Wednesday, March 26, 2025

 *కర్మ ‘యోగమే’* 

*ఇది నా పని. ఈ క్రమంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా నేను వెనకడుగు వేయను. గెలుపోటముల గురించి నాకు దిగులు లేదు. నాకప్పగించిన పని చేయడం నా కనీస బాధ్యత. భగవద్గీతలో కర్మయోగం స్వధర్నాన్ని చెప్తోంది. కర్మను చెయ్యి. ఫలితాన్ని ఆశించకు అనేది ఇక్కడ చెప్తోంది. ఏది చెయ్యాలనుకున్నావో దాన్ని చేసుకుంటూ పోవాలి, అది మంచిగా ఉంటే చాలు. ఒకరిని నొప్పించకూడదు. నాకు తెలిసిన ఓ తమిళకవి కూడా తానో గొప్ప కవి అవుతానన్న ఆశతో కలం పట్టలేదు. అనుకున్నది రాస్తూ పోయారు. అడిగిన వారికల్లా రాసిచ్చారు. కథలో వచ్చే సంఘటనలకు అనుగుణంగా ఆయన పాటలు రాస్తారు. ఎమిలీ జోలా కలంలా రాసుకుంటూ పోతూ రాలిపోవాలనుకున్నారు. ఈ క్రమంలో ఎదురైన అవాంతరాలను ఆయన పట్టించుకోలేదు. తాననుకున్న వాటిని రాయాలనుకుంటూ సాగిపోయారు.* 

*పయనమార్గం ఎంతో పొడవు. దారి పొడవునా ఏవేవో కలయికలు. విడిపోవడాలు. జింకలు మాత్రమే నా ఎదురుపడ్డాయి? పాములూ, కోతులూ వచ్చాయి. అయినా అవేవీ ఆ కవి స్వధర్మాన్ని అడ్డుకోలేదు. ఆ కవి చేతిలో కొంత డబ్బుండి దాన్ని ఎవరైనా అడిగితే ఇవ్వాలనుకున్నారు. కానీ దానికోసం ఎవరూ రాలేదని నిర్ధారించుకున్న తర్వాతే ఆయన వాటిని ఖర్చు పెట్టారు. ఒకవేళ తననుంచి బలవంతంగా ఆ డబ్బుని ఎవరైనా లాక్కుపోయినా ఆయన తన స్వధర్మాన్ని వీడాలనుకో లేదు. అంతే తప్ప ఆ వ్యక్తిపై కోపమో ద్వేషమో పెంచుకోలేదు.*

*కర్మను యోగమనుకుంటే ఇతరులు పెట్టే ఇబ్బందులు నొప్పించవు. ఆ మహాకవి చెప్పిన మాటేమిటంటే మనిషి చేసే కర్మ అతని మరణంతోనే ముగియాలి. అతని కర్మ ముగిసిన తర్వాతే ఇతరులు ఆయనకు కర్మ చేస్తున్నారు. మనిషి తన కర్మలో ఇతరులకు పాలు పోయకున్నా ఇతరులు అతనికి చేసే కర్మలో పాలు పోస్తారు. భార్య మహా లక్ష్మిలా లేదని భర్త ఆమెకు చెయ్యవలసిన కర్మ నించి వెనక్కు తప్పుకోవడానికి వీల్లేదు. ఫలితం ఎలాగైనా ఉండొచ్చు. కానీ దానిని ఆశించి కర్మ చెయ్యకూడదన్నదే సనాతన సంస్కృతి తత్వం.*

*┈┉┅━❀꧁భగవద్గీత꧂❀━┅┉┈*
       *ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🏵️🌻🏵️ 🙏🕉️🙏 🏵️🌻🏵️

No comments:

Post a Comment