటే.. కీళ్ల మధ్యలో ఉండే కార్టిలేజ్ 80 శాతం నీటితో నిర్మితమై ఉంటుంది. మీరు నీళ్లు తక్కువగా తాగినప్పుడు ఈ నొప్పుల వస్తాయి..

2. తలనొప్పి తరచుగా నీరు తక్కువగా తాగినప్పుడు మీకు తలనొప్పి వేధిస్తుంటుంది. ఆక్సిజన్ తక్కువగా అందడం, బ్రెయిన్ కి బ్లడ్ తక్కువ అందడం వంటివి డీహైడ్రేషన్ ద్వారా కలుగుతాయి. దీంతో తలనొప్పి వస్తుంది.

3. జీర్ణవ్యవస్థకు కూడా నీళ్లు చాలా అవసరం. డీహైడ్రేషన్ కారణంగా, ఫ్లూయిడ్స్ తక్కువగా అందడం వల్ల ఈ సమస్య కనిపిస్తుంది.

4. అలసట ,ఎనర్జిటిక్ గా, యాక్టివ్ గా లేకపోవటం అనేవి తక్కువ నీరుకు సంబంధించినదే... బ్లడ్ ప్రెజర్ తగ్గిపోతుంది. దీనివల్ల ఆక్సిజన్ సరిగా అందదు. ఇలాంటి లక్షణాలు మీలో కనిపించాయి అంటే.. మీరు శరీరానికి కావాల్సిన మోతాదులో నీళ్లు తాగడం లేదని అర్థం.

5. యూరిన్ కలర్ మీ శరీరం డీహైడ్రేట్ అయిందని తెలిపే ముఖ్య లక్షణం మీ యూరిన్ కలర్. అలాగే తరచుగా యూరిన్ కి వెళ్లకపోయినా.. మీరు సరైన స్థాయిలో నీళ్లు తాగడం లేదని గుర్తించాలి. రోజుకి 4 నుంచి 7 సార్లు యూరిన్ కివెళ్లాలి. అలాగే మీ యూరిన్ కలర్ ఎల్లో కలర్ లో ఉంది అంటే కూడా మీరు నీళ్లు తాగడం లేదని గుర్తించాలి.

6. బ్రెయిన్ ఫంక్షన్ పైనా ఇది ప్రభావం చూపుతుంది. మీ మూడ్, మెమరీ, డెసిషన్, ఏకాగ్రత వంటివాటిపై కూడా ఇది ప్రభావం చూపుతుంది.

7. పెదాలు ఆరిపోవడం , చర్మం ప్రకాశవంతంగా ఉండకపోవటం, పొడిబారిపోవటం. 
అలాగే చెమట కూడా చాలా తక్కువగా పట్టడం. ఇవే మీరు సరిగ్గా నీళ్లు తాగటం లేదని చెప్పే సంకేతాలు...ఇకనైనా నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి ఇకపై ఈ సిగ్నల్స్ కనిపించిన వెంటనే నీళ్లు తాగటం అలవాటు చేసుకోండి.

మిరాకిల్

 #మిరాకిల్

ఒక చిన్న పిల్లాడు మందుల షాపు ముందు నిలుచుని " " "మిరకిల్" మందు ఉందా? నా డబ్బాలో దాచుకున్న  డబ్బులన్నీ ఇచ్చేస్తాను...ఏడుస్తూ అడిగాడు.
షాపు వానికి అర్ధం అయింది. కాని సమాధానం ఎలా చెప్పాలో తెలియడం లేదు.

కావాలంటే ఇంకా తెస్తాను. అమ్మ  ఇంట్లో ఎక్కడైనా దాచిందేమో వెతుకుతా! స్నేహితులను అడుగుతా!  "మిరకిల్ " మాత్రమే మా నాన్నను బ్రతికిచగలదని మా అమ్మ  చెబుతుంది. అప్పటికెే ఆ పిల్లాడు బాగ ఏడ్చినట్లుగా బుగ్గల పై కన్నీరు చారలుకట్టి ఉంది. మందుల షాపు వాడి కళ్ల లో నీళ్లు తిరాగాయి. సమాధానం చెప్పలేని పరిస్ధితి.

ప్రక్కనే ఓ పెద్ధాయన నిలుచుని ఉన్నాడు. ఆ పిల్లాడిని చూసి కదిలిపోయాడు. నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి? అని అడిగాడు.  ఆ పిల్లాడు తెచ్చుకున్న డబ్బాలో "చిల్లర నోట్లు ...కాయన్స్ ఆ పెద్ధాయన చెేతిలో పోసాడు. అంతా కలిపితే మూడు వందల డబ్బై రెండు రూపాయలు. ఇంకా తెస్తాను... మా నాన్నకు మిరకిల్ మందు ఇవ్వండి ...ఏడుస్తున్నాడు పిల్లాడు.

సరే! నన్ను మీ ఇంటికి తీసుకు వెళ్లు ...అని ఆ పెద్దాయన ఆ పిల్లాడు ఇచ్చిన డబ్బులు జేబులో వేసుకుని ....చిన్ని చేతి వేలు పట్టుకుని  ఆ పిల్లాడి ఇంటికి వెళ్లాడు.

అక్కడ పరిస్ధితి దయనీయం గా ఉంది.  ఆ అబ్బాయి తల్లి కామోసు!  పిల్లాడి తండ్రి ప్రక్కన కూర్చుని కన్నీటి పర్యంతం అవుతూంది. డాక్టర్ రిపోర్ట్ "బ్రైయిన్ ట్యూమర్ " పీక్ స్టేజ్ లో ఉంది. చాల కర్చుతో కూడిన పని....అక్కడ ఇంటి పరిస్ధితి చూసి అతను అర్ధం చేసుకున్నాడు.

ఆ తరువాత.....చక చకా ....పేషెంట్ ను ప్రసిద్ధి గాంచిన హాస్పిటల్ కు తరలించడం..... ఆపరేషన్ జరగడం.... ఆ పిల్లాడి తండ్రి ప్రాణం నిలవడం జరిగింది.  

ఆ పెద్ధాయన ....మంచి మనస్సున్న  నిపుణుడైన న్యూరో సర్జన్ . ఆ డాక్టర్  ఆ పిల్లాడు ఇచ్చిన డబ్బులు ఆయన బద్రం గా డబ్బాలో దాచుకున్నాడు. 

పిల్లాడి కళ్లలో మతాబులు పూసాయి. డాక్టర్ ఆనందం తో ఆ పిల్లాడితో ఇలా అన్నాడు .... "మిరకిల్ మందు" ఖరీదు "మూడు వందల డబ్బై రెండు రూపాయిలే! నీ డబ్బులు కరెక్టుగా సరిపోయాయి.

ఆ పిల్లాడు సృహలోకి వచ్చిన వాళ్ల నాన్నతో అంటున్నాడు.... డాడి ! నాకు మిరకిల్ మందు దొరికింది... కరెక్టు గా  ఖరీదు నా డిబ్బీలో మూడువందల డబ్బై రెండు రూపాయిలే! సంబరం గా అంటూంటే ....చుట్టూ ఉన్న వాళ్లంతా ఆనందం తో కన్నీటి పర్యంతం అయ్యారు.

ఎవరన్నారండి? దేవుడు లేడని.....పసి పిల్లలు పిలిస్ధే దేవుడు ఇలా " మిరకిల్ " రూపం లో వస్తాడు.

శ్రీరమణీయం: ధ్యానాన్ని అర్ధం చేసుకోవటం, ఆవిష్కరించుకోవటం ఎలా సాధ్యం అవుతుంది ?

 🙏🕉🙏                    ...... *"శ్రీ"*

                 💖💖💖
       💖💖 *"543"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     🌼💖🌼💖🌼💖🌼
           🌼💖🕉💖🌼
                 🌼💖🌼
                       🌼
*"ధ్యానాన్ని అర్ధం చేసుకోవటం, ఆవిష్కరించుకోవటం ఎలా సాధ్యం అవుతుంది ?"*

*"మన మనసు మూడు స్థితుల్లో ఉంటుంది. "ఒక విషయంలో తాదాత్మ్యత పొందినప్పుడు, గాఢనిద్రలో ఉన్నప్పుడు, ఆలోచనలు ఇతర పనుల్లో ఉన్నప్పుడు" మన మనసు స్థితిని గమనించి వీటిలోవున్న వ్యత్యాసాన్ని తెలుసుకోగలిగితే అప్పుడు నిరంతరంగా ఉన్న ధ్యానం మనకు అర్ధమవుతుంది. అంటే సర్వకాలసర్వావస్థల్లో మనసు యొక్క స్థితి తెలిస్తే ధ్యానం ఆవిష్కరించబడుతుంది. ఈ ధ్యానస్థితిని చేరుకునేందుకు గురువు చెప్పే మంత్రం నిరంతరంగా చేస్తూ ఉంటే మనసును మనసు గమనించే ఏకాగ్రత సిద్ధిస్తుంది. నిజానికి మంత్రాన్ని నిరంతరాయంగా చేయటంలోనే ఏకాగ్రత ఉంది. !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
              

మాటలాడే ముందు ఆలోచించి మాట్లాడాలి

 *మాటలాడే ముందు ఆలోచించి మాట్లాడాలి* 

        ✍️ జగద్గురు అనుగ్రహ భాషణములు
🙏🌺🌺🌺🙏💐🙏🌺🌺🌺🙏
 
🌼 ప్రతి ఒక్కడూ సత్యమే పలకాలని విధించబడింది. అందుచేత ఎవరైనా ఒక విషయం మరొకరికి తెలియచేసేటప్పుడు చాలా జాగ్రత్తతో ఉండాలి•♪ చెప్పదలచిన విషయం సత్యమే అయినా దానివల్ల వినేవానికి కష్టం కలిగేటట్లు అయితే ముందు జాగ్రత్త పడడం మంచిది♪.

✳️ ఉదాహరణకి - ఒక వ్యక్తి ఏదో ఒక వైదికమైన కర్మ చేస్తున్నాడు. మంచి ఉత్సాహంతో ఉన్నాడు♪. అతనికి ఏదో దుర్వార్త చెప్పవలసి ఉంది. తిన్నగా వెళ్ళి ఆ వార్త అతనికి చెప్పి ఆతని ఉత్సాహానికి, మానసిక శాంతికీ మనం భంగం కలిగించవచ్చునా? మనం అలా చేసిన పక్షంలో మనం సత్యం పలికాం అనే సంతృప్తి మనకుంటే ఉండవచ్చును•. అయితే మనం ఈ వార్త చెప్పడం వలన జరుగుతున్న ఆ కార్యం సగంలో నిలిచిపోతుంది అనే విషయం కూడ మనం ఆలోచించాలి• అందుచేత ఆ వార్తను తరువాత అనుకూలమైన సమయంలో అతనికి తెలపడం మంచిది•

🌹సత్యం పలకడంలో కూడ మనం మన వివేకాన్ని ఉపయోగించి, అది సహింపశక్యం కానిదయే పక్షంలో శక్యమైనంత వరకు సున్నిహితంగా చెప్పి దానిని సహ్యంగా చేయడం మంచిది•

🌹 ఇతరులను సంతోషపెట్టడం కోసం మనం అసత్యం కూడా పలకకూడదు. ప్రియమైన అసత్యం అతనికి ఆనందం కలిగించవచ్చు. అయితే ఆ ఆనందం తాత్కాలికమే• నిజం ఏమిటో తెలిసిన తరువాత అతడు చాలా బాధపడిపోతాడు. అందుచేత ఏ అపాయానికీ దారితీయకపోయినా తాత్కాలికంగా ఆనందాన్ని కలిగించేదయినా అసత్యం పలకకూడదు•

🌼 అందుచేత, ఏది సత్యమో, ఏది లాభకరమో, ఏది ఆనందజనకమో అలాంటి సత్యాన్నే పలకాలి• ఇలాంటి వర్తనం సముచితమైనది, ధర్మసమ్మతమైనది. ఇదే ఒక పుణ్యకార్యం• తపస్సు చేసుకొనడానికి అడవులలోనికి వెళ్ళవలసిన పని లేదు. ప్రీతి జనకమైన సత్యాన్నే చెపుతాను, ఇతరులను సంతోషపెట్టడానికి కూడ అసత్యం పలకను అని నిశ్చయించుకొని ఆవిధంగా ప్రవర్తించేవాడు ఋషికి ఏమాత్రమూ తీసిపోడు•

 *--- జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ మహస్వామివారు.* 

🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 🙏


*సేకరణ:* 

ఐశ్వర్యం శాశ్వతం కాదు

 *ఐశ్వర్యం శాశ్వతం కాదు* 

*शरदिंदु विकास मंदहासं* 
*स्फुरदिंदीवर* *लोचनाभिरामां |* 
*अरविंद समान सुंदराश्यां* 
*अरविंदासन सुंदरीमुपासीं* ||

శంకర భాగవత్పాదులవారు అనేక విధాలుగా జనులకు సన్మార్గాలను ఉపదేశించారు. వారు రచించిన స్తోత్రాల్లో కేవలం దేవతా గుణగణానువర్ణనలే కాకుండా, మనం గ్రహించాల్సిన అనేకానేక విషయాలను పొందుపరిచారు. ఒకచోట ఆయన భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఏం చెప్పారంటే, భగవంతా! నాకు కొన్ని ప్రార్ధనలు ఉన్నాయి. వాటిని నువ్వు అనుగ్రహించాలని ప్రార్ధించారు. ఆ ప్రార్ధనలు మనందరం ప్రతినిత్యం భగవంతుని ఎదుట చేయాల్సినవి.

ఎందుకు మనిషికి ఇంత అహంకారం? ఐశ్వర్యాన్ని చూసుకుని కావచ్చు. ఈ ఐశ్వర్యం అంతా మనకు ఎక్కడి నుండి వచ్చింది? ఇదంతా భగవంతుడి కృప వల్ల వచ్చింది కాదూ? ఆయన దయలేనిదే ఇదంతా ఎక్కడుంది? మన సామర్థ్యం వల్ల మనం ఏ ఒక్కటీ సంపాదించలేం. ఆయన కృప లేనిదే మన సామర్థ్యం దేనికీ పనికి రాదు కాబట్టి మనకు వచ్చిన సంపాదన అంతా భగవంతుడి కృప వల్ల వచ్చిందే. దాన్ని సద్వినియోగం చెయ్యాలి. తప్పు పనులకు ఐశ్వర్యాన్ని ఉపయోగించకూడదు. ఎవడైతే తన ఐశ్వర్యాన్ని భగవంతుని సేవకు కానీ, సమాజ సేవకు గానీ ఉపయోగించకుండా కేవలం తాను మాత్రమే అనుభవిస్తాడో అలాంటి వాడు పాపి అని వేదం చెబుతోంది.



--- *జగద్గురు శ్రీశ్రీ భారతీతీర్థ మహస్వామివారు*
 *🕉️🙏ఓం నమో భగవతే వాసుదేవాయ🌹*

   *మనం భగవన్నామ స్మరణలోనున్న  మహాత్మ్యమును చక్కగా గ్రహించాలి. నామి గొప్పనా లేకా నామం గొప్పదా అని బాగుగా యోచన చేస్తే నామి కంటే నామమే గొప్పని మనం గ్రహించగలగుతాం. రాములు వారు కేవలం ఒక రూపము ధరించి ఒక లంకా పట్టణం మాత్రమే జయించగలిగారు. ఒక రావణుని మాత్రమే సంహరించ గలిగారు. కానీ 'రామ ' అను నామం అనేక మందిని సంసారములనే మహా సముద్రాలను దాటిస్తుంది. దుర్గుణములనే రావణులనేకమందిని వధిస్తున్నది. పవిత్రమైన రామ నామం విశ్వమంతా వెలసి జ్యోతిర్మయ స్వరూపముగా వెలుగొందుచున్నది.* 

*రామ నామమే భక్తుల జీవితానికి ఒక నావగా రూపొందినది. అందువలన భగవంతుని కంటే భగవన్నామమే గొప్ప. అని హనుమ కూడా నిరూపించాడు.నిరంతరమూ భగవంతుని నామ చింతన శ్రద్ధతో చేస్తుంటే మన పూర్వ జన్మల సంచిత కర్మలు మనల్ని వదిలి పారిపోతాయి. మన సమస్త చింతలూ సమసిపోతాయి. భగవంతుని నామము మన జీవితమునకు కంచువంటి కంచేవలే రక్షణగా నిలుస్తుంది. కనుక నామిని మరచినా నామంను మాత్రం మరువకండి ముందు నామం బలపడే కొద్దీ నామి కూడా మన హృదయంలో బలపడతా వస్తాడు ...*🌹🙏

ధ్యానానుభవం నిరంతరం కొనసాగు తుండేదే.. అంటున్నప్పుడు ప్రత్యేకంగా ధ్యానం చేయాలని ప్రయత్నించడం ఎందుకు ?

 ధ్యానానుభవం నిరంతరం కొనసాగు తుండేదే.. అంటున్నప్పుడు ప్రత్యేకంగా ధ్యానం చేయాలని ప్రయత్నించడం ఎందుకు ?
ఆ అనుభవం పొందేందుకు సాధన అవసరం. ఒక ఫోటోకు మరోవైపు ఉన్న తెల్ల కాగితంలాగా మనసుకు ధ్యానం నిరంతరం ఉండేస్థితే ! దాన్ని గుర్తించేంత సమయం ఇవ్వకపోవటం చేతనే మనకది అనుభవంలోకి రావటంలేదు. వస్తువు నుండి పొందే ఫలంపై మనం గమనింపు పెడుతున్నాం కానీ మనసు నుండి మనస్సు పొందే ఫలంవైపు ఆ గమనింపు సారించడంలేదు. మనం ప్రతిసారీ మనసు గ్రహించే విషయాన్నే గమనిస్తున్నాం కానీ ఆ గ్రహింపును గమనించటంలేదు. దైవజపం ద్వారా గురువు అందించే ఏకాగ్రతలో మన మనసు తన గ్రహింపును అది గమనించుకుంటుంది. అదే మనకు ధ్యానంగా ఆవిష్కరింప బడుతోంది. కాబట్టి మనసు కేవలం ఏకాగ్రతలోనే కాదు సర్వకాల సర్వావస్థల్లోనూ విషయాలను గ్రహించే శక్తిని కలిగిఉంది. కాబట్టి మనం ఆ గ్రహింపుశక్తిని ఎప్పుడైనా గమనించవచ్చు. అలా గమనించే ప్రతిక్షణం మనకు ధ్యానానుభవమే ఉంటుంది. అందుకే పెద్దలు ధ్యానం చేసేదికాదు, అది నీలో ఉన్నదే అంటున్నారు !              ధ్యానాన్ని అర్ధం చేసుకోవటం, ఆవిష్కరించుకోవటం ఎలా సాధ్యం అవుతుంది ?
మన మనసు మూడు స్థితుల్లో ఉంటుంది. "ఒక విషయంలో తాదాత్మ్యత పొందినప్పుడు, గాఢనిద్రలో ఉన్నప్పుడు, ఆలోచనలు ఇతర పనుల్లో ఉన్నప్పుడు" మన మనసు స్థితిని గమనించి వీటిలోవున్న వ్యత్యాసాన్ని తెలుసుకోగలిగితే అప్పుడు నిరంతరంగా ఉన్న ధ్యానం మనకు అర్ధమవుతుంది. అంటే సర్వకాలసర్వావస్థల్లో మనసు యొక్క స్థితి తెలిస్తే ధ్యానం ఆవిష్కరించబడుతుంది. ఈ ధ్యానస్థితిని చేరుకునేందుకు గురువు చెప్పే మంత్రం నిరంతరంగా చేస్తూ ఉంటే మనసును మనసు గమనించే ఏకాగ్రత సిద్ధిస్తుంది. నిజానికి మంత్రాన్ని నిరంతరాయంగా చేయటంలోనే ఏకాగ్రత ఉంది.

శ్రీరమణీయం: ధ్యానానుభవం నిరంతరం కొనసాగుతుండేదే.. అంటున్నప్పుడు ప్రత్యేకంగా ధ్యానం చేయాలని ప్రయత్నించడం ఎందుకు ?

 🙏🕉🙏                    ...... *"శ్రీ"*

                 💖💖💖
       💖💖 *"542"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     🌼💖🌼💖🌼💖🌼
           🌼💖🕉💖🌼
                 🌼💖🌼
                       🌼
*"ధ్యానానుభవం నిరంతరం కొనసాగుతుండేదే.. అంటున్నప్పుడు ప్రత్యేకంగా ధ్యానం చేయాలని ప్రయత్నించడం ఎందుకు ?"*

*"ఆ అనుభవం పొందేందుకు సాధన అవసరం. ఒక ఫోటోకు మరోవైపు ఉన్న తెల్ల కాగితంలాగా మనసుకు ధ్యానం నిరంతరం ఉండేస్థితే ! దాన్ని గుర్తించేంత సమయం ఇవ్వకపోవటం చేతనే మనకది అనుభవంలోకి రావటంలేదు. వస్తువు నుండి పొందే ఫలంపై మనం గమనింపు పెడుతున్నాం కానీ మనసు నుండి మనస్సు పొందే ఫలంవైపు ఆ గమనింపు సారించడంలేదు. మనం ప్రతిసారీ మనసు గ్రహించే విషయాన్నే గమనిస్తున్నాం కానీ ఆ గ్రహింపును గమనించటంలేదు. దైవజపం ద్వారా గురువు అందించే ఏకాగ్రతలో మన మనసు తన గ్రహింపును అది గమనించుకుంటుంది. అదే మనకు ధ్యానంగా ఆవిష్కరింప బడుతోంది. కాబట్టి మనసు కేవలం ఏకాగ్రతలోనే కాదు సర్వకాల సర్వావస్థల్లోనూ విషయాలను గ్రహించే శక్తిని కలిగిఉంది. కాబట్టి మనం ఆ గ్రహింపుశక్తిని ఎప్పుడైనా గమనించవచ్చు. అలా గమనించే ప్రతిక్షణం మనకు ధ్యానానుభవమే ఉంటుంది. అందుకే పెద్దలు ధ్యానం చేసేదికాదు, అది నీలో ఉన్నదే అంటున్నారు !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
                🌼💖🌼💖🌼
                       🌼🕉️🌼
                            *"శ్రీ"*

దేవుడు శరీరధారి కాడనే’ వేద విద్వాంసులు అంటారు. వేదం ఈశ్వరీయం.

 దేవుడు శరీరధారి కాడనే’ వేద విద్వాంసులు అంటారు.
వేదం ఈశ్వరీయం. అది మానవకృతం కాదు. దేవుడు కర్మలు చేయడు, జీవుడు చేస్తాడు. కర్మలు చేసేవారికి ‘శరీరధారణ’ తప్పదు. కర్మల ఫలాలను అనుభవించడానికి జన్మలెత్తాలి, శరీరధారులం కావాలి. శరీరం వల్ల కలిగే లాభం ఏమిటంటే దానితో కర్మలు చేయవచ్చు. వాటి ఫలాలను అనుభవించవచ్చు. దేవునికి కర్మలు చేయవలసిన పని లేదు.

అనుభవించవలసిన పని అంతకన్నా లేదు. కర్మ చేసేవాడిని ‘కర్త’ అంటారు. కర్మఫలాన్ని అనుభవించేవాడిని ‘భోక్త’ అంటారు. కర్తృత్వం ఎవరిదో భోక్తృత్వం కూడా వారిదే. దేవునిలో ‘కర్తృత్వ భోక్తృత్వాలు’ లేవు. వేద విహిత కర్మలనే చేయాలని ఈశ్వరాజ్ఞ. వేద విరుద్ధ కర్మలను చేస్తే దుఃఖం తప్పదు. జీవునికి కర్మ ఫలాలిచ్చేవాడు దేవుడే. అందుకే దేవుడవసరం. కర్మఫలాలను అనుభవించడానికి మొదట జీవునికి శరీరం కావాలి. తర్వాత అన్నం, ఆ పిమ్మట అనువైన ప్రపంచమూ కావాలి. ఇదే, దేవుడు చేసే పని. దేవుడు సృష్టి రచన చేయకపోతే మనం శరీరధారులం కానే కాం. కర్మలు చేయనే చేయం. సుఖదుఃఖాలను అనుభవించే అవకాశం ఉండనే ఉండదు. పాపపుణ్యాల ప్రశ్నే ఉద్భవించదు. కనుక, జీవుని స్వభావం దేవుని కంటే విలక్షణమైంది.

‘కోరిక, ప్రయత్నం, ద్వేషం, సుఖం, దుఃఖం, జ్ఞానం’- ఈ ఆరు గుణాలు జీవుణ్ని ఆశ్రయించి ఉంటాయి. అందుకే, అతడు మాటిమాటికీ శరీరధారి అవుతాడు. ఒక వస్తువు కావాలని కోరడం, లభించకపోతే ద్వేషభావం కలగడం, వస్తు సంపాదనకు ప్రయత్నించడం, సాధించిన దానితో సుఖపడటం లేదా దుఃఖించడం, సామాన్య జ్ఞానాన్ని కలిగి ఉండటం.. వంటివన్నీ జీవుని విషయంలోనే చూస్తాం. దేవుడు, జీవుడు, ప్రకృతి- ఉనికిగల పదార్థాలు. వీటికీ ఎన్నడూ నాశం లేదు. దేవుడు ‘సృష్టి, స్థితి, లయ’లకు కర్త. ప్రపంచానికి స్వామి. దేవుడు ప్రపంచాన్ని మించి ఉన్నాడు. జీవుడు ప్రపంచంలో భాగస్వామి మాత్రమే. దేవుడు సర్వవ్యాపకుడు, సార్వదేశికుడు. జీవుడు ఏకదేశి. దేవుడొక్కడే, జీవులనేకం. దేవునిలోనే ఈ విశ్వమంతా ఉంది. అంతటా వ్యాపించి ఉన్న దేవునికి అవయవాలను ఎక్కడినుంచి తెచ్చిపెట్టగలం? కనుక, దేవునికి శరీరం అక్కర్లేదు. ‘సపర్యగాత్‌ శుక్రమకాయ మవ్రణ మస్నావిరం...’ అన్నది ‘ఈశావాస్యోపనిషత్తు’. దీని ప్రకారం దేవునికి జీవుని వలె మూడురకాల శరీరాలు లేవు. ‘కారణ శరీరం’, ‘సూక్ష్మ శరీరం’, ‘స్థూల శరీరం’- ఇవేవీ లేనివాడే దేవుడు. కారణజన్ముడు జీవుడేగాని దేవుడు కాడు. జన్మ ఎత్తడానికి దేవునికి ఏ కారణమూ లేదు. జీవునికి మాత్రమే జన్మ ఎత్తే అధికారం ఉంది.

దేవుడు ఎప్పటికప్పుడు జీవుల చేష్టల (కర్మలు)ను గమనిస్తుంటాడు. వాటికి అనుగుణమైన విధంగా ఫలాలిస్తుంటాడు. అందుకుగాను అతడు జీవుల అంతరంగాల్లోను అంతర్యామియై ఉంటాడు. పరమాణువు కంటే సూక్ష్మమైనవాడు. ప్రపంచ పదార్థాలన్నింటా ‘అదృశ్యరూపం’ (అవ్యక్తంగా)లో ఉంటాడు. ‘ఓంకార వాచ్యుడై’ కొలువున్నాడు.
దేవునిలో ‘అసంఖ్యాక ప్రాణుల శిరస్సులు, నేత్రాలు, పాదాలు ఉన్నట్లు’ తెలుస్తున్నది. కానీ, అతనికి శరీరం ఉన్నట్లు లేదు. భూ మండలాన్ని అన్ని వైపుల నుంచి స్పృశిస్తూ, సమస్త జగత్తును మించి ఉన్నాడని తెలుస్తున్నది. అంతటా ఉన్నవాడే మనలోనూ ఉన్నాడు. దేహం లేనివాడే దేహంలో ఉంటాడు. మనం శరీరధారులం కనుక, మన హృదయ కమలాల్లో అంతరాత్మ రూపంలో ఉన్న ఆ పరమేశ్వరుణ్ణి ఉపాసించి, తరిద్దాం.

:::: మానసిక చుట్టాలు ::::

 *::::::::: మానసిక చుట్టాలు ::::::::*

  మన ఇళ్ళకి చుట్టాలు వస్తారు. మనం వారిని ఆహ్వానించి, సకల మర్యాదలు చేసి పంపిస్తాము. పిల్లలైతే చుట్టాలు వస్తే తెగ సంతోషిస్తారు.

  ఇంటికి చుట్టాలు వచ్చినట్లు మనస్సుకి కూడా చుట్టాలు వుంటారు. వస్తారు.
   వాళ్ళే కోపం, భయం, ఆందోళన, అలజడి, అభద్రతా భావం, పిచ్చి పిచ్చి ఆలోచనలు, గొంతెమ్మ కోరికలు ,పేరాశలు, గత జ్ఞాపకాలు,ఊహలు, అనుమానాలు, అవమానాలు, మానసిక గాయాలు, బంధాలు.మొదలగునవి.
    ఇంటి చుట్టాలకి మర్యాదలు చేసినట్లు, మనస్సు చుట్టాలకి మర్యాదలు చేస్తే వీళ్ళు వదలరు జాగర్త.
   మర్యాదలు అంటే వీటిని నిరసించడం, వద్దు అనడం, వాదన వేసుకోవడం, వెళ్ళు వెళ్ళు అనడం, తాదాత్మ్యం చెందడం,
    వాటి పట్ల మన వైఖరి జాగర్త గా లేక పోతే మనలను శీలం రహితుడని చేస్తాయి. డిప్రెషన్ లో పడ వేస్తాయి.
వీటి పట్ల డిటాచ్ గా వుండండి.
డిటాచ్ గా వుండుటే ధ్యానం.
*షణ్ముఖానంద 98666 99774*

Tuesday, May 2, 2023

::: జననం-బ్రతుకు -స్వేచ్ఛ ,మరణం:::

 *::: జననం-బ్రతుకు -స్వేచ్ఛ ,మరణం::*

     భావాల *గర్భంలో* నేను అన్నది తయారు అయి నేనుగా కనబడతాను  
  ఇది *జననం*

        సమాజం యొక్క *గర్భం లో* నేను బాగా తయారు చేయబడి ప్రవర్తిస్తాను.   ఇది *బ్రతుకు*

         ధ్యాన *గర్భం* ఈ మనో శారీరక వ్యవస్థ ని 
 మానవీయంగా తయారు చేస్తుంది.  ఇది *స్వేచ్ఛ*
     మనస్సు గర్భం లో ఎప్పటి కప్పుడు జ్ఞాపకాల నుండి విడుదల పొందుతాను.
ఇది మానసిక *మరణం*

*షణ్ముఖానంద 9866699774*

మనం శరీరాన్ని ఒక్కదాన్నే అంటి పెట్టుకుంటే స్వర్గ న్యాయమైన దయ పని చేయదు. మనం లోపలికి ప్రయాణించడం అంటే ధ్యానంలోకి వెళ్ళడం. మనం శరీరం కాని దాని పట్ల స్పృహతో వుండాలి. అది శరీరంలో వుంది. కానీ అది శరీరం కాదు. శరీరం ఆలయం. కానీ దేవుడు కాడు.

 *🌹. నిర్మల ధ్యానాలు - ఓషో  - 341 🌹*
*✍️.  సౌభాగ్య  📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. మనం శరీరాన్ని ఒక్కదాన్నే అంటి పెట్టుకుంటే స్వర్గ న్యాయమైన దయ పని చేయదు. మనం లోపలికి ప్రయాణించడం అంటే ధ్యానంలోకి వెళ్ళడం. మనం శరీరం కాని దాని పట్ల స్పృహతో వుండాలి. అది శరీరంలో వుంది. కానీ అది శరీరం కాదు. శరీరం ఆలయం. కానీ దేవుడు కాడు. 🍀*

*రెండు పదాల్ని గుర్తుంచుకో. ఒకటి గురుత్వాకర్షణ. రెండోది దయ. మొదటిది భూమి లక్షణం అది. వస్తువుల్ని కిందకు లాగుతుంది. దయ స్వర్గ సంబంధి. అది వస్తువుల్ని పైకి లాగుతుంది. సైన్సు భూమ్యాకర్షణని కనిపెట్టింది. మతం దయను కనిపెట్టింది. మనం జన్మించి గురుత్వాకరణలో బతుకుతాం. మన జీవితమంతా కిందికి లాగబడుతూ వుంటుంది. సజీవంగా మొదలై మన బతుకు మరణంతో ముగుస్తుంది. వ్యక్తి తన లోపలికి ప్రయాణించకుంటే దయ తన పని ప్రారంభించదు.*

*మనం శరీరాన్ని ఒక్కదాన్నే అంటి పెట్టుకుంటే స్వర్గ న్యాయమైన దయ పని చేయదు. మనం లోపలికి ప్రయాణించడం అంటే ధ్యానంలోకి వెళ్ళడం. మనం శరీరం కాని దాని పట్ల స్పృహతో వుండాలి. అది శరీరంలో వుంది. కానీ అది శరీరం కాదు. శరీరం ఆలయం. కానీ దేవుడు కాడు. ఒకసారి నువ్వు లోపలి దేవుడి పట్ల స్పృహతో వుంటే రెండో న్యాయం అంటే స్వర్గసంబంధ న్యాయం పని చేయ్యడం ప్రారంబిస్తుంది. నిన్ను పైకి లాగుతుంది. జీవితం మరింత విశాలమవుతుంది. దానికి ఆకాశం కూడా హద్దు కాదు. ఆ రహస్యం ధ్యానంలో ఉంది.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

::::: స్వేచ్ఛగా జీవించ గలమా?:::::

 *:::::: స్వేచ్ఛగా జీవించ గలమా?::::::*

       మనం ఒక పని చేసేటప్పుడు ఆ పని ఏమిటి? ఎలా చేయాలి? ఎందుకు చేస్తున్నాము? అనే వివరాలు మనం ముందుగానే తెలుసు కుంటాము. 

     అలాగే మన కళ్ళు, చెవులు,  ముక్కు, నాలుక, చర్మం, మనస్సు, ఇవి వాటి వాటి విషయాలతో సంపర్కం లోకి వచ్చినప్పుడు ఇదే జరుగుతుంది.  ఉదా.. కన్ను, ఏమి చూడాలి?,ఎలా చూడాలి? ఎందుకు చూడాలి? అనే జ్ఞానంతో, చూస్తుంది.

     అప్పుడు ఉన్నది చూడటం  కాక , తాను ఏమి చూడాలో, ఎలా చూడాలో, అలా చూస్తుంది.  అనగా చూపు జ్ఞాన సహాయం తో ప్రభావం చెంది వున్నది. అప్పుడు కన్ను చూచేది అంతకు ముందు వున్న దానినే కాని ఇప్పుడు వున్న దానిని కాదు.
      ఈ రకంగా మన జీవితం, మనం ఎందుకు జీవించాలి? ఎలా జీవించాలి? అని మనకు సమాజం అందించిన జ్ఞానం ఆధారంగా జీవిస్తున్నామే కాని  మన జీవితం మనం  ఇష్ట పడే లాగా, మనదై,  స్వతంత్రమై, స్వేచ్ఛగా లేదు.

 *షణ్ముఖానంద 98666 99774*

మనస్సు వాసనలు వీటి ప్రభావం మనపైన ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం

 మనస్సు వాసనలు వీటి ప్రభావం మనపైన ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం

విషయాత్మికమైన అంతఃస్థిత మనోవృత్తియే వాసన. మనుష్యుడు ఏదైనా కార్యమును చేసినా చెయ్యకపోయినా, అతని మనస్సులోని కోరికను బట్టియే స్వర్గ ఫలమో నరక ఫలమో కలుగుతుంది. తత్త్వ జ్ఞానము కలిగినవానికి వాసనలు శిథిలమైపోతాయి. అంతేకాక అతడు తన సర్వకర్మ ఫలమైన ఆత్మకంటె భిన్నమైన అనుభవమును పొందుతాడు. వాసనలోనే జగత్‌ జాలమంతా ఉన్నది.

వాసనలతో దృఢమైన చిత్తము తనలో ఎవరిని చూడలేదు. వాసనలు శాంతించినచో, చిత్తము మూడు లోకాలను తృణప్రాయంగా చూస్తుంది. వాసనలు క్షీణించకపోతే, ఏ స్థితిలోను చిత్తవృత్తులను నిరోధించలేదు. వాసనలు నశించకపోతే తత్త్వజ్ఞాన లాభం కలుగదు.

మరి తత్త్వజ్ఞానము, చిత్తనాశము, వాసనాక్షయము ఇవన్నీ పరస్పరము ప్రకాశించటానికి చాలా కష్టమును కలిగిస్తాయి. వాసనాక్షయము, చిత్తనాశము, తత్త్వజ్ఞానము ఇవన్నీ ఒకే సమయంలో కోరిన ఫలాన్ని ఇస్తాయి. అందువలననే ఈ మూడింటిని ఒకేసారి నాశనం చేసే ప్రయత్నం చెయ్యాలి.

బుద్ధి...

బుద్ధి జగద్వ్యాపి కాదు. కాని అది కొన్ని పరిధులు ఉన్న స్థానాలలో వ్యాపించి ఉంటుందనేది నిశ్చయము. కనుక బుద్ధి ఒక వస్తు విశేషము. అంతేకాక అది ఒక విలక్షణమైనది. ప్రతి వారికీ ఇంతో అంతో బుద్ధి ఉంటుంది. కాని ఎవరికి బుద్ధి ఒక పరిమితి వరకే వ్యాపించి ఉంటుందని విశదమవుతుంది. కనుక బుద్ధి సాకారమైనదే కదా.. అందులో ఎలాంటి సందేహమూ లేదు. బుద్ధియే మంచి చెడులను గురించి ఆలోచిస్తుంది.

ఉత్కృష్టమైనదో నికృష్టమైనదో కోరేది కూడా బుద్ధియే. అంతేకాక, నానా విధములైన నూతన వస్తువులనూ ఆవిష్కరిస్తూ ఉంటుంది. ఎవరైనా ఒకరు విద్యలేనివాడైన్పటికీ, బుద్ది గలవాడయితే అతడు తన పనులన్నీ చేసుకోగలుగుతాడు. కాని బుద్ధి లేకపోయినా విద్య లేకపోయినా గట్టి పరిశ్రమను చేసి కొంత విద్యను సంపాదించినా అది విశేష కార్యం కాదు. బుద్ధి జీవ శరీరంలో అద్దంలాంటిది.

తృష్ణ...

తృష్ణ మనుష్యుని ఎంతగా దహిస్తుందంటే, ఆ మంటను అమృతం కూడా ఆర్పలేదు. తృష్ణయే మనిషిని భయభ్రాంతుని, దుఃఖితుని, గ్రుడ్డివానిని చేస్తుంది. తృష్ణయే అలభ్యమైన వస్తువు మీద ఆసక్తిని కలిగిస్తుంది. దొరకదని తెలిసి కూడా, ఆ విషయాన్ని ఆకాంక్షిస్తుంది. అంతేకాక ఒక చోట అది స్థిరంగా ఉండదు. అంతఃపురంలో ఉండేవారిని కూడా అతి కష్టమైన ప్రదేశాలకు అది తీసుకొనిపోతుంది.
ఈ తృష్ణయే ఆత్మతత్త్వాన్ని ఆచ్ఛాదించి, మనిషిలో ఎక్కువ అజ్ఞానాన్ని సృష్టిస్తుంది. తృష్ణలోనే మనస్సు చిక్కుకొని ఉన్నది. తృష్ణయే మోహంతో నిండిన ఏనుగును కూడా బందిస్తుంది. తృష్ణయే జరామరణ దుఃఖములకు కారణము.

చింత...

చింతన త్యజించ గలిగితే మనుష్యుడు సమస్త దుఃఖాలను తరించగలుగుతాడు. చింత అనంతకాలం వరకూ అన్ని విషయాలలోనూ ఆసక్తిని కనబరుస్తుంది. చింతన ఛేదించటం దుస్సాధ్యమన పనే అయినప్పటికీ జ్ఞానులు వివేకమనే ఖడ్గంతో దానిని ఛేదిస్తారు. తత్త్వజ్ఞానోదయం కానంత వరకూ చింత వదిలిపోదు. అట్లాగే చింత శాంతించనంత వరకూ తత్త్వజ్ఞానం కలుగదు. చింతకు సొంత సోదరుడు ధనము. మనం ఎట్లా ధనవంతులం అవుతాము.. ఏ ఉపాయాన్ని అవలంభిస్తే ధనోపార్జన అవుతుంది.. ఇలాంటి చింతల తోనే మనుష్యులంతా జీర్ణించిపోతున్నారు. చింత అన్ని సమయాలలోనూ అస్థిరంగానే ఉంటుంది.

ఒక చింత తరువాత మరొక చింత ఎక్కడి నుంచి వస్తుందో సరిగ్గా చెప్పలేము. అందువలననే చింతకు అంతం లేదు. చింతాశూన్యుడైన మనిషీ లేడు. మనిషి ఎలాంటి చింతా లేకుండా గడిపిన రోజు ఏ ఒక్కటీ ఉండదు. చింత వలన శరీరము జీర్ణించిపోతుంది. అట్లాగే చింత సమాప్తికాగానే ముక్తిమార్గం సుగమమవుతుంది.

మాయ...

మాయ జగత్తు యొక్క ఉత్పత్తికి కారణము. ఈ మాయ చేతనే వివేకము కప్పబడి ఉంటుంది.
ఈ మాయ ఏమిటనేది తెలుసుకోలేని విషయము...

ఈ జగత్తు అత్యద్భుతమైనది. వివేకంతో నడవకపోతే మాయ వృద్ధి చెందుతుంది. అట్లాగే వివేక దృష్టితో చూస్తే ఏమీ ఉండదు. ఈ మాయా స్వరూపం అవగతం కాకపోవటం వలన దాని మాహాత్మ్యమును అనుభవించలేము.
సంసార బంధనం కోసం ఈ మాయ ఆశ్చర్యజనకమైన పనులు చేస్తుంది. ఎందుకంటే, ఈ మాయ ఎప్పుడూ అసత్యమైనదే అయినా.. అది సత్యంలాగానే అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది. ఈ సంసార రూపమైన మాయ పరమ పదమునకు భిన్నంగా ప్రవర్తిస్తుంది.
ఈ మాయకు పారమార్థిక సత్తా లేదు. ఒకవేళ నీవు ఏకాగ్ర చిత్తుడవై భావనాబలంతో ఆత్మయొక్క వాస్తవిక స్వరూపాన్ని తెలుసుకోగలిగితే అప్పుడు నీకు అన్ని విషయాల మర్మములు అవగతమవుతాయి..

నాద యోగం - సమాధి స్థితి - దశ విధ నాదాలు

 *నాద యోగం - సమాధి స్థితి - దశ విధ నాదాలు*
~~~~

సాధకుడు ఎడతెగని నిష్ఠతో సాధనలో ఉన్నపుడు....

కుండలినీ శక్తి మేల్కొని, అనాహత చక్రం చైతన్య వంతమైతే "దశ విధ నాదాలు" అనుభవానికి వస్తాయి.

కుండలినీ శక్తి ఆజ్ఞా చక్రంలో స్థిర పడితే, రక రకాల కాంతులు అనుభవానికి వస్తాయి. ఈ కాంతులనే "చిత్కళలు" అంటారు. కూటస్త చైతన్యమునే "బిందువు" అంటారు. అయితే ఇవన్నీ లయం కావలసిందే. అప్పుడు నిర్వికల్ప సమాధి సిద్ధించును.

నాద యోగాభ్యాసంలో భాగంగా,  ప్రణవ సాధన చేసేవారికి 

మొదటి దశలో....

లోపలి నాదం అనేక రకాలుగా వినిపిస్తుంది. నిరంతరం, దీక్షగా అభ్యాసం చేస్తూ ఉంటే, చివరికది సూక్ష్మ నాదంగా పరిణమిస్తుంది. ప్రారంభంలో, లోపల నుండి (1). సముద్ర ఘోష  (2). మేఘ ఘర్జన (3). భేరీ నాదం (4). నదీ ప్రవాహం చప్పుడు వినిపిస్తుంది. అయితే ఈ నాదాలు ప్రణవం యొక్క వివిధ పరిణామ రూపాలే. 

సాధన మధ్య దశలో 

1. మద్దెల శబ్దం 2. ఘంటా నాదం 3. కాహళ నాదం వినిపిస్తాయి. ఇవన్నీ, కుండలినీ శక్తి జాగృతిలో, "నాదానుసంధాన" యోగ సాధనలో, ధ్యానావస్థల్లోని పరిపూర్ణ దశలలో వినిపించే నాదాలివి. ఈ ప్రణవ అభ్యాసం చివరి దశలో, చిరుమువ్వల చప్పుడు, మధురమైన వేణు గానం, తుమ్మెద ఝంకారం లాంటి వివిధ నాదాలు అత్యంత సూక్ష్మంగా సాధకునికి వినిపిస్తాయి. 

సాధకుడు, తన సమాధి స్థితిలో నాదాన్ని వింటూన్నపుడు, మధ్యలో మహాభేరీ నాదాలు కూడా వినపడతాయి. ఆ సమయంలో, దాని వెనుకే అత్యంత సూక్ష్మ నాదాలు వినపడతాయి. ఈ నాదాలను కూడా జాగ్రత్తగా వినాలి. సూక్ష్మ నాదాలు వింటూ పెద్ద ధ్వనులను విడిచి పెట్టాలి. అలాగే పెద్ద ధ్వనులు వినేటపుడు, సూక్ష్మ నాదాలు విడిచి పెట్టాలి. ఇలా నిరంతరం నాదాభ్యాసం చేస్తున్నపుడు, మనస్సు ఒక నాటికి ఏదియో ఒక నాదంపై ఏకాగ్రతను పొంది, మనోలయం జరుగుతుంది. మనోలయమే కదా, కావలసింది.

గ్రంథం: జ్ఞానధార... రచన: జ్ఞానశిశువు

 గ్రంథం: జ్ఞానధార...
రచన: జ్ఞానశిశువు 
__

       ఉండు
__

అనవసర వ్యవహారాలను ఇంట్లోకి తేవద్దు.
అనవసర ఆహారాలను వంట్లోకి త్రోయొద్దు.

( అంటే ఊళ్లో వ్యవహారాలన్నీ ఇంట్లోకి తేవద్దు, రుచికోసం తినకు శుచి గా ఉన్నవి తగుమాత్రంగా తినమని)

శరీరం ఆరోగ్యంగా ఉంటే 
శరీరం ఉన్నా లేనట్టుగానే ఉంటుంది.

( అంటే రోగం ఉన్నప్పుడే శరీర బాగాలు గుర్తొస్తాయి, ఆరోగ్యం గా ఉన్నప్పుడు ఏమీ గుర్తురావు అనీ )

మనసు నిర్మలంగా ఉంటే 
మనసు ఉన్నా లేనట్టుగానే ఉంటుంది.

( కొంతమందికి తలంపుల రూపంలో మనసు వేధిస్తుంది, ఒకోసారి ఏ కారణం లేకుండా సంతోషంగా, శాంతిగా అనిపిస్తుంది అప్పుడు మనస్సు అనేది ఒకటుందనే గుర్తురాదు కదా!!)

నీ నివాసం కంటే గొప్ప ఆశ్రమం మరొకటి లేదు.
నీ దేహం కంటే గొప్ప దేవాలయం మరొకటి లేదు.
నీ మనసు కంటే గొప్ప దైవం మరొకటి లేదు.

( మనల్ని పాడు చేసినా బాగు చేసినా మనసే, దాన్ని ఉపయోగించుకోవటంలో ఉంటుంది, ఉపయోగించుకుంటే మోక్షానికి దానికి మించిన సహాయకారి మరకటి లేదు, కాబట్టి మనసు కూడా దైవంతో సమానం )

మిక్కిలి స్వార్థంగా జీవించు.
నీ ఆనందం కోసమే ప్రతీక్షణాన్ని వినియోగించు.

(ఇక్కడ ఆనందం అంటే బాహ్యమైన ఆనందం కాదు, ఆ ఆనందాలన్నీ కూడా ఏదో ఒక దాని మీద ఆధారపడి వచ్చేవి, అటువంటి భ్రమతో కూడుకున్న  ఆనందం మీద కాదు ఆత్మానందం మీద ఆధారపడి బ్రతకమని)

లోకసేవ పెద్ద అబద్ధం అని తెలుసుకో.
కుటుంబసేవే దేశసేవ అని తెలుసుకో.

( ముందు ని కుటుంబాన్ని ఉద్దరించుకో అది ని బాధ్యత అనీ..)

విశ్వానికి కేంద్రం నీవు.
నీవొక్కడివి ఆనందంగా ఉంటే,
ఆ ఆనందం విశ్వవ్యాప్తం అవుతుంది.

(స్వపరివర్తనే విశ్వ పరివర్తన అనీ) 

నీ మనశ్శాంతే
ప్రపంచశాంతి.

( మన అశాంతే ప్రపంచంలోని అనర్ధాలకు కారణం, నువ్వు శాంతిగా ఉంటే ప్రపంచానికి శాంతినివ్వగలరు నీకు లేనిది ప్రపంచానికి ఎలా ఇస్తావ్ అనీ )

ధర్మంతో నడువు.
సత్యంతో గడుపు.

అన్ని రకాల ప్రశ్నలనూ వదులు.
ప్రశ్నించిడం నీ స్వభావం కాదు.
అన్ని ప్రశ్నలకూ సమాధానం నీవు.

నీకు నీకు ఒక్క అడుగు ఎడంగా ఉండు.
లేదా
సర్వమూ నీవే అయి ఉండు.

గంగలో మునగడం కాదు,
నీలో నీవు మునుగు. (అంటే అంతర్ముఖం అవ్వమని)    
తెరను(ఆత్మను) గుర్తులో ఉంచుకొని 
ప్రపంచ సినిమా చూడు.

మనసారా ఏడువు.
కడుపార నవ్వు.

చివర్లో ఇదంతా ఓ నాటకం అనుకుని 
అన్నీ దులుపుకుని స్వంతగూటికి(హృదయానికి) చేరుకో.

ఈ జగత్తొక స్వప్నం.
మహర్షి నేనే, నీచుడూ నేనే అని ఉండు.

( కుడి చెయ్యి నీదే ఎడం చేయి నీదే కదా!!)

ఎవరి అభిప్రాయాలనూ నీ మెదడులో నింపకు.
ఎవరినీ నీ అభిప్రాయాలతో చంపకు.

నీ చెవులను ఎవరికీ అప్పగించకు.
నేను-ఉన్నాను అని నీలో వినబడే మాటను విను.

నీ చూపును ఏ దృశ్యాలకూ అంకితం చేయకు.
నీలోని ద్రష్టను పరికించి చూడు.

వెలుపల ఉంటే ప్రశ్న తెగదు.
లోపల ఉంటే ప్రశ్న పుట్టదు.

వెలుపల నటించు.
లోపల జీవించు.

నిత్యవ్యవహారంలో ఉన్నట్టే ఉండాలి.
మనసెప్పుడూ "నేను" పైనే కేంద్రీకరించి ఉండాలి.

అందరికీ నీవు ఉన్నట్టే ఉండు.
నీకు నీవు లేనట్టు ఉండు.

(నీ జీవితాన్ని కూడా ఒక సినిమాలా చూడు దానితో కలసిపోకు అనీ )

"ఉండు" అంతే.
అలా ఇలా ఉండొద్దు.

( I AM SO AND SO అంటే నేను పలానా అది చేశాను, ఇదీ చేశాను, అంతటి వాడిని, ఇంతటి వాడిని అనుకోకు అనీ, BE STILL AND KNOW THAT I AM GOD, "ఉండు" I AM THAT I AM అంతే..)
* * *
జ్ఞానశిశువు

నిర్వాణషట్కం

 నిర్వాణషట్కం

మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము నేను కాను...
చెవి, నాలుక, ముక్కు, కన్ను నేను కాను...
ఆకాశము, భూమి, నిప్పు, గాలి నేను కాను...
చిదానంద రూపుడైన శివుడే నేను...శివుడే నేను...
* * *
ప్రాణము నేను కాను...

ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన మనే
పంచప్రాణములూ నేను కాను...

రక్త, మాంస, మేధో, అస్థి, మజ్జా, రస, శుక్రములనే 
సప్తధాతువులూ నేను కాను...

అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయములనే
పంచకోశములూ నేను కాను...

వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థలనే 
కర్మేంద్రియములూ నేను కాను...

చిదానందరూపుడైన శివుడే నేను...శివుడే నేను.
* * *
నాకు ద్వేషమూ లేదు...అనురాగమూ లేదు...
నాకు లోభమూ లేదు...మోహమూ లేదు...
మదమూ లేదు...మాత్సర్యమూ లేదు...
ధర్మమూ లేదు...అర్థమూ లేదు...
కామమూ లేదు...మోక్షమూ లేదు...
చిదనందరూపుడైన శివుడే నేను...శివుడే నేను...
* * *
నాకు పుణ్యమూ లేదు...పాపమూ లేదు...
సుఖమూ లేదు...దుఃఖమూ లేదు...
మంత్రమూ లేదు...తీర్థమూ లేదు...
వేదములూ లేవు...యజ్ఞములూ లేవు...
నేను భోజనము కాను...తినతగిన పదార్థము కాను...
తినేవాడనూ కాను...
చిదానందరూపుడైన శివుడే నేను...శివుడే నేను...
* * *
నేను మృత్యువునూ కాను...సందేహమూ కాను...
నాకు జాతి భేదమూ లేదు...
నాకు తండ్రీ లేడు...తల్లీ లేదు...జన్మా లేదు...
బంధువూ లేడు...మిత్రుడూ లేడు...
గురువూ లేడు...శిష్యుడూ లేడు...
చిదానందరూపుడైన శివుడే నేను...శివుడే నేను...
* * *
నేను నిర్వికల్పుడను..నిరాకారుడను...
సర్వత్రా వ్యాపించి ఉన్నాను...
ఇంద్రియములతో నాకు సంబంధము లేదు...
మోక్షమూ లేదు...బంధమూ లేదు...
చిదానందరూపుడైన శివుడే నేను...

* * *
ఇది ఆది శంకరుల నిర్వాణషట్కం🙏🏻

****ఆత్మానుభూతి అంటే ఏమిటి అది ఎలా అనుభవిస్తాము.!

 ఆత్మానుభూతి అంటే ఏమిటి
అది ఎలా అనుభవిస్తాము.!

ఆనందం మానవుని సహజస్థితి, వాస్తవస్థితి. కానీ, నేడు అనేకమంది తమ సహజస్థితి తెలుసుకోలేక ప్రాపంచిక సుఖసంతోషాలే ఆనందమన్న భ్రాంతిలో మనుగడ సాగిస్తున్నారు. నిజానికి సుఖం, సంతోషం, ఆనందం.. ఒకేలా చెప్పేస్తున్నా, ఇవి మూడు రకాల అనుభూతులు...

1) పంచేంద్రియాలను సంతృప్తి పరిచే 'సుఖానుభూతి' శారీరకమైనది.

2) వినోద భరితమై మనస్సును ఉత్సాహ పరిచే 'సంతోషానుభూతి' మానసికం.

3) వీటికి అతీతమైంది "ఆనందానుభూతి" ఆత్మ సంబంధితం.

ఆనందం, ఆధ్యాత్మికం, బాహ్య ప్రపంచముతో సంబంధంలేని అంతర్గత అనుభూతి...
సుఖానుభూతి కట్టిపడేస్తుంది, సంతోషానుభూతి చిరుస్వేచ్చనిస్తుంది, ఆనందం పరిపూర్ణమైన స్వాతంత్ర్యం.

శారీరకస్థాయిని, మానసికస్థాయిని దాటి హృదయస్థాయికి వచ్చినప్పుడే ఆనందం అనుభవమై ఆత్మస్థాయికి వస్తాం...

మొదటిది బంధం,
రెండవది తాత్కాలితం,
మూడవది శాశ్వతం...

మొదటి రెండిటిని పట్టుకున్నవాడు జనన మరణాల చక్రంలో పరిభ్రమిస్తునే ఉంటాడు, కానీ పరమానందస్థితికి వచ్చిన వాడు అమృతమయుడే అని అంటాడు బుద్ధుడు...

ఆనందముగా జీవించడానికి హంగులు అవసరం లేదు, ఆర్ధిక స్థితి గతులు అవసరం లేదు, అవగాహనతో మనమున్నస్థితిని అంగీకరించడం, ఏ పరిస్థితులోనైన సమస్థితిలో వుండగలగడం...
అన్నీ.. అందరూ.. పరమాత్ముని అనుగ్రహమేనన్న భావనతో వుండగలగడం అలవర్చుకోవాలి...

మన భావాల పట్ల, మనలో ఉన్న ఆంతర్యామి పట్ల, మనకు అమరిన లేదా అమర్చుకున్నవాటి పట్ల, మన చుట్టూ ఉన్నవారందరిలో వున్న ఆంతర్యామిపట్ల ఎరుకతో వుండడం నేర్చుకోవాలి.
ఇది అలవడిననాడు అనుక్షణం మనం ప్రార్ధనలో వున్నట్లే, ఆనందంగా వున్నట్లే, ఆంతర్యామితో వున్నట్లే...

ఆనందాన్ని మానుషం, దివ్యం అంటూ రెండు రకములు, (తైత్తిరీయోపనిషత్.. ఆనందవల్లి.. )

మొదటి కొస మానుషమైతే రెండవ కొస దివ్యం...

మొదటి కొస నుండి రెండవ కొసకు చేసే పయనమే ఆధ్యాత్మిక ప్రయాణం...

మొదటి కొస నుండి రెండవ కొసకు చేరడానికి చేసే ప్రయత్నమే ఆధ్యాత్మిక సాధన...

వ్యక్తిచేతన నుండి దివ్యచేతన వైపు సాగిపోవడమే మానవజన్మకు సార్ధకత...

మానుషమైన ఆనందం నుండి దివ్యమైన ఆనందం లోనికి చేరుకోవడమే పరమార్ధకత...

ఆనందం, దివ్యానందం, పరమానందం, సచ్చిదానందం, ఆత్మానందం... పేరు ఏదైతేనేం.. అన్నీ ఆ ఏకైక దైవికమైన సత్యస్థితిని తెలియజెప్పేవే,
ఎక్కడ అహం (నేను) వుండదో అక్కడే ఆనందం వుంటుంది, మనలోపలే వున్న ఆనందాన్ని అందుకోవడానికి అంతర్ముఖులం కావాలి... అప్పుడే అర్ధమౌతుంది ఆనందమే చైతన్యమని...

ఆ అన్వేషణలో తెలుస్తుంది 'సత్ చిత్ ఆనందం'...

సత్ అంటే సత్యం,
చిత్ అంటే చైతన్యం,
ఆనందమంటే పరమానందం..

ముందుగా సత్యమును తెలుసుకుంటాం, తర్వాత ఇంకా లోతుల్లోనికి పయనిస్తే చైతన్యమును తెలుసుకోగల్గుతాం, అటుపిమ్మట అనుభవమైనదే "ఆనందస్థితి"...
ఇలా ఆనందమును తెలుసుకున్నవారు (ఆనందం బ్రహ్మనో విద్వాన్) ఆత్మను స్పృశించగలరు (నయఏవం విద్వానే తే ఆత్మానం స్పృణతే).

ఆనందమునకు సోపానములు ఫలాపేక్ష లేకుండా పనిచేయడం...
అందరిలో అంతర్యామిని గుర్తించడం...
ఏ క్షణంకాక్షణం వర్తమానంలో జీవించడం, భూతదయ, సేవాదృక్పధం కలిగివుండడం...🙏

జీవితం ప్రతిక్షణం కొత్తదే. అది పాతది కారు. అస్తిత్వమన్నది యిప్పుడు యిక్కడ వున్నదేదయితే వుందో అది. దాని గతంలో, భవిష్యత్తుతో సంబంధం లేదు. ఈ క్షణానికి నువ్వు అక్కడ వుంటావు. అక్కడ కలయిక వుంటుంది. అదే సత్యం.

 *🌹. నిర్మల ధ్యానాలు - ఓషో  - 337 🌹*
*✍️.  సౌభాగ్య  📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. జీవితం ప్రతిక్షణం కొత్తదే. అది పాతది కారు. అస్తిత్వమన్నది యిప్పుడు యిక్కడ వున్నదేదయితే వుందో అది. దాని గతంలో, భవిష్యత్తుతో సంబంధం లేదు. ఈ క్షణానికి నువ్వు అక్కడ వుంటావు. అక్కడ కలయిక వుంటుంది. అదే సత్యం. 🍀*

*జనం అనుకూలాల్లో జీవిస్తారు. వాళ్ళకు సత్యమక్కర్లేదు. వాళ్ళకు ఓదార్పు కావాలి. అందువల్ల వాళ్ళు మూఢ నమ్మకాలకు, సంప్రదాయాలకు, నిర్ణయాలకు కట్టుబడి వుంటారు. ఎందుకంటే మార్కెట్లో పాత'కు ఒకరకమయిన గౌరవం, గిట్టుబాటు వుంటుంది. వాళ్ళు పాతది బంగారంతో సమానమంటారు. అది నిజం కాదు. బుద్ధిహీనులకు, పిరికివాళ్ళకు పాతది బంగారంలా కనిపిస్తుంది. జీవితం ప్రతిక్షణం కొత్తదే. అది పాతది కారు.*

*అస్తిత్వమన్నది యిప్పుడు యిక్కడ వున్నదేదయితే వుందో అది. దాని గతంలో, భవిష్యత్తుతో సంబంధం లేదు. ఈ క్షణానికి నువ్వు అక్కడ వుంటావు. అక్కడ కలయిక వుంటుంది. అదే సత్యం. నేను సత్యాన్ని ప్రనేమతో కలవమంటాను. సత్యం ఎక్కడికి తీసుకెళితే అక్కడికి వెళ్ళమంటాను. అక్కడ ఏదయినా వదిలేయాల్సి వస్తే వదిలెయ్యాలి. అది సత్యం పట్ల ప్రేమ వున్నపుడే వీలవుతుంది. ప్రేమ ఏమయినా చేస్తుంది. ప్రేమ దేన్నయినా త్యాగం చేస్తుంది. సత్యం సంపూర్ణ త్యాగాన్ని కోరుతుంది.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

ధ్యానం యొక్క మొత్తం మనస్తత్వ శాస్త్రం

 *🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 72 / DAILY WISDOM - 72 🌹*
*🍀 📖. బృహదారణ్యక ఉపనిషత్తు నుండి  🍀*
*✍️.  ప్రసాద్ భరద్వాజ*

*🌻 12. ధ్యానం యొక్క మొత్తం మనస్తత్వ శాస్త్రం 🌻*

*ధ్యానం యొక్క మొత్తం శాస్త్రం ఆలోచనలో లోపాలను సరిదిద్దడం తప్ప మరొకటి కాదు. ఈ పద్ధతుల వివరాలను మనము మరింత ముందుకు సాగేటప్పుడు పరిశీలిద్దాము. కాబట్టి, విషయానికి వస్తే, వ్యక్తి యొక్క దుఃఖాన్ని తొలగించే ఉద్దేశ్యంతో వ్యక్తిగత జీవుడు మరియు విశ్వపదార్ధం మధ్య ఉన్న ఈ వేర్పాటు వాదాన్ని తొలగించాలి. ధ్యానం అనేది వ్యక్తిని దుఃఖం నుంచి బయటకు తీసుకు రాగల సాధనం. ఈ దుఃఖం తన వ్యక్తిగత అస్తిత్వం లోనుంచి ప్రపంచాన్ని వేరు చేయడం వల్ల వచ్చింది.*

*ఈ ప్రయోజనం కోసం, ధ్యానం లోకి సాధకుడు ప్రవేశిస్తాడు. ఇక్కడ చెప్పబడిన విషయం త్యాగ సంబంధమైనది. కాబట్టి ఇక్కడ ఆ ఉద్దేశానికి కర్మ సంబంధంగా అశ్వమేధ యాగం చెప్పబడింది. అశ్వమేధ యాగంలో భౌతికంగా ఒక యాగాశ్వం ఉన్నపటికీ, మానసిక తలంలో ఆ అశ్వం మన విశ్వంలో ఏ జీవి అయినా కావచ్చు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 72 🌹*
*🍀 📖  The Brihadaranyaka Upanishad 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 12. The Entire Psychology of Meditation 🌻*

*The entire psychology of meditation is nothing but a setting right of errors in thought; and the details of these methods we shall be considering as we proceed further. So, to come to the point, this distinction between the individual unit and the Universal Substance is to be abolished for the purpose of the removal of the sorrow of the individual. Meditation is the technique of the removal of sorrow in the sense that sorrow is caused by the segregation of the individual from the world outside.*

*For this purpose, one enters into the technique of meditation. Now, here, the context being sacrifice, we are given a method which is ritualistic in its nature, and thus the ritualistic horse of the Asvamedha Sacrifice becomes an object of contemplation, literally, liturgically as an animal in the sacrifice, but psychologically and spiritually as an element like any other element in creation as a whole.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

మానవ జీవితానికి - ప్రశాంతత ఎలా లభిస్తుంది

 ప్రశాంతత

మానవ జీవితానికి - ప్రశాంతత ఎలా లభిస్తుంది
జనక మహారాజు ఓ జ్ఞాని వద్దకు వెళ్లి.. "నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను" అన్నాడు..

"నువ్వు నీ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించడం లేదా.." అని అడిగారు ఆ జ్ఞాని.. అష్టావక్ర మహర్షి

"మా రాజ్యానికి శత్రు భయం లేదు. దొంగల భయం లేదు. మా రాజ్యంలో పన్నులు తక్కువే. న్యాయ వ్యవస్థ కూడా బాగుంది. ఎక్కడా ఎవరికీ అన్యాయం జరగదు.
ప్రజలందరూ ఆనందంగా ఉంటున్నారు. కానీ నాకే ప్రశాంతత లేదు. నేను ఏం చెయ్యాలి" అని రాజు ప్రశ్నించాడు.

"సరే నీ బాధ అర్ధమైంది. నేనొకటి చెప్తాను. అలా చెయ్యి. నీ రాజ్యాన్ని నాకు ఇచ్చేసే" అన్నారు జ్ఞాని." అంతకన్నా ఇంకేం కావాలి.. "తీసుకోండి.. ఈ క్షణమే ఇచ్చేస్తున్నాను నా రాజ్యాన్ని" చెప్పాడు రాజు.

"సరే నాకిచ్చావు, నువ్వేం చేస్తావు.." జ్ఞాని అడిగారు. "నేను ఎక్కడికైనా వెళ్లి అక్కడ ఏదో ఒక పని చేసుకుంటూ బతుకుతాను" అన్నాడు రాజు.

"ఎక్కడికో వెళ్ళడం ఎందుకు.. ఇక్కడే నా వద్దే నా ప్రతినిధిగా ఉండి నువ్వు చెయ్యవలసిన పనులు చెయ్యి. ఎందుకంటే నీకు పరిపాలన తెలుసు.
చెయ్యగల సమర్దుడివి, ఓ ఏడాది తర్వాత వచ్చి లెక్కలు వగైరా చూస్తాను" అని చెప్పారు జ్ఞాని.

ఒక సంవత్సరం గడిచింది, జ్ఞాని రాజుని చూడటానికి వచ్చారు, రాజు మొహంలో ఆనందం కనిపిస్తోంది. ఎక్కడా ఆవ గింజంత దిగులు కనిపించడం లేదు. జ్ఞానిని సాదరంగా ఆహ్వానించి సపర్యలు చేసి లెక్కలు చూపించాడు రాజు.

"ఆ లెక్కలు అలా పక్కన పెట్టు గానీ నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు" అడిగారు జ్ఞాని. "హాయిగా ఉన్నాను. కావలసినంత ప్రశాంతత అనుకోండి. మునుపెప్పుడు ఇంత హాయిగా లేను. మీకు నా ధన్యవాదాలు" అన్నాడు రాజు.

"సరేగానీ పూర్వం నువ్వు చేసిన పనులకు, ఇప్పుడు నువ్వు చేస్తున్న పనులకు ఏవైనా తేడాలు తెలిసాయా" అని అడిగారు జ్ఞాని. "లేదు.. అప్పుడు చేసే పనులే ఇప్పుడు కూడా చేస్తున్నాను" రాజు సమాధానమిచ్చాడు.

"అప్పుడు ఎందుకు మానసిక ఒత్తిడికి లోనయ్యావు.. ఇప్పుడు ఆ ఒత్తిడి లేదా.." అని జ్ఞాని అడగ్గా రాజు అసలు విషయం తెలిసి జ్ఞాని వంక చూసాడు.

అప్పుడు జ్ఞాని ఇలా అన్నారు...

"అప్పట్లో నువ్వు ఇది నా పని ఇది నాది అని ఆలోచించావు. ఇప్పుడు నువ్వు ఇది నాది కాదు. నేనిక్కడ కేవలం ఒక ప్రతినిధిని అనుకున్నావు. ఇది ఒక బాధ్యత మాత్రమే అనుకుంటున్నావు ఆ ఆలోచన మనసులోకి వచ్చిననుండీ నీలో మార్పు మొదలయ్యింది కనుక ఆ మనస్సే అన్నింటికీ మూలం...
నేను అనే ఆలోచన వచ్చేటప్పుడల్లా ఆన్ని ఒత్తిడులూ, సమస్యలూ నీ చుట్టూ సుడులు తిరుగుతుంటాయి. అలా కాకుండా ఈ ప్రపంచం నాది కాదు.
ఈ దేహం నాది కాదు. ఈ ఊపిరి నాది కాదు... ఇవన్నీ నాకు ఇచ్చినవే తప్ప నా సొంతం కావు.. అని నువ్వు గ్రహిస్తే సమస్యలన్నీ బాధలన్నీ పారిపోతాయి. ఈ మానసిక స్థితితోనే నువ్వు పరిపాలించు. నీ విధులు నువ్వు సాగించు. నీకు కావలసినంత ప్రశాంతత లభిస్తుంది".

గోడకు ఎదురుగా

 *🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 339 / Osho Daily Meditations  - 339 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🍀 339. గోడకు ఎదురుగా 🍀*

*🕉. కేవలం గోడకు అభిముఖంగా కూర్చోండి. గోడ చాలా అందంగా ఉంది. వెళ్ళడానికి ఏ చోటూ లేదు. 🕉*

*బోధిధర్మ తొమ్మిదేళ్లు గోడకు ఎదురుగా కూర్చున్నాడు, ఏమీ చేయకుండా - కేవలం కూర్చున్నాడు. ఐతిహ్యము  ప్రకారం అతని కాళ్లు ఎండి పోయాయి. నాకు అది ఒక ప్రతీక. అన్ని కదలికలు క్షీణించాయని దీని అర్థం, ఎందుకంటే అన్ని ప్రేరణలు వాడిపోయాయి. అతను ఎక్కడికీ వెళ్లడం లేదు. కదలాలనే కోరిక లేదు, సాధించాలనే లక్ష్యం లేదు - మరియు అతను సాధ్యమయ్యే గొప్పదాన్ని సాధించాడు. అతను భూమిపై నడిచిన అరుదైన ఆత్మలలో ఒకడు. కేవలం గోడ ముందు కూర్చొని, అతను ఏమీ చేయకుండా ఏ  పద్ధతిని అనుసరించకుండా ఏమీ ఉపయోగించకుండా ప్రతిదీ సాధించాడు. ఇదొక్కటే అసలైన పద్ధతి.*

*కాబట్టి మీరు కూర్చున్నప్పుడల్లా గోడకు అభిముఖంగా కూర్చోండి. గోడ చాలా అందంగా ఉంది. వెళ్ళడానికి ఏ చోటూ లేదు. అక్కడ ఒక చిత్రాన్ని కూడా ఉంచవద్దు; కేవలం ఒక సాదా గోడ ఉండనివ్వండి. చూడటానికి ఏమీ లేనప్పుడు, చూడాలనే మీ ఆసక్తి అంతరించి పోతుంది. కేవలం సాదా గోడను చూడడం ద్వారా, మీ లోపల సమాంతర శూన్యత మరియు సాదాసీదత ఏర్పడతాయి. గోడకు సమాంతరంగా మరొక గోడ పుడుతుంది-- ఆలోచన లేని స్థితిది. కళ్లు తెరిచి ఉంచి ఆనందించండి. చిరునవ్వు; ఒక కూని రాగం  తియ్యండి, ఊగిసలాడండి. కొన్నిసార్లు మీరు నృత్యం చేయవచ్చు- కాని గోడకు ఎదురుగా వెళ్లండి; అది మీ ధ్యాన వస్తువుగా ఉండనివ్వండి.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations  - 339 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 339. FACING THE WALL 🍀*

*🕉.  Just sit facing the wall. The wall is very beautiful. There is nowhere to go.  🕉*

*Bodhidharma sat for nine years just facing the wall, doing nothing-just sitting. The tradition has it that his legs withered away. To me that is symbolic. It simply means that all movements withered away, because all motivation withered away. He was not going anywhere. There was no desire to move, no goal to achieve-and he achieved the greatest that is possible. He is one of the rarest souls that has ever walked on earth. And just sitting before a wall he achieved everything, by not doing anything, using no technique, no method, nothing. This was the only technique.*

*So whenever you sit, just sit facing the wall. The wall is very beautiful. There is nowhere to go. Don't even put a picture there; just have a plain wall. When there is nothing to see, by and by your interest in seeing disappears. By just facing a plain wall, inside you parallel emptiness and plainness arise. Parallel to the wall another wall arises-- of no-thought. Remain open and delight. Smile; hum a tune or sway. Sometimes you can dance-but go on facing the wall; let it be your object of meditation.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

మీరు కంప్యూటర్ , మొబైలు ముందు ఎక్కువ సమయం పని చేస్తుంటే, మీ కంటి చూపును కాపాడుకోవడానికి మీరు చేయగలిగే అనేక విషయాలు ఉన్నాయి:

 మీరు కంప్యూటర్ , మొబైలు ముందు ఎక్కువ సమయం పని చేస్తుంటే, మీ కంటి చూపును కాపాడుకోవడానికి మీరు చేయగలిగే అనేక విషయాలు ఉన్నాయి:

*1.-తరచుగా బ్లింక్ చేయండి:* రెప్పవేయడం మీ కళ్ళను తేమగా ఉంచడంలో సహాయపడుతుంది, ఇది చాలా ముఖ్యం ఎందుకంటే పొడి కళ్ళు ఒత్తిడి మరియు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ప్రత్యేకించి మీరు ఎక్కువ సమయం పాటు స్క్రీన్‌ని చూస్తున్నప్పుడు తరచుగా రెప్పవేయడానికి ప్రయత్నం చేయండి.
*2.-విరామాలు తీసుకోండి:* స్క్రీన్‌ని చూడటం నుండి క్రమం తప్పకుండా విరామం తీసుకోవడం కంటి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రతి గంటకు ఒకసారి విశ్రాంతి తీసుకోవాలని మీకు గుర్తు చేయడానికి టైమర్‌ని సెట్ చేయండి మరియు మీ స్క్రీన్ నుండి దూరంగా చూసేందుకు మరియు మీ కాళ్లను సాగదీయడానికి ఈ సమయాన్ని ఉపయోగించండి.
మీ స్క్రీన్‌ని సర్దుబాటు చేయండి: మీ కంప్యూటర్ స్క్రీన్‌ను స్క్రీన్ పైభాగం కంటి స్థాయి వద్ద లేదా కొంచెం దిగువన ఉండేలా ఉంచినట్లు నిర్ధారించుకోండి మరియు అది మీ కళ్ళకు చాలా దగ్గరగా లేదా చాలా దూరంగా ఉండదు. కాంతిని తగ్గించడానికి మరియు మీ కళ్లపై సులభంగా ఉండేలా చేయడానికి మీరు మీ స్క్రీన్ ప్రకాశాన్ని మరియు కాంట్రాస్ట్‌ను కూడా సర్దుబాటు చేయాలి.
*3.-యాంటీ గ్లేర్ స్క్రీన్‌ని ఉపయోగించండి:*
యాంటీ గ్లేర్ స్క్రీన్ మీ కళ్ళు బహిర్గతమయ్యే హానికరమైన నీలి కాంతిని తగ్గించడంలో సహాయపడుతుంది.
*4.-అద్దాలు ధరించండి:* మీరు ఇప్పటికే గ్లాసెస్ లేదా కాంటాక్ట్‌లను ధరించినట్లయితే, యాంటీ గ్లేర్ కోటింగ్‌తో కూడిన కంప్యూటర్ గ్లాసెస్‌ని పొందడం గురించి ఆలోచించండి. మీరు ఇప్పటికే అద్దాలు ధరించకుంటే, కంటి పరీక్ష చేయించుకుని, కంప్యూటర్ గ్లాసెస్ లేదా స్క్రీన్ వినియోగం కోసం రూపొందించిన ప్రత్యేక జత కాంటాక్ట్‌లను ధరించడం వల్ల మీరు ప్రయోజనం పొందవచ్చా అని మీ వైద్యుడితో చర్చించండి.
మంచి భంగిమను పాటించండి: మంచి భంగిమ కంటి ఒత్తిడి మరియు మెడ మరియు వెన్నునొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు మంచి దిగువ వీపు మద్దతుతో కుర్చీలో కూర్చున్నారని మరియు మీ పాదాలు నేలపై చదునుగా ఉన్నాయని నిర్ధారించుకోండి.

*Anti reflective coating ఉన్న glasses వాడడం మంచిది. ఈ మధ్య 20-20-20 రూల్ గురించి విన్నాను. అంటే కంప్యూటర్ ముందు పని చేస్తున్నపుడు ప్రతీ 20 నిమిషాలకు ఒకసారి 20 సెకండ్ల పాటు 20 మీటర్ల దూరంలో ఉన్న వస్తువులను చూడటం మంచిదని. కనురెప్పలు వాల్చకుండ పని చేయడం మంచిది కాదు.*

       ఈ దశలను తీసుకోవడం ద్వారా, మీరు మీ కంటి చూపును రక్షించుకోవడంలో సహాయపడవచ్చు మరియు దీర్ఘకాలం స్క్రీన్ వినియోగానికి సంబంధించిన కంటి ఒత్తిడి లేదా ఇతర దృష్టి సమస్యలను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

✍🏼 నేటి కథ ✍🏼* *కావ్‌.. కావ్‌.. కాకి నేర్పిన పాఠం!

 *✍🏼 నేటి కథ ✍🏼*


*కావ్‌.. కావ్‌.. కాకి నేర్పిన పాఠం!*


నరసాపురంలో ఉండే శాంతమ్మకు బడాయెక్కువ. అందరూ తననే పొగడాలని ఆశ. ఆ ఉబలాటంతో తన గురించి తాను గొప్పలు చెప్పుకునేది. ఉదయం నీళ్ల కోసం బావికెళ్లినప్పుడు, సాయంత్రం ఆడవాళ్లంతా అరుగుల మీద చేరినప్పుడు.. ఇలా అప్పుడూ ఇప్పుడూ అని లేకుండా గొప్పలు చెప్పుకునేది.
అవకాశం కల్పించుకుని మరీ వసపిట్టలా వాగేది. తను కొనుక్కున్న పదివేల రూపాయల పట్టుచీర నుంచి వాళ్ల అన్నయ్య చేయించిన ఎర్రరాళ్ల హారం వరకు ప్రదర్శనకు పెట్టేది. తన చేత్తో నాటిన ఏ మొక్కైనా బతికి తీరాల్సిందేనని బీరాలు పోయేది.
చివరికి శాంతమ్మ కనిపిస్తే చాలు.. ఇరుగుపొరుగు వాళ్లందరూ మొహం చిట్లించుకోవడం మొదలు పెట్టారు. శాంతమ్మ మాత్రం వాళ్లకు ఏడుపెక్కువని భావించేది.
‘మనకు మంచి ఇరుగూపొరుగూ దొరకలేదండీ. మంచి చీర కొన్నా, కొత్త నగలు చేయించుకున్నా ఒక మెప్పూ లేదు. మేకతోలూ లేదు ఏడుపుగొట్టు మొహాలు’ అంటూ భర్త హరికి చెప్పుకొని బాధపడింది.
‘అరె! ఎంత అందమైన చీర.. పదివేలు పోసి కొన్న నారింజరంగు పట్టుచీర.. చూపిస్తే మెచ్చుకోవడానికి ఒక్కళ్ల నోరు కూడా పెగలలేదు’ అని ఒక రోజంతా శాంతమ్మ గోలతోనే హరికి సరిపోయింది.
గోడ మీద నుంచి కళ్లు తిప్పుకోలేనంత అందంగా కనిపిస్తున్నాయి.. తన ఇంట్లో గులాబీలు. నాటిన మీ చెయ్యి మంచిదంటే వాళ్ల కిరీటాలు పడిపోతాయా?’ అని మరో రోజు ఆమె బాధ.
భార్య ధోరణితో హరికి చిరాకేసింది. జాలి కలిగింది. ఆమెకు అర్థమయ్యేలా చెప్పే అవకాశం కోసం ఎదురుచూడసాగాడు. ఒక రోజు శాంతమ్మ జాజిపూలు మాల కట్టుకుంటోంది.
కావ్‌.. కావ్‌.. కాకి నేర్పిన పాఠం!
‘శాంతా..! మన మామిడి చెట్టు మీద ఒక కాకి గూడు కట్టుకుంటోంది.. చూశావా?’ అన్నాడు హరి. ‘అయితే?’ అంది శాంతమ్మ. ‘పాపం.. ఆ కాకి ఎంత కష్టపడుతోంది. ఎక్కడెక్కడి నుంచో చెట్టూ చేమా వెతికి పుల్లా పుల్లా ఏరి తెచ్చుకుని గూడు కట్టుకోవాలి. ఇలా ఎన్ని పుల్లలు పోగేస్తే ఒక గూడయ్యేను? ఎంతైనా కాకి చాలా గొప్పది’ అన్నాడు హరి.
శాంతమ్మ తన భర్తను విచిత్రంగా చూసి పూలు కట్టుకోసాగింది.
‘పైగా గడ్డి పరకలు తెచ్చి, పుల్లలు పిల్లలకు గుచ్చుకోకుండా మెత్తగా చేస్తోంది. ఎంత గొప్ప విషయం’ అన్నాడు హరి ఆగకుండా.
శాంతమ్మకు చిర్రెత్తుకొచ్చింది. ‘ఏంటండీ గొప్ప? ఎవరికి గొప్ప. దాని గూడు అది కట్టుకుంటోంది. అదేమన్నా పక్క కాకులకు ఆశ్రయం ఇస్తోందా ఏంటి?’ అంది విసుగ్గా.
దొరికావులే... అన్నట్లుగా నవ్వాడు హరి. ‘నువ్వూ అంతేకదా! నీకు నువ్వు నగలు, చీరలు కొనుక్కుంటున్నావు. అంతేగా.. నువ్వు కొనుక్కున్న వాటిని చూడమంటే అలాగే ఉంటుంది మరి ఇరుగు పొరుగు వాళ్లకు కూడా’ అన్నాడు.
శాంతమ్మ కళ్లు తెరుచుకున్నాయి. ‘నిజమే కదా! వాళ్లను అనవసరంగా ఏడుపుగొట్టు మొహాలని తిట్టుకున్నాను’ అని బాధ పడింది.
నాలుగురోజుల తర్వాత.. ఆ వీధి కాపలాదారుడు రంగయ్య అనారోగ్యంతో మంచం పట్టాడు. వీధి చివర పాకలో ఒంటరిగా ఉంటాడతను. శాంతమ్మ వేడి వేడిగా అన్నం, పప్పు, పులుసు ఒక పళ్లెంలో పెట్టింది. ఒక గ్లాసులో చిక్కని మజ్జిగ తీసుకుంది. పైన అరిటాకు కప్పి తీసుకువెళ్లి రంగయ్యకిచ్చింది.
ఆమెను చూసి ఆశ్చర్యంతో లేచి కూర్చున్నాడు రంగయ్య. అరిటాకు తీసి చూసిన అతని కళ్లు మెరిసిపోయాయి. చేతులెత్తి దండం పెట్టాడు.
ఇంటికొస్తున్న శాంతమ్మను ఎదురింటి కల్యాణి ‘చాలా మంచి పని చేశారొదినా’ అంటూ పిలిచి మరీ మెచ్చుకుంది. పక్కింటి వనజ కూడా ‘అవునవును.. అసలు మాకీ ఆలోచనే రాలేదు. మీది మంచి మనసు. నేను సాయంత్రం రొట్టెలు, కూర పంపుతాను’ అంది.
ఇన్నాళ్లూ అందరూ తనను పొగడాలని ఎదురుచూసిన శాంతమ్మను ఈ రోజు చాలామంది పొగిడారు.
కానీ విచిత్రంగా ఆమెకు అవి సంతోషాన్ని ఇవ్వలేదు. ఆకలితో నీరసంగా ఉన్న రంగయ్య కళ్లలో మెరిసిన కృతజ్ఞత కలిగించిన సంతోషం ముందు ఆమెకు ఇవి చాలా చిన్నవిగా తోచాయి.
నిజమైన సంతోషం, పొందిన పొగడ్తలో కాదు.. చేసిన మంచి పనిలో ఉందని తెలుసుకుని సంతృప్తి పడింది.
ఆ రోజు నుంచి బడాయి శాంతమ్మలో వచ్చిన మార్పు అందర్నీ ఆశ్చర్యపరిచింది.

*- గుడిపూడి రాధికారాణి*

Monday, May 1, 2023

కోపం ఒక శాపం

 *కోపం ఒక శాపం*

కొందరికి కోపం ముక్కు మీదే ఉంటుంది. చీటికిమాటికి చిరచిరలాడుతూ ఆగ్రహం ప్రదర్శిస్తారు. మనిషికి కోపం శత్రువు లాంటిది. అది ఎందరినో శత్రువుల్ని తెచ్చిపెడుతుంది. ఎన్నో అనర్థాలకు కారణమవుతుంది. మనసుకు నచ్చని మాటలు విన్నా, నచ్చనివారిని చూసినా కొందరికి ఇట్టే కోపం వచ్చేస్తుంది. అలాంటప్పుడు సరిపడని మాటలను పట్టించుకొనకపోవడం, కోపం కలిగించేవారి నుంచి మన దృష్టిని మరల్చుకోవడం మంచి పరిష్కారం. తగిన కారణం ఉంటే కోపాన్ని ప్రదర్శించి నయానో భయానో ఎదుటివాడి తప్పిదాలను సరిదిద్దే ప్రయత్నం చేయకపోతే సంభవించే దుష్ఫలితాలకు మనమే కారణం కావచ్చు. సరైన పద్ధతిలో కోపాన్ని ప్రదర్శించడం అనేది అంత సులభం కాదన్నది విదుర నీతి.

అనవసరంగా క్రోధాన్ని ప్రద రించడం అనేది మనం విషం తాగుతూ ఎదుటివాణ్ని చావాలని కోరుకోవడం లాంటిది. ఎవరిపైనైనా విసిరేందుకు ఎర్రగా కాలిన నిప్పు కణికలను చేతిలోకి తీసుకోవడం లాంటిదే కోపం, క్రోధం ప్రతీకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఆది. సరైన పద్ధతి కాదని బుద్ధుడు. అంటాడు. బలవంతులైనవారు క్షమిస్తారు. విజ్ఞత కలిగినవారు అసలు పట్టించుకోరు. దీనితో మనకు కోపం తెప్పించినవాడు అవమానం చెందుతాడు
పంచవటిలో సీత అపహరణకు గురైనప్పుడు శ్రీరాముడు ఎంతో వేదనతో గోదావరిని, చెట్టు గుట్టలను, పశుపక్ష్యాదులను ఆమె ఉనికిని తెలపమని వేడుకొంటాడు. గోదావరి మారు పలకక జలజలా ప్రవహిస్తూనే ఉంటుంది. పశువులు మోరలెత్తి శ్రీరాముడి వైపు జాలిగా చూస్తాయే కాని బదులు పలకవు. అప్పుడు రాముడికి వచ్చిన కోపం చూసి ప్రకృతి మొత్తం వణికిపోతుంది. తన వేదనను. పట్టించుకోని ఈ పృధ్విని, సీత జాడ తెలపలేని జీవజాలాన్ని నాశనం చేస్తానంటూ బాణాన్ని ఎక్కుపెడతాడు. అప్పుడు సౌమిత్రి- 'అన్నా, ఈ కోపం నీకు శత్రువు ఆవుతుంది. నిగ్రహించు. స్వభావరీత్యా నీవు మృదుస్వభావుడివి. ఆత్మనిగ్రహం కలవాడివి. నీ బాణంలోని అగ్నికీలలు ప్రపంచాన్ని పటాపంచలు చేస్తే వదిన సీతమ్మను ఎక్కడని వెతుకుతావు. ఆ మాత సైతం నీ బాణాగ్నికి ఆహుతి అవుతుంది. కదా! నీ కోసం వెనక ఉన్న ప్రేమను వేదనను అర్ధం చేసుకొన్నవారు మనకు స్నేహితులుగా విశ్వాసపాత్రులుగా లభించక మానరు. వెతికితే ఏదైనా పరిష్కారం దొరుకుతుంది. కోపం కన్నా మనకు శత్రువు వధ ముఖ్యం. ఇప్పుడు మన కర్తవ్యం. సీతమ్మ అన్వేషణ' అని రాముణ్ని శాంతపరుస్తాడు.

సమాజ పరిస్థితులకు తగ్గట్టు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కోపాన్ని మన ఆదుపులో ఉంచే ఓర్పు నేర్చుకోవాలి. ఓర్పు వల్ల జటిలమైన పనులు సైతం సఫలం అవుతాయి. జాతి ప్రయోజనాన్ని ఆశించి కోపం కనబరచవచ్చు. ఆగ్రహం ప్రదర్శించేందుకు గాంధీజీ సత్యాగ్రహాన్ని ఎంచుకున్నారు. కోపం నేరుగా ఉన్నట్టుండి పుట్టుకు రాదు. దానికి కారణం కావాలి. మౌన పోరాటం, నిరాహార దీక్ష, అలగడం, సహాయ నిరాకరణ లాంటి 'మెతక కోపపు పద్ధతులు సమాజానికి మేలు చేస్తాయి. కోపం వ్యక్తిగతం కాకూడదని జిడ్డు కృష్ణమూర్తి 'ది సాంగ్స్ ఆఫ్ లైఫ్'లో సూచించారు. వ్యక్తిగతం అయితే మాత్రం కోపం ఒక శాపమే..

అప్పరును రమాకాంతరావు

కోపం మోతాదులు* 🥀 ✍️ శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి వారు.

 🥀 *కోపం మోతాదులు* 🥀
✍️ శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి వారు.
🙏🌺🌺🌺🌺🔯🌺🌺🌺🌺🙏

కోపం అనునది చాలా చెడ్డగుణం. అగ్రస్థానం పొందిన దుర్గుణాల్లో కోపం కూడా చోటుచేసుకుంది. కోపం వచ్చినపుడు మానవుడు మానవుడుగా ఉండడు, దానవుడుగా మారిపోతాడు. వికృతరూపం ధరిస్తాడు, చేయరాని పనులు చేస్తాడు. ఆ వికారం పోయేవరకు అతడు తన స్వాధీనంలో ఉండడు.

కోప తీవ్రతలో ఎదుటివాడెవడో తెల్సుకొనే పరిస్థితుల్లో మానవుడుండడు. కోపవేగంలో ఆప్త బంధువులను కూడా వైరులుగా జమకడతాడు. అనేక అపచారాలు చేస్తాడు.

కల్లు త్రాగినవాని చేష్టలకు, కోపిష్టి చర్యలకు తేడా ఎక్కువ ఉండదు. కల్లు కైపులో మనుజుడెట్లా దిగజారిపోతాడో, హీనమైన పనులు చేస్తాడో, అట్లే కోపం కైపులో కూడా మానవుడు నికృష్టమైన పనులను చేస్తూ వుంటాడు.

ఉత్తముడైనవానికి కోపం రానేరాదు. ఒకవేళ ఎపుడైనా వచ్చినా దానికి వివేకంతో వెంటనే బ్రేకు వేస్తాడు. అపుడది వచ్చిన దారినే తిరిగి వెళ్తుంది. ఉత్తముడైనవానికి ఎపుడయినా కోపం వస్తే అది నీటిమీద వ్రాత వంటిది. క్షణంలో మాయమైపోతుంది. 

ఇక మధ్యమునకు కోపంవస్తే ఆ కోపం దాదాపు రెండు ఘడియల సేపు ఉంటుంది. ఆ కొద్దిసేపు అతనిని పీడిస్తూంటుంది. కాని వెంటనే అతడు తెలివి తెచ్చుకొని వివేక సహాయంతో దానిని సాగనంపుతాడు. మధ్యముల కోపం ఇసుకపై వ్రాసిన అక్షరం వంటిది. ఇసుకపై వ్రాయబడినటువంటి అక్షరాలు కొద్దిసేపుండి, తర్వాత గాలికి చెదరిపోతాయి.

ఇక అధముడికి కోపం వస్తే అది దాదాపు 24 గంటలసేపు ఉంటుంది. అనగా, ఒక రాత్రి పగలు అతనిని వేధిస్తూంటుంది. మరల నెమ్మదిగా అది తగ్గిపోతుంది. అట్టివాని కోపం పలకమీద వ్రాసిన వ్రాతతో పోల్చవచ్చును. 

ఇక అధమాధముడికి కోపం వస్తే అతడు చచ్చేవరకు అది పోదు. అట్టి కోపంతో యావజ్జీవితం అతడు సతమతమై పోతూంటాడు. అట్టివాని కోపం శిలాఫలకంపై చెక్కబడిన అక్షరం వంటిది.

కాబట్టి వివేకవంతుడు ఈ కోపము అనే రాక్షసుణ్ణి జీవితంలో ఎపుడు కూడా దరికి చేర్చకూడదు. ఒకవేళ చేర్చినా, అపాయం ముంచుకొస్తుంది. అది సాధకునకు 'నిత్యవైరి' అని గీతా చార్యులు చెప్పనే చెప్పారు.

కావున విజ్ఞుడైనవాడు తన హృదయ పీఠమున దానికేమాత్రం చోటీయక బహు జాగరూకుడై మెలగాలి. వివేకమను ఆయుధాన్ని ఎపుడూ దగ్గరుంచుకొని కోప శత్రువు దరికి చేరకుండా చూస్తూండాలి. అపుడే జీవితం ఆనందమయంగా ఉంటుంది.

గాలిలేని చోట గల దీపం నిశ్చలంగా నిర్మలముగా వెలుగునట్లు, అతని జ్ఞాన దీపం కూడా చక్కగా వెలుగుతుంది. జీవితానికి వెలుగు నిస్తుంది. ఆనందాన్ని అందిస్తుంది. కావున జీవుడా! ఉత్తముల కోవలో చేరుకో.  కోపానికి తిలాంజలి ఇయ్యి. ఆ పాడు వికారానికి స్వస్తి చెప్పు. జీవితాన్ని వసంతంగా చేసుకో. జాగ్రత్త వహించు.

కోపాది దుష్ట చోరులకు నీ హృదయ ఫలకంలో ఏ మాత్రం తావివ్వకు. అపుడే జీవితం శోభిస్తుంది. నీకు ఎనలేని సౌఖ్యం చేకూరుతుంది. కనుక చిత్తమందు ఏ వికారాలు లేక నిశ్చలంగా, నిర్వికారంగా జీవితం గడుపు. ఆనందాన్ని అనుభవించు. జీవన్ముక్తుడవై విలసిల్లు. అదే పరమార్థం. అదే జీవుని గమ్యం.

*ఉత్తమేక్షణకోపం స్యాన్మధ్యమే ఘటికాద్వయమ్!*
*అధమే తు అహోరాత్రం నీచే తు మరణాంతకమ్!!*

🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 
🙏 *లోకాస్సమస్తా సుఖినోభవంతు*
🚩 *హిందువునని గర్వించు*
🚩 *హిందువుగా జీవించు*

*సేకరణ:*

శ్రీరమణీయం: గ్రహింపు అనుభవంగా, జ్ఞాపకంగా మనసు ఏ విధంగా అందిస్తుంది ?

 🙏🕉🙏                    ...... *"శ్రీ"*

                 💖💖💖
         💖💖 *"541"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     🌼💖🌼💖🌼💖🌼
           🌼💖🕉💖🌼
                 🌼💖🌼
                       🌼
*"గ్రహింపు అనుభవంగా, జ్ఞాపకంగా మనసు ఏ విధంగా అందిస్తుంది ?"*

*"మనకు అనేక విషయాలు గ్రహింపులో ఉన్నా, మన ధ్యాస దేనిపై ఉంటుందో అదే మన అనుభవంలోకి వస్తుంది. ప్రతి గ్రహింపు మనసులో జ్ఞాపకంగా ఉంటుంది. అందుకే నిద్ర మనకు అనుభవంలో లేకపోయినా దానికి సంబంధించిన శాంతిని మనసు జ్ఞాపకంగా అందించగలుగుతుంది. సినిమాలో లీనమైన మనసు ఆ కథాంశాన్నే గమనిస్తూ ఉంటుంది. అదే సమయంలో ఏసి నిలిపివేసినందువల్ల వచ్చే ఉక్కపోతను, ఇరుకుగా కూర్చోవడం వల్ల వచ్చే కాళ్ళ నొప్పులను కూడా గ్రహిస్తూనే ఉంటుంది. కనుకనే ధ్యాస మారగానే అవి తిరిగి గమనింపులోకి వస్తాయి. అది కూడా చాలా సేపటి నుండి కాళ్ళు నొప్పెడుతున్న విషయంతో సహా తెలుస్తుంది. అంటే మనసు తాను గ్రహించిన విషయాన్ని అప్పటికి అనుభవంగా అందించలేకపోయినా, జ్ఞాపకంగా అందించేటప్పుడు ఏదీ మినహాయించకుండానే అందిస్తుందని అర్థమవుతుంది !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*
               🌼💖🌼💖🌼
                      🌼🕉️🌼

::::: సంతోషం vs ఆనందం :::::

 *::::: సంతోషం vs ఆనందం :::::::*

1)సంతోషం..అనేక ఉద్వేగాలలో ఒకటి
ఆనందం..  ఇది ఒక మానసిక స్థితి
2)సంతోషం.. ఏదో ఒక దానిని పొందటం ద్వారా వచ్చేది.
ఆనందం...ఏ రకమైన ఉద్వేగాలు లేనప్పుడు ఉండేది.
3)సంతోషం.. తాత్కాలికం.
ఆనందం..శాశ్వతం.చెరుపుకోకపోతే.
4)సంతోషం.. సంపాదించాలి
ఆనందం.. దానంతట అది వుంటుంది.
5)సంతోషం.. మనస్సుది
ఆనందం ... హృదయానిది.
6)సంతోషం....లౌకిక మైనది
ఆనందం....... అలౌకికం.
7) సంతోషం...కర్తృత్వం తో వనకూడేది.
ఆనందం.... కర్త లేనిది 


*షణ్ముఖానంద 98666 99774*