*ధ్యాన😌 మార్గ* *ఒత్తిళ్లను ఎందుకు తగ్గించుకోవాలి...* 😌😌😌 మేథారావ్ ఒక సేల్స్ మేనేజరు. ఊరి బయట ప్రశాంతత కోసం ఇల్లు కట్టుకున్నాడు . ఉదయాన్నేవెళ్లి ఏ రాత్రికో వచ్చేవాడు. ఆ ఇంటిపై దొంగల కళ్ళు పడ్డాయి. కొన్నాళ్ళు దొంగలు ఆ ఇంటిని,ఆ యజమాని వింత ప్రవర్తనను పరిశీలించారు. ప్రతిరోజూ ఇంటికి వచ్చిన తర్వాత తన సంచిలో నుండి ఏవేవో తీసి, ఆవరణలో ఉన్న చెట్టు కింద దాచి, లోపలికి వెళ్ళేవాడు. కొన్నాళ్ళకు ఓ రాత్రి దొంగలు గోడ దూకి, చెట్టు కింద తవ్వారు. వాళ్ళకేం కనబడలేదు, దొరకలేదు. మళ్ళీమళ్ళీ వచ్చారు కానీ, ఏం దాస్తున్నాడో అర్థం కాలేదు. దొంగలకు ఆశ్చర్యం కలిగింది. ఒక రోజు ఆ దొంగలు మేథారావ్ ఇంటికి పోయి, " మీరేమీ అనుకోకపోతే మాకు ఒక విషయం తెలపండి. మేం దొంగలం. మీ ఇంట్లో చాలాసార్లు దొంగతనానికి వచ్చాం, ప్రతి రోజూ మీరు ఆ చెట్టు కింద ఏం దాస్తున్నారో తవ్వి చూసాం. ఏమీ కనిపించలేదు. మాకు ఇప్పటికీ అర్థం కాలేదు, అక్కడ ఏం దాచారా అని." మేథారావ్ నవ్వి, "నేనక్కడ ఏమీ దాచలేదు. పొరబడ్డారు." " కాదు కాదు! సంచిలో నుండి ఏదో తీసి దాచడం చూసాం." మేథారావ్ సీరియస్ గా, "నేనొక సేల్స్ మేనేజరును, నాకు పనీ, పనిలో ఒత్తిడి రెండూ ఎక్కువే. టెన్షన్, కోపం పెరిగిపోతాయి. ఆ ఒత్తిడిని ఇంట్లోకి తీసుకెళ్లి కుటుంబ వాతావరణాన్ని చెడగొట్టుకోలేను. అందుకే నా కష్టాలను, ఇబ్బందులను, కోపతాపాలను అన్నింటినీ ఆ చెట్టు కింద పాతేసి వెళ్తాను. ఆశ్చర్యంగా నా ఒత్తిళ్లు తగ్గి ప్రశాంతంగా గడుపుతున్నాను." దొంగలకు చెట్టు కింది రహస్యం అర్థమైంది. ఆ ఇంట్లో దొంగతనం చెయ్యలేకపోయారు కానీ, ఒక గొప్ప పాఠం నేర్చుకున్నారు.
No comments:
Post a Comment