Wednesday, March 26, 2025

 *బ్రహ్మము గురించి బ్రహ్మమై చెప్పాలి*

ఆత్మసుఖం  ఒక్కటే  నిజం.  విషయసుఖాలన్నీ  మిథ్య.  ఒక్క  ఆత్మసుఖం  తప్పించి,  బాహ్యమైన  విషయసుఖాలు  ఏవి  అనుభవించినా  అవన్నీ  క్రమేపీ  దుఃఖంగా  మారిపోతాయి.  ఈ విషయం  తెలిసిన  గురువుకి  బాహ్యసుఖముల  యందు  స్పృహే  ఉండదు.

రమణమహర్షిగారి  దగ్గర  గొప్పతనం  ఏమిటంటే  Impersonal  life.  అంటే  లోపల  మనిషి  కనబడడుగాని  పని  జరుగుతూ  ఉంటుంది.  Individual  I  లేదు  అక్కడ..

మాకు  అరుణాచలంతో  సంబంధం  లేదు,  మీ గురించి  అరుణాచలం  వచ్చామండీ  అని  రమణమహర్షిగారితో అంటే,  "మీరు  అరుణాచలం  నాగురించి  వచ్చారు.  మరి  నేను  ఎవరి  గురించి  వచ్చాను?  నన్నెవడు  అరుణాచలం  తీసుకువచ్చాడో  వాడే  మిమ్మల్ని  తీసుకొచ్చాడు"  అన్నారు.  

ఇంకొకళ్ళు  మీ  అనుగ్రహం  వల్ల  మాకు  జ్ఞానం  రావాలి  అని  అంటే  "నాకెవడు  జ్ఞానమిచ్చాడో  వాడే  మీకూ  జ్ఞానం  ఇస్తాడు"  అన్నారు  రమణమహర్షి.

ఐశ్వర్యం  ఎవరిది?  ఈశ్వరుడిది.  నీకు  తెలివితేటలు  ఉన్నా  అవి  నీ సొంతం  కాదు.  ఈశ్వరుడు  ఇస్తే  వచ్చాయి.  ఈశ్వరుడు  ఇవ్వకపోతే  రావు.  అంతా  ఈశ్వరుడిదే.~Satyanarayana Choppakatla

No comments:

Post a Comment